- Home
- Sports
- Cricket
- నాకూ సంతోషమే.. కానీ ఇంత త్వరగానా..? : సన్ రైజర్స్ బౌలర్ కు టీమిండియాలో చోటు కల్పించడంపై కపిల్ దేవ్ కామెంట్స్
నాకూ సంతోషమే.. కానీ ఇంత త్వరగానా..? : సన్ రైజర్స్ బౌలర్ కు టీమిండియాలో చోటు కల్పించడంపై కపిల్ దేవ్ కామెంట్స్
Kapil Dev Lauds Umran Malik: ఐపీఎల్ లో తనదైన వేగంతో జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడు జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. అయితే అతడిని జట్టులోకి తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన జమ్మూ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్.. తన నిలకడైన ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా సిరీస్ లో అతడికి చోటు లభించింది.
అయితే ఉమ్రాన్ ను జాతీయ జట్టులోకి తీసుకోవడం తొందరపాటు చర్య అని అంటున్నాడు దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్. మరో రెండు మూడేండ్లు ఆగిన తర్వాత అతడికి అవకాశమిస్తే బాగుండేదని సూచించాడు.
కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘ఉమ్రాన్ మాలిక్ ను జాతీయ జట్టులోకి తీసుకోవడం నాకూ సంతోషమే. కానీ ఇంత త్వరగానా..? దేశవాళీ క్రికెట్ లో అతడిని మరో రెండు మూడేండ్లు ఆడించాల్సి ఉంటే బాగుండేది. త్వరగా తీసుకుని అతడు సరిగా రాణించకుంటే మళ్లీ తిరిగి స్థానం దక్కించుకోవడం చాలా కష్టం.
అయితే ఉమ్రాన్ లో పుష్కలమైన టాలెంట్ ఉంది. ఉమ్రాన్ తన పేస్ ను కొనసాగిస్తూ.. తన చుట్టూ మంచి ఎన్విరాన్మెంట్ ను ఏర్పాటు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అతడి సామర్థ్యం చూస్తే ఉమ్రాన్ లో లోపాలు వెతకాల్సిన పన్లేదు. తన మైండ్ సెట్ ను మార్చుకుని ముందుకు సాగితే ఇంకా సక్సెస్ అందుకుంటాడు.
ఉమ్రాన్ నిత్యం మంచి బౌలర్లను కలవాలి. వాళ్ల దగ్గర మెలుకువల నేర్చుకోవాలి. ఖాళీగా ఉన్నప్పుడు గొప్ప బౌలర్ల కు సంబంధించిన వీడియోలు చూడాలి..
అతడు ఫాస్ట్ గా బౌలింగ్ చేస్తాడు. వికెట్లు కూడా తీస్తాడు. మాములుగా ఫాస్ట్ గా బౌలింగ్ చేసేవాళ్లు వికెట్లు తీయలేరు. కానీ ఈ కుర్రాడు రెండూ చేస్తున్నాడు. అందుకే సెలెక్టర్లు కూడా అతడిని జాతీయ జట్టులోకి తీసుకొచ్చారేమో. ఐపీఎల్ వల్ల చాలా మంది కుర్రాళ్లు జాతీయ జట్టులోకి రావడానికి అవకాశం ఏర్పడింది. కానీ వాళ్లు అంతర్జాతీయ మ్యాచులు ఆడటానికి రెండు, మూడేళ్లు సమయమివ్వాలి. అందుకు కావాల్సిన అనుభవాన్ని వాళ్లు సాధించుకోవాలి.
గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎకానమీ 9 కంటే ఎక్కువగా ఉండటమనేది మంచి విషయం కాదు. అది 6-7 మధ్య ఉండాలి. ఈ విషయంలో ఉమ్రాన్ మెరుగుపడాలి.యార్కర్లను ఎక్కువగా వేస్తూ బ్యాటర్ల మైండ్ సెట్ ను అర్థం చేసుకోవాలి. అయితే ఉమ్రాన్ ఇంకా కుర్రాడు. ఇవన్నీ అనుభవంలో తెలుస్తాయి. ఆ లోగా అతడు నాణ్యమైన బ్యాటర్లకు బౌలింగ్ చేస్తూ తనను తాను ఇంప్రూవ్ చేసుకోవాలి..’ అని చెప్పాడు.