MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అతియా శెట్టి భర్తను ఆటాడుకుంటున్న కన్నడ మాజీ క్రికెటర్లు.. సొంత రాష్ట్రం అన్న కనికరం కూడా లేకుండా..!

అతియా శెట్టి భర్తను ఆటాడుకుంటున్న కన్నడ మాజీ క్రికెటర్లు.. సొంత రాష్ట్రం అన్న కనికరం కూడా లేకుండా..!

IPL 2023: సునీల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టి కొద్దిరోజుల క్రితమే  టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ను పెళ్లాడింది. ఈ కర్నాటక క్రికెటర్ ఆడినా ఆడకున్నా   ట్విటర్ లో ట్రెండ్ అవుతాడు.   గత కొంతకాలంగా  జిడ్డు బ్యాటింగ్ అన్న పదానికి పర్యాయపదంగా మారిన రాహుల్ ఆటపై  కర్నాటక మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. 

2 Min read
Author : Srinivas M
Published : Apr 24 2023, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చాలా రోజులుగా టీమిండియా  మాజీ పేసర్ వెంకటేశ్  ప్రసాద్.. కెఎల్ రాహుల్ ను టార్గెట్ గా చేసుకుని తీవ్రమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు తాజాగా   ప్రసాద్ కు మరో  కన్నడ క్రికెటర్ దొడ్డ గణేశ్ కూడా  జత కలిశాడు. ఐపీఎల్ లో రాహుల్  ఆట చూసిన ఆగ్రహంతో గణేశ్..  అతడిపై విమర్శల బాణాలను బలంగా వదులుతున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

లక్నో - రాజస్తాన్ మ్యాచ్ లో  రాహుల్ చెత్త బ్యాటింగ్ చూసిన తర్వాత దొడ్డ గణేశ్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘కెఎల్ రాహుల్ ఇదే తరహాలో చెత్త ఆట ఆడితే మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు రావడం మంచిది.  2018లో మాదిరిగా దూకుడుగా ఆడే విధానంలో ఆడితే తప్ప  అతడు   ఓపెనర్ గా వచ్చి  వేస్ట్. మరీ ఇంత బోరింగ్ గా అసలు ఆట మీద ఆసక్తే లేనట్టుగా ఆటను మారుస్తున్నాడు..  

36

లక్నో నాలుగైదు మ్యాచ్ లను  ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అప్పుడు గానీ రాహుల్ బ్యాటింగ్ చేసే విధానం మారదు.    లక్నో ఓడిపోతే అయినా  అతడు తన విధానాన్ని మార్చుకుంటాడేమో..’ అని  పేర్కొన్నాడు.  

46

తాజాగా సీఎస్కే -  కేకేఆర్ తో మ్యాచ్ లో  చెన్నై బ్యాటర్ అజింక్యా రహానే   ధాటిగా ఆడిన తర్వాత అతడిపై  ప్రశంసలు కురిపిస్తూ..  ‘రహానే అద్భుతంగా ఆడుతున్నాడు.   ఈ ఇంటెంట్ తో ఆడితే అద్భుతాలు చేయొచ్చని  నిరూపిస్తున్నాడు.  కెఎల్ రాహుల్ దీనిని అర్థం చేసుకుంటే మంచిది..’ అని  పేర్కొన్నాడు.  

56

గుజరాత్  -  లక్నో మ్యాచ్ తర్వాత వెంకటేశ్  ప్రసాద్ కూడా  రాహుల్ ను మరోసారి టార్గెట్ చేశాడు. ‘35 బంతుల్లో 30 పరుగులు కావాలి, అది చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. అయినా కూడా ఛేదించలేక చతికిలపడాలంటే చాలా చెత్త బ్యాటింగ్ ఉండాలి. అయినా కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఇది కొత్తేమీ కాదు. 2020 పంజాబ్ కింగ్స్‌లోనూ ఇలాంటి ఈజీగా గెలవాల్సిన మ్యాచుల్లో ఓడిపోవడం చూశాం. కెఎల్ రాహుల్ బుర్రతక్కువ కెప్టెన్సీ, బ్యాటింగే లక్నో ఓటమికి కారణం...’  అని ట్వీటాడు. 

66

వెంకటేశ్ ప్రసాద్ తో పాటు దొడ్డ గణేశ్ కూడా  కర్నాటకకు చెందిన వాడే. కెఎల్ రాహుల్ కూడా కన్నడవాడే. అతడి స్వస్థలం మంగళూరు. సొంత రాష్ట్రంవాడు అనే తేడా లేకుండా  ఈ మాజీలు రాహుల్ ను టార్గెట్  చేయడం వెనుక  ఉద్దేశాలు  ఏమై ఉంటాయా..?   అని  సోషల్ మీడియాలో  అభిమానులు  ప్రశ్నిస్తున్నారు. 
 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image2
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Recommended image3
RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved