MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఎంఎస్ ధోనీ స్థానంలో కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లిసిస్... బీసీసీఐ అనుమతి ఇవ్వకపోవడంతో...

ఎంఎస్ ధోనీ స్థానంలో కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లిసిస్... బీసీసీఐ అనుమతి ఇవ్వకపోవడంతో...

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనాలని అనుకున్నాడు. అయితే మాహీ అయినా, మరేవ్వరైనా విదేశీ లీగుల్లో ఆడితే... భారత క్రికెట్‌తో తెగతెంపులు చేసుకోవాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేయడంతో ధోనీ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. ఇప్పుడు మాహీ ప్లేస్‌లోకి ఫాఫ్ డుప్లిసిస్ రాబోతున్నాడని సమాచారం...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 15 2022, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోహన్‌బర్గ్ టీమ్‌ని కొనుగోలు చేసింది సీఎస్‌కే. ఈ టీమ్‌కి ఇంకా పేరు పెట్టకపోయినా జోహన్‌బర్గ్ సూపర్ కింగ్స్ అని పెట్టవచ్చనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

జోహన్‌బర్గ్ టీమ్‌ ఇప్పటికే ఫాఫ్ డుప్లిసిస్‌తో పాటు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ, శ్రీలంక బౌలర్ మహీరు తీక్షణ, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో సిఫర్డ్, సౌతాఫ్రికా క్రికెటర్ గెరాల్డ్ కోటెజ్‌లతో అగ్రిమెంట్ చేసుకుంది...

36

సౌతాఫ్రికా టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లిసిస్, ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన ఆర్‌సీబీ, రెండో క్వాలిఫైయర్ మ్యాచులో ఓడి మూడో స్థానంలో నిలిచింది...

46

ఎంఎస్ ధోనీకి, ఫాఫ్ డుప్లిసిస్‌కి మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో జోహన్‌బర్గ్ టీమ్‌కి ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ టీమ్‌కి హెడ్ కోచ్‌గా సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ వ్యవహరించబోతున్నాడు...

56

ముంబై ఇండియన్స్‌కి చెందిన ఎంపఐ కేప్ టౌన్ టీమ్‌లో కగిసో రబాడా, రషీద్ ఖాన్, డేవాల్డ్ బ్రేవిస్, సామ్ కుర్రాన్, లివింగ్ స్టోన్ ఉండగా దర్భన్ టీమ్‌లో క్వింటన్ డి కాక్, జాసన్ హోల్డర్, కేల్ మేయర్స్, రీస్ టోప్లే, ప్రెనెలన్ సుబ్రయన్ ఆడబోతున్నారు...

66

అలాగే పార్ల్ టీమ్‌లో జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, మెక్‌కాయ్, కోర్బిన్ బొస్చ్ సంతకాలు చేయగా ప్రిటోరియా టీమ్‌ ఆన్రీచ్ నోకియా, మిగెల్‌లతో కాంట్రాక్ట్ చేసుకుంది. 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పాయే.. ఇప్పుడు టీమిండియా నుంచి ఔట్? హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్
Recommended image2
IPL 2026: ముంబైకి కేకేఆర్ షాక్.. ప్లేఆఫ్స్ రేసులోకి కోల్‌కతా.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
Recommended image3
Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved