- Home
- Sports
- Cricket
- లెజెండ్స్ లీగ్ క్రికెట్ నుంచి హర్షల్ గిబ్స్ అవుట్... కశ్మీర్ లీగ్‌లో పాల్గొన్నందుకు వేటు వేసిన బీసీసీఐ...
లెజెండ్స్ లీగ్ క్రికెట్ నుంచి హర్షల్ గిబ్స్ అవుట్... కశ్మీర్ లీగ్‌లో పాల్గొన్నందుకు వేటు వేసిన బీసీసీఐ...
లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. మొదటి సీజన్ ఓమన్‌లో నిర్వహించినా ఈసారి ఇండియాలోనే మ్యాచులన్నీ నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. భారత 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సెప్టెంబర్ 16న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వరల్డ్ లెజెండ్స్ ఎలెవన్‌తో భారత లెజెండ్స్ ఎలెవన్ మధ్య స్పెషల్ మ్యాచ్ నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ...

బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉన్న భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్‌లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించాడు గంగూలీ.
gibbs
తొలుత ఈ టోర్నీకి ప్రకటించిన వరల్డ్ లెజెండ్స్ ఎలెవన్ టీమ్‌లో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్‌కి కూడా చోటు దక్కింది. అయితే హర్షల్ గిబ్స్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహించిన కశ్మీర్ టీ20 లీగ్‌లో పాల్గొన్నాడు...
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కశ్మీర్ లీగ్‌లో పాల్గొనకూడదని బీసీసీఐ, ప్రపంచదేశాల క్రికెటర్లను సూచించింది. అయితే హర్షల్ గిబ్స్ మాత్రం బీసీసీఐ, తనను క్రికెట్ ఆడకుండా భయపెడుతోందని... క్రికెట్‌నీ, రాజకీయాలను ముడిపెట్టకండని వాదించి కశ్మీర్ లీగ్‌లో పాల్గొన్నాడు...
Herschelle Gibbs
దీంతో కశ్మీర్ లీగ్ ఆడిన హర్షల్ గిబ్స్‌కి లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో చోటు ఇవ్వడంపై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ స్పెషల్ మ్యాచ్ ఆరంభానికి నెల రోజుల ముందే గిబ్స్‌ని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
ఈ విమర్శలతో హర్షల్ గిబ్స్‌ని తప్పించి, అతని స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కి వరల్డ్ లెజెండ్స్ ఎలెవన్‌లో చోటు కల్పించింది బీసీసీఐ. అలాగే జయసూర్య స్థానంలో డానియల్ విటోరీకి వరల్డ్ జెయింట్స్‌లో చోటు దక్కింది...