- Home
- Sports
- Cricket
- ఇషాన్ కిషన్ ఒకే మ్యాచ్‌లో 1000 కొట్టినా, అతని ప్లేస్‌కి గ్యారెంటీ లేదు... పాక్ మాజీ కెప్టెన్ కామెంట్స్..
ఇషాన్ కిషన్ ఒకే మ్యాచ్‌లో 1000 కొట్టినా, అతని ప్లేస్‌కి గ్యారెంటీ లేదు... పాక్ మాజీ కెప్టెన్ కామెంట్స్..
వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా ఆరు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు ఇషాన్ కిషన్. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు బాది 184 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌లో ఉండడం టీమిండియాకి మంచి విషయమే. రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఇషాన్ కిషన్‌కి వరుస అవకాశాలు దక్కాయి. అయితే అతని ప్లేస్‌కి ఇప్పటికీ గ్యారెంటీ లేదు..
Ishan Kishan
ఎందుకంటే వెస్టిండీస్ టూర్‌లో ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రోహిత్ శర్మ ఓపెనర్‌గా వస్తాడు. దీంతో ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది..
Ishan Kishan
మిడిల్ ఆర్డర్‌లో కెఎల్ రాహుల్, సంజూ శాంసన్ వంటి సీనియర్లు ఉన్నారు. అదీకాకుండా ఇషాన్ కిషన్‌కి మిడిల్ ఆర్డర్‌లో చెప్పుకోదగ్గ రికార్డు లేదు. ఓపెనర్‌గా గత 6 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ పరుగులు చేసిన ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్‌లో ఆడిన మ్యాచుల్లో 30+ స్కోరు కూడా అందుకోలేకపోయాడు..
‘ఇషాన్ కిషన్‌ని వన్డేల్లో ఆడిస్తూ, టీమిండియా చేస్తున్న ప్రయోగాలు నాక్కూడా షాకింగ్‌గానే ఉన్నాయి. ఎందుకంటే అతను 200 కొట్టిన తర్వాత కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అలాంటిది ఇప్పుడు అతనికి ఇన్ని అవకాశాలు ఇవ్వడం దేనికి?
నాకు తెలిసి ఇషాన్ కిషన్ ఒకే ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసినా కూడా అతని ప్లేస్‌కి గ్యారెంటీ ఉండదు. ఇలా చేయడం వల్ల ఆటగాడి ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బ తింటుంది...
ishan
డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి వస్తే, టీమ్‌లో ఉండాలంటే ఏం చేయాలో అతనికి ఎలా అర్థం అవుతుంది.. టీమిండియా చేస్తున్న ఈ ప్రయోగాలు, కచ్ఛితంగా టీమ్ వాతావరణాన్ని దెబ్బ తీస్తాయి..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్..