- Home
- Sports
- Cricket
- ఇలా అవుట్ అవుతానని అనుకోలేదు, ఈసారి సెంచరీ చేసి తీరుతా... శ్రేయాస్ అయ్యర్ కామెంట్...
ఇలా అవుట్ అవుతానని అనుకోలేదు, ఈసారి సెంచరీ చేసి తీరుతా... శ్రేయాస్ అయ్యర్ కామెంట్...
గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తుదిజట్టులో స్థిరమైన చోటు దక్కించుకోలేకపోతున్నాడు శ్రేయాస్ అయ్యర్. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లు గాయపడిన సందర్భాల్లో, విశ్రాంతి తీసుకున్న మ్యాచుల్లోనూ అయ్యర్‌కి అవకాశం దక్కుతోంది..

సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా దూరం కావడంతో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడి మూడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్, విండీస్ పర్యటనలోనూ ఆకట్టుకుంటున్నాడు..
తొలి వన్డేలో 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి అవుటైన శ్రేయాస్ అయ్యర్, రెండో వన్డేలో 71 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 63 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
Shreyas Iyer-Shikhar Dhawan
‘నేను అవుటైన విధానం నిజంగా నాకు నిరుత్సాహాన్ని కలిగించింది. నేను క్రీజులో ఉంటే ఈజీగా మ్యాచ్‌ని ఫినిష్ చేయవచ్చని అనుకున్నా. అయితే అనుకోకుండా వికెట్ పారేసుకున్నా...
Shreyas Iyer
అయితే వచ్చే మ్యాచ్‌లో తప్పకుండా సెంచరీ తీసి తీరుతా... 60 పరుగుల వద్ద మేం వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయాం. అక్కడి నుంచి ఇన్నింగ్స్ పునఃనిర్మించాల్సి వచ్చింది...
Image credit: PTI
సంజూ శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ వెలకట్టలేనిది. సంజూ శాంసన్, నేను కలిసి ఇన్నింగ్స్ నిర్మించాలని అనుకున్నాం. అందుకే కొన్ని బంతులు ఆడిన తర్వాత స్పిన్నర్లను టార్గెట్ చేస్తూ హిట్టింగ్‌కి దిగాడు సంజూ...
Image credit: PTI
సంజూ శాంసన్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన తర్వాత మ్యాచ్ మా వైపు తిరిగింది. అక్కడి నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా పరుగులు చేయగలిగాం. ఆఖర్లో చాలా టెన్షన్ పడ్డాం...
Image credit: PTI
రాహుల్ సర్‌కి బాగా టెన్షన్ వచ్చేసింది. ఆయన మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఆ సమయంలో డగౌట్ మొత్తం చాలా ఎమోషన్స్‌తో నిండిపోయాయి. అయతే అక్షర్ పటేల్ మాత్రం చాలా కామ్‌గా మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు...’ అంటూ కామెంట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్..
గత 8 వన్డేల్లో 7 సార్లు 50+ స్కోర్లు నమోదు చేసిన శ్రేయాస్ అయ్యర్, 57.8 సగటుతో 463 పరుగులు చేశాడు. ఇందులో 14 సిక్సర్లు కూడా బాదాడు శ్రేయాస్ అయ్యర్...