బెస్ట్ ఐపీఎల్ టీమ్ ఇదేనంటున్న ఆకాశ్ చోప్రా...రోహిత్, కోహ్లీ, పాండ్యాలకు నో ఛాన్స్...

First Published 12, Nov 2020, 6:07 PM

IPL 2020 సీజన్‌లో అనుభవం ఉన్న సీనియర్ స్టార్ల కంటే మెరుగ్గా యంగ్ గన్స్ రాణించారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా సీజన్‌ను ఆరంభించిన కుర్రాళ్లు మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తాజాగా సీజన్ ముగిసిన తర్వాత బెస్ట్ ఎలెవన్ ఐపీఎల్ టీమ్‌ను ప్రకటించాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.

ఈ సీజన్‌లో ఆడిన 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నాడు ఆకాశ్ చోప్రా. ‘ఆరెంజ్ క్యాప్ సాధించిన కెఎల్ రాహుల్, ఎలంటి పరిస్థితుల్లో అయినా బ్యాటింగ్ చేయగల వికెట్ కీపర్. అందుకే అతను నా కెప్టెన్ కమ్ వికెట్ కీపర్’ అన్నాడు చోప్రా.

శిఖర్ ధావన్‌ను కెఎల్ రాహుల్‌తో పాటు ఓపెనర్‌గా ఎంచుకున్నాడు ఆకాశ్ చోప్రా. సీజన్‌లో 620కి పరుగులు చేసిన శిఖర్ ధావన్, రెండు సెంచరీలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.

వన్‌డౌన్‌లో ముంబై ఇండియన్స్ యంగ్ గన్ ఇషాన్ కిషన్‌ను ఎంచుకున్నాడు ఆకాశ్ చోప్రా. సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన ఇషాన్ కిషన్ 4 హాఫ్ సెంచరీలతో 516 పరుగులు చేసి ముంబై తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

నాలుగో స్థానంలో కూడా ముంబై ప్లేయర్‌కే అవకాశం ఇచ్చాడు ఆకాశ్ చోప్రా. ఈ సీజన్‌లో 16 మ్యాచులు ఆడి 4 హాఫ్ సెంచరీలతో 480 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో కరెక్ట్ బ్యాట్స్‌మెన్ అని అభిప్రాయపడ్డాడు ఈ క్రికెట్ కామెంటేటర్.

ఐదోస్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఏబీ డివిల్లియర్స్‌ను ఎంపిక చేశాడు ఆకాశ్ చోప్రా. ఈ సీజన్‌లో 15 మ్యాచులు ఆడిన ఏబీ డివిల్లియర్స్... 5 హాఫ్ సెంచరీలతో 454 పరుగులు చేశాడు. ఈ స్థానంలో స్టోయినిస్, నికోలస్ పూరన్‌లో ఎవరో ఒకరిని సెలక్ట్ చేయాలని భావించినా, ‘మిస్టర్ 360’ పర్ఫెక్ట్ అని భావించానని తెలిపాడు ఆకాశ్ చోప్రా.

ఆ తర్వాత ఈ సీజన్‌లో సిక్సర్లతో స్టార్‌గా వెలుగులోకి వచ్చిన రాహుల్ తెవాటియాని ఆరో స్థానానికి ఎంపిక చేశాడు ఆకాశ్ చోప్రా. రాజస్థాన్ రాయల్స్ తరుపున ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన తెవాటియా.... 10 వికెట్లు తీయడమే కాకుండా 255 పరుగులు చేసి పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇంకో ఆల్‌రౌండర్‌గా రషీద్ ఖాన్‌కి ఓటేశాడు ఆకాశ్ చోప్రా. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన రషీద్ ఖాన్.. ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో 20 వికెట్లు పడగొట్టాడు. అయితే బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్.

రషీద్ ఖాన్‌తో పాటు మరో స్పిన్నర్ యజేంద్ర చాహాల్‌ని కూడా తన జట్టులోకి తీసుకున్నాడు ఆకాశ్ చోప్రా. ఈ సీజన్‌లో 15 మ్యాచులు ఆడిన చాహాల్ 21 వికెట్లు పడగొట్టాడు.

ఆర్చర్..ఈ సీజన్‌లో బాల్‌తో పాటు బంతితో కూడా మెరిసిన జోఫ్రా ఆర్చర్‌కి కూడా ఆకాశ్ చోప్రా బెస్ట్ ఎలెవన్ జట్టులో చోటు దక్కింది. 14 మ్యాచుల్లో 20 వికెట్లు తీయడమే కాకుండా 113 పరుగులు చేసిన ఆర్చర్... ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు.

బుమ్రా... ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర వహించిన బుమ్ బుమ్ బుమ్రాకి కూడా ఆకాశ్ చోప్రా టీమ్‌లో స్థానం దక్కింది. 15 మ్యాచుల్లో 27 వికెట్లు తీసిన బుమ్రా... సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.

శిఖర్ ధావన్ బ్యాటింగ్‌లో రాణిస్తే, బౌలింగ్‌లో రబాడా మ్యాజిక్ కారణంగానే ఢిల్లీ ఫైనల్ దాకా చేరుకోగలిగింది. రబాడాకి కూడా చోప్రా జట్టులో చోటు దక్కింది. 17 మ్యాచుల్లో 30 వికెట్లు తీసిన రబాడా... అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, దేవ్‌దత్ పడిక్కల్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ వార్నర్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, స్టోయినిస్ వంటి వారికి ఆకాశ్ చోప్రా బెస్ట్ ఎలెవన్ ఐపీఎల్ జట్టులో చోటు దక్కలేదు.