థ్రిల్లర్ కాదు, రోటీన్ తెలుగు సినిమా: రవిశాస్త్రికి సవాళ్లు ఇవే...

First Published Aug 17, 2019, 3:49 PM IST

భారత కోచ్ సెలక్షన్ ప్రాసెస్ మొదలవగానే సగటు క్రికెట్ అభిమాని ఎవరెవరు ఈ రేస్ లో ఉండబోతున్నారని తెలుసుకునేందుకు చాలా ఉత్సవాహం కనబరిచాడు. ఆ పదవికి పోటీపడేవారి పేర్లు బయటకు వచ్చిన తరువాత వారిలో ఒకరితో ఒకరిని పోల్చిచూసుకోవడం మొదలుపెట్టాడు. 

భారత కోచ్ సెలక్షన్ ప్రాసెస్ మొదలవగానే సగటు క్రికెట్ అభిమాని ఎవరెవరు ఈ రేస్ లో ఉండబోతున్నారని తెలుసుకునేందుకు చాలా ఉత్సవాహం కనబరిచాడు. ఆ పదవికి పోటీపడేవారి పేర్లు బయటకు వచ్చిన తరువాత వారిలో ఒకరితో ఒకరిని పోల్చిచూసుకోవడం మొదలుపెట్టాడు. విండీస్ టూర్ కి వెళ్లే ముందు మీడియా తో ముచ్చటిస్తూ రవిశాస్త్రి అయితే బాగుండని కోహ్లీ ఎప్పుడైతే అన్నాడో,  సస్పెన్స్  థ్రిల్లర్ కాస్తా  రొటీన్ తెలుగు సినిమాలా మారిపోయింది. క్లైమాక్స్ ఏంటో అర్థమైపోయింది.

రవిశాస్త్రినే మరోమారు కాబోయే కోచ్ అని అందరికీ తేలిపోయింది. దీన్ని ప్రజలు ఎంత బలంగా నమ్మారంటే, కోచ్ పేరును ప్రకటించేటప్పుడు విరాట్ కోహ్లీ మాటలు ఈ సెలక్షన్ ప్రాసెస్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని స్వయంగా కపిల్ దేవ్ చెప్పవలిసి వచ్చింది.

మొత్తానికి ఈ తతంగం ముగిసింది. రెండో దఫా రవిశాస్త్రి భారత కోచ్ గా వ్యవహరించబోతున్నాడు. తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు రవిశాస్త్రి ముందున్న సవాళ్లు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు భారత టీం, విరాట్ కోహ్లీ అనిల్ కుంబ్లే మధ్య నెలకొన్న విభేదాల నుంచి కోలుకొని తిరిగి పూర్వపు రూపు సంతరించుకోవాలి. పూర్తి భారత శిబిరంలో టీం స్పిరిట్ ని పెంచాల్సిన అవసరం ఉంది. దానితోపాటు భారత క్రికెట్ ను వేధిస్తున్న ఫాస్ట్ బౌలర్ల కొరతను అత్యంత త్వరగా పరిష్కరించాలి. ఈ రెండు సమస్యలను  రవిశాస్త్రి విజయవంతంగా పరిష్కరించాడు. దీనితో ఈ పర్యాయం అతనిపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ పర్యాయం రవిశాస్త్రి ముందున్న కొత్త సవాళ్లు ఏంటి?

రవిశాస్త్రి ముందున్న అతిపెద్ద సవాలు మహేంద్రసింగ్ ధోని. ఎంత ఔనన్నా కాదన్నా, ధోనీలో స్పీడ్ తగ్గిందనేది మాత్రం నిజం. మునుపటిలా అతడి మార్క్ ఇన్నింగ్స్ ను ఆడలేకపోతున్నాడు. ఇప్పుడు ధోని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రిషబ్ పంత్ ను ధోని నీడలో ఆడించి మరింత రాటుదేలేలా చేస్తారా లేక ధోనిని పంపించి పంత్ నే నేరుగా కీపరుగా ఆడిస్తారా అనేది చూడాలి. అంతేతప్ప ధోని ఏం చేద్దామనుకుంటున్నాడో మాకు ఇంకా చెప్పలేదు, ధోని కి ఎం చేయాలో తెలుసు వంటి స్టేట్మెంట్లు మాత్రం ఆపేయాలి.

మరో సవాలు బ్యాట్స్ మెన్ లు ఎదుర్కుంటున్న టెక్నికల్ ఇష్యూస్. టీంలో దాదాపుగా అందరూ ఏదో ఒక టెక్నికల్ సమస్యతో సతమవుతున్నవారే. కెఎల్ రాహుల్ ఈ మధ్య కాలంలో తీవ్రంగా టెక్నికల్ అంశాలతో ఇబ్బందిపడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. పృథ్వీషా మరికొంతకాలం అందుబాటులో ఉండడు. రోహిత్ శర్మ ఇంకా టెస్ట్ టీం స్థానాన్ని పెర్మనెంట్ గా నిలబెట్టుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. అజింక్య రహానే ఈ టెక్నికల్ సమస్యల వల్లనే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. రిషబ్ పంత్ షాట్ సెలక్షన్ విషయంలో ఖచ్చితత్వం లేక చెత్త షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకోవడం క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఈ టెక్నికల్ అంశాలపైన దృష్టి కేంద్రీకరించాలి రవిశాస్త్రి.

కుల్దీప్ యాదవ్ లో తిరిగి ఆత్మవిశ్వాసం నింపడం మరో సవాలు. వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత సక్సెస్ కుల్దీప్ యాదవ్ సక్సెస్ తోపాటుగా సాగింది. అలాంటి ఈ చైనామాన్ ఇప్పుడు కాన్ఫిడెన్సు లేమితో సతమవుతున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా రవిశాస్త్రి ఈ మణికట్టు స్పిన్నర్ లో ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉంది. రవిశాస్త్రి కూడా సహజంగానే స్పిన్నర్ అవడం వల్ల ఈ సమస్యను పరిష్కరించడం అంత కష్టం కాకపోవచ్చు.

ఇంకో సవాలేదన్నా ఉందంటే అది టెస్టుల్లో విరాట్ క్యాప్టెన్సీ శైలి. టెస్టులు కాకుండా ఇతర ఫార్మాట్లలో కోహ్లీ అగ్రెస్సివ్ గా మనకు కనపడతాడు. కానీ టెస్టు విషయానికొచ్చేసరికి మాత్రం ఒకింత డిఫెన్సివ్ గా కనపడతాడు. ఈ విషయంలో కోహ్లీకి రవిశాస్త్రి సలహాలివ్వాల్సిన అవసరం ఉంది. కెప్టెన్సీ అనేది ఒక ఎక్స్ పైరీ డేట్ తోని కలిసి వస్తుందనే విషయాన్ని మరవొద్దు. ఇప్పటికే టెస్టుల్లో కోహ్లీ పగ్గాలు చేపట్టి 5 సంవత్సరాలయ్యింది. ఇప్పటికిప్పుడు కెప్టెన్సీకి వచ్చిన ఢోకా లేకున్నా, భవిష్యత్తులో మాత్రం ప్రభావం చూపే ఆస్కారం ఉంది.

ఇక అసలు సమస్య తరచూ ప్లేయర్లను మారుస్తూ ఉండడం. ఈ విధానానికి సాధ్యమైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలా ప్లేయర్లను మార్చడం వల్ల పరిస్థితులకు తగ్గ టీంని ఆడిస్తున్నాను అని కోహ్లీ భావించవచ్చు. కానీ ఇలా తరచు చేయడం వల్ల ఆటగాళ్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు. తమ స్థానాలు ఎంతవరకు పదిలమో తెలియక మానసిక సంఘర్షణకు గురవుతారు. ఇప్పటికే ఈ విషయంపైన చాలా మంది ప్రస్తుత ప్లేయర్లు బాహాటంగానే తమ అసహనాన్ని వెలిబుచ్చారు. శ్రేయస్ అయ్యర్ నుంచి ఉమేష్ యాదవ్ వరకు చాలామంది క్రికెటర్లు తమ భావాలను బయటపెట్టారు. ఎవరెంత చెప్పినా, ప్రస్తుత వన్డే టీంలో 4వ స్థానం ఇంకా ఖాళీగానే ఉండడానికి ఈ విధానమే కారణం అన్నది ముమ్మాటికీ నిజం.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?