- Home
- Sports
- Cricket
- హార్ధిక్ వచ్చేయ్.. టెస్టులు కూడా ఆడేద్దాం.. ఆల్ రౌండర్ల కొరతతో బీసీసీఐ కీలక నిర్ణయం..!
హార్ధిక్ వచ్చేయ్.. టెస్టులు కూడా ఆడేద్దాం.. ఆల్ రౌండర్ల కొరతతో బీసీసీఐ కీలక నిర్ణయం..!
టీమిండియా టీ20 జట్టుకు భావి సారథిగా భావిస్తున్న హార్దిక్ పాండ్యా తిరిగి టెస్టులలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా..? కీలక ఆడగాళ్లు ఆస్పత్రులలో బెడ్ లకే పరిమితమవుతున్న వేళ పాండ్యాను తిరిగి సుదీర్ఘ ఫార్మాట్ లలోకి ఆడించనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.

టీమిండియా టీ20 జట్టుకు భావి సారథిగా భావిస్తున్న హార్దిక్ పాండ్యా తిరిగి టెస్టులలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా..? కీలక ఆడగాళ్లు ఆస్పత్రులలో బెడ్ లకే పరిమితమవుతున్న వేళ పాండ్యాను తిరిగి సుదీర్ఘ ఫార్మాట్ లలోకి ఆడించనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.
2020లో గాయం తర్వాత భారత జట్టులోకి వచ్చినా ఫిట్నెస్ కోల్పోయి మళ్లీ సర్జరీ తర్వాత జట్టులోకి వచ్చి ఇరగదీస్తున్న హార్ధిక్ పాండ్యా.. ప్రస్తుతం టీ20లు, వన్డేలకే పరిమితమవుతున్నాడు. గతంలో అతడిని రెడ్ బాల్ క్రికెట్ (టెస్టులు) లోకి వస్తారా..? అని ప్రశ్నించగా అతడు దానిమీద అంతగా ఆసక్తి లేనట్టే చెప్పాడు. ప్రస్తుతానికి తాను బ్లూ కలర్ జెర్సీ (వన్డే, టీ20)ని ఎంజాయ్ చేస్తున్నానని, వైట్ జెర్సీ గురించి సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దామని వెల్లడించాడు.
శివసుందర్ దాస్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కూడా ఈ మేరకు హార్ధిక్ తో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతుందని సమాచారం. ప్రస్తుతం అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా జూన్ లో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆడే అవకాశముంది.
ఫైనల్ లో పాండ్యాను ఆడించేందుకు గాను బీసీసీఐ ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. హార్ధిక్ ఒప్పుకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో అతడు ఆడించడానికి బీసీసీఐ రెడీగా ఉంది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఇప్పటికిప్పుడు హార్జిక్ పాండ్యాను టెస్టులలోకి తీసుకొచ్చే ఆతృత ఏమీ లేదు. అయితే అతడు ఆడతానంటే మాత్రం అది భారత్ కు లాభించేదే. డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు మేం ఈ విషయంలో చర్చిస్తాం.
బుమ్రాలేని నేపథ్యంలో హార్ధిక్ కీలక పాత్ర పోషిస్తాడు. అయితే ఈ విషయంలో పాండ్యా మీద మేం ఒత్తిడి తీసుకురాదలుచుకోలేదు. ప్రస్తుతానికైతే అతడు టెస్టులకు దూరంగా ఉన్నాడు. ఒకవేళ మూడు ఫార్మాట్లలో ఆడిస్తే అతడి ఫిట్నెస్ ఎలా ఉంటుంది..? గాయాల బెడద వంటివి కూడా చూసుకోవాలి. కానీ ఎన్సీఏ క్లీయరెన్స్ ఇచ్చి హార్ధిక్ రెడీ అంటే మాత్రం కచ్చితంగా అతడు పోటీలో ఉంటాడు..’అని తెలిపాడు.
కాగా 2017లో శ్రీలంకతో మ్యాచ్ ఆడుతూ టెస్టులలోకి ఎంట్రీ ఇచ్చిన హార్ధిక్ ఇప్పటివరకు 11 టెస్టులు ఆడాడు. 2018లో చివరిసారిగా టెస్టు ఆడిన అతడు.. ఈ ఫార్మాట్లో 532 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. బౌలర్ గా 17 వికె్లు పడగొట్టాడు.