MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టీ20 వరల్డ్ కప్‌ టికెట్లకి భారీ క్రేజ్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు లక్షలు ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్...

టీ20 వరల్డ్ కప్‌ టికెట్లకి భారీ క్రేజ్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు లక్షలు ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మరికొన్ని రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగబోతున్న ఈ ఏడో టీ20 వరల్డ్ కప్‌కి ఇప్పటికే బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన కొన్ని రోజులకే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ టికెట్లను అమ్మకానికి పెట్టేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 14 2022, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఏడాది క్రితమే ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్ టికెట్లు కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. ఇండో పాక్ మ్యాచ్‌కి బీభత్సమైన క్రేజ్ ఉందని గమనించిన ఆస్ట్రేలియా, మిగిలిన స్టాండ్స్‌ని మరమ్మత్తులు జరిపించి మరోసారి టికెట్లు అమ్మేసింది. మొత్తంగా ఇప్పటిదాకా మెల్‌బోర్న్‌లో జరిగే భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కి 90 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయట. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

మెల్‌బోర్న్ స్టేడియం పూర్తి కెపాసిటీ 100024. అయితే పూర్తి కెపాసిటీతో ఈ మ్యాచ్‌ జరిగితే లక్ష మంది ప్రేక్షకుల కేరింతల మధ్య భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. ఇదే జరిగితే టీ20 వరల్డ్ కప్ 2022 కొత్త రికార్డు నమోదవుతుంది.

37

ఇప్పటిదాకా మెల్‌బోర్న్‌లో జరిగిన 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 93,013 మంది ప్రేక్షకులు హాజరుకావడమే ఇప్పటిదాకా రికార్డుగా ఉంది. ఆ రికార్డును భారత్, పాక్ మ్యాచ్ చెరిపేసినట్టు అవుతుంది...

47

అంతేకాకుండా ప్రపంచదేశాల నుంచి టీ20 వరల్డ్ కప్ 2022 మ్యాచులు చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆస్ట్రేలియా చేరుకుంటున్నారు. క్వాలిఫైయర్ మ్యాచుల దగ్గర్నుంచి ఫైనల్ మ్యాచ్‌ దాకా ఇప్పటికే 6 లక్షల టికెట్లు అమ్మేసింది ఐసీసీ. మ్యాచులు జరిగే కొద్దీ ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది...

57

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం ఇప్పటికే టీమిండియాతో పాటు ఇంగ్లాండ్ వంటి జట్లు ఆస్ట్రేలియా చేరుకున్నాయి. పొట్టి ప్రపంచకప్ ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో పర్యటిస్తూ ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. భారత్ పర్యటనను పూర్తి చేసుకున్న సౌతాఫ్రికాతో పాటు త్రైపాక్షిక సిరీస్‌లో పాల్గొన్న న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్ కూడా త్వరలో ఆసీస్‌ గడ్డ మీద అడుగుపెట్టబోతున్నాయి...

67

అక్టోబర్ 16 నుంచి క్వాలిఫైయర్ రౌండ్స్ జరగబోతుంటే అక్టోబర్ 22 నుంచి గ్రూప్స్ (సూపర్ 12 రౌండ్) మ్యాచులు జరుగుతాయి. సిడ్నీతో పాటు మెల్‌బోర్న్, పెర్త్, ఆడిలైడ్, బ్రిస్బేన్, గీలాండ్, హోబర్ట్ నగరాల్లో మ్యాచులు జరగబోతున్నాయి. గ్రూప్ స్టేజీ నుంచి ఫైనల్ మ్యాచ్ దాకా ఒక్కో రౌండ్‌కి ఒక్కోలా టికెట్ ధరలు ఉంటాయి..

77

క్వాలిఫైయర్ రౌండ్ మ్యాచులు చూడాలనుకుంటే పిల్లలు 5 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.250), పెద్దలు 20 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.1050) కనీస ధరగా చెల్లించాల్సి ఉంటుంది. ఫైనల్ మ్యాచ్‌కి వచ్చేసరికి ఇది 125 డాలర్లకు పెరుగుతుంది. అంటే ఫైనల్ మ్యాచ్ చూడాలంటే దాదాపు 6500 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది... అయితే ఈ టికెట్లకు భారీ డిమాండ్ ఉండడంతో బ్లాక్ మార్కెట్‌లో లక్షలు పలుకుతున్నాయట. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Sooryavanshi : సచిన్, కోహ్లీ వల్ల కాలేదు.. 15 ఏళ్ల కుర్రాడు వరల్డ్ రికార్డ్ కొట్టాడు!
Recommended image2
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్ వరల్డ్ కప్ సమరానికి డేట్ ఫిక్స్.. దాయాదుల ఫైట్ మామూలుగా ఉండదు!
Recommended image3
IPL 2026 : వేపింగ్.. హనీ ట్రాప్ లో ఐపీఎల్ స్టార్స్? బీసీసీఐ 8 పేజీల లెటర్ లో ఏముందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved