- Home
- Sports
- Cricket
- కంటెంట్ ఉన్నోడికి పిచ్‌తో అవసరం లేదు! ఎలాంటి పిచ్‌లో అయినా కొట్టగలడు.. - డానియల్ విటోరీ
కంటెంట్ ఉన్నోడికి పిచ్‌తో అవసరం లేదు! ఎలాంటి పిచ్‌లో అయినా కొట్టగలడు.. - డానియల్ విటోరీ
టెస్టు మ్యాచుల ప్రస్తావన వచ్చిన ప్రతీసారీ పిచ్ పరిస్థితుల గురించి కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య గబ్బాలో జరిగిన టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. అయితే అప్పుడు పిచ్ గురించి జరిగిన చర్చ కంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పిచ్ గురించి జరుగుతున్న చర్చ చాలా ఎక్కువ...

Daniel Vettori
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో మొదటి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత జట్టు, ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియాని ముప్పుతిప్పలు పెట్టేందుకు తయారుచేసిన స్పిన్ ఉచ్చులో చిక్కుకుని, ఆధిక్యాన్ని 2-1 తేడాకి తగ్గించుకుంది..
Daniel Vettori
ఆస్ట్రేలియాకి అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానియల్ విటోరీ, పిచ్ గురించి జరుగుతున్న చర్చ గురించి స్పందించాడు. ‘పిచ్ గురించి నేను ఎక్కువగా పట్టించుకోను. ఎందుకంటే ఒకే పిచ్‌పైన రెండు జట్లూ బ్యాటింగ్ చేయాలి...
daniel vettori
ఎవరు బాగా బ్యాటింగ్ చేస్తే వాళ్లే గెలుస్తారు. టాస్ కూడా మ్యాచ్ ఫలితంలో పెద్దగా పాత్ర పోషిస్తుందని నేను అనుకోను. టాస్ గెలిస్తే ఏం చేయాలో ఓ నిర్ణయం తీసుకుంటాం. అలాగే టాస్ ఓడితే ఏం చేయాలో కూడా ముందే చర్చించుకుంటాం. అలాంటప్పుడు టాస్ కేవలం నామమాత్రమే కదా...
Image credit: PTI
పిచ్ బాగా లేదని తేలినప్పుడే బ్యాటర్లకు అసలైన పరీక్ష మొదలవుతుంది. పిచ్ బాగున్నప్పుడు ఎవ్వడైనా పరుగులు చేస్తాడు. బాగోలేని పిచ్ పైన పరుగులు చేయడమే కదా, అసలైన టాలెంట్ ఉన్న క్రికెటర్ చేయాల్సిన పని. అంతేకానీ పిచ్ బాగోలేదని కామెంట్లు చేస్తే ఎలా...
Virat Kohli
కొన్నిసార్లు మనం చేసిన 30 పరుగులే మ్యాచ్ ఫలితాన్ని మార్చేయొచ్చు. ఆ 30 పరుగులు చేసేందుకు మనం ఎంత కష్టపడ్డామనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రతీ దాన్ని అంగీకరించే ధైర్యం ఉండడమే గొప్ప క్రికెటర్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణం...
Umesh Yadav-Virat kohli
ఇండియాలో టెస్టు మ్యాచులు ఆడేటప్పుడు ప్రతీ ప్లేయర్ కాస్త ఒత్తిడికి గురవుతాడు. అది కామన్. అయితే ఇండియాలో టీమిండియాకే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. స్వదేశంలో ఆడుతుండడంతో ప్రతీ మ్యాచ్‌లోనూ సెంచరీ చేయాలని, ప్రతీ బంతికి వికెట్ తీయాలని అభిమానులు కోరుకుంటారు... దాన్ని తట్టుకోవడం చాలా కష్టం...’ అంటూ వ్యాఖ్యానించాడు డానియల్ విటోరి...