గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా ఆలౌట్... టీమిండియా ముందు భారీ టార్గెట్...

First Published Jan 18, 2021, 11:58 AM IST

గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకి ఆలౌట్ అయ్యింది. వర్షం కారణంగా టీ విరామానికి ముందు అరగంట సేపు ఆట నిలిచిపోయింది.  తిరిగి ప్రారంభమైన తర్వాత స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయినా, బౌండరీలతో పరుగులు రాబట్టింది ఆసీస్. దీంతో భారత జట్టు ముందు 328 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. రెండో టెస్టు ఆడుతున్న శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీయగా... మూడో టెస్టు ఆడుతున్న సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.