- Home
- Sports
- Cricket
- మనవాళ్ల మీద ప్రేమ కాదు, డబ్బు మీద ఆశ... ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కి సునీల్ గవాస్కర్ కౌంటర్...
మనవాళ్ల మీద ప్రేమ కాదు, డబ్బు మీద ఆశ... ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కి సునీల్ గవాస్కర్ కౌంటర్...
విదేశీ ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడతారు కానీ భారత క్రికెటర్లు మాత్రం ఏ విదేశీ లీగుల్లో ఆడరు. కారణం బీసీసీఐ ఆంక్షలు. అయితే ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఈ నిబంధన కరెక్ట్ కాదని కామెంట్ చేశాడు. ఆసీస్ క్రికెటర్లు ఐపీఎల్ ఆడుతున్నప్పుడు, భారత క్రికెటర్లు బీబీఎల్‌లో ఎందుకు ఆడరంటూ ప్రశ్నించాడు...

ప్రపంచంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రికెట్ లీగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలంటే భారత క్రికెటర్లు, ఏ విదేశీ లీగుల్లో ఆడకూడదు... ఈ నిబంధనను తీవ్రంగా తప్పుబట్టాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్...
Shane Warne and Adam Gilchrist
ఆస్ట్రేలియా క్రికెటర్లు, ఐపీఎల్ ఆడుతున్నప్పుడు... భారత క్రికెటర్లు, బిగ్‌బాష్ లీగ్‌లో ఆడితే తప్పేంటని ప్రశ్నించాడు. విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్, బీబీఎల్ ఆడితే చూడాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్...
‘కొందరు విదేశీ క్రికెటర్లు, భారత క్రికెటర్లను బిగ్ బాష్ లీగ్, ది హండ్రెడ్ లీగుల్లో ఆడేందుకు అనుమతించాలని కామెంట్ చేశారు. దానికి అసలు కారణం వేరే ఉంది. భారత క్రికెటర్లు ఆడితే వారికి టీఆర్పీ బాగా వస్తుంది, స్పాన్సర్లు పెరుగుతారు..
Image credit: PTI
వాళ్ల క్రికెట్ బోర్డులు బాగుపడేందుకు వాళ్లు అలా చెప్పడంలో తప్పులేదు. అయితే భారత క్రికెట్‌ని కాపాడుకునేందుకు ఈ నిబంధనను పెట్టాల్సి వచ్చింది. ప్రతీ మ్యాచ్‌కి ఫ్రెష్‌గా అందుబాటులో ఉండేందుకే విదేశీ లీగుల్లో ఆడకుండా నియంత్రించారు...
Image credit: IPL
కొందరు విదేశీ క్రికెటర్లకు ఇది సరైన నిర్ణయంగా కనిపించకపోవచ్చు. అయితే బిగ్‌బాష్ లీగుల్లో భారత క్రికెటర్లు కావాలని కోరుకుంటే ఆ క్రికెటర్లు, భారత సపోర్టింగ్ స్టాఫ్‌ని మాత్రం తీసుకోరు. ఎందుకంటే వాళ్లు మాత్రం ఈ మాజీ క్రికెటర్లకు పనికి రారు...
Sunil Gavaskar
ఆస్ట్రేలియా లీగ్‌లో పూర్తిగా ఆసీస్ డామినేషన్‌యే ఉంటుంది. అక్కడి కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్ అందరూ ఆస్ట్రేలియన్లలే. ఐపీఎల్‌లో అలా కాదు, ఇక్కడ విదేశీ కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. ఇది అర్థం చేసుకోవాలి.. ’అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...