- Home
- Sports
- Cricket
- బౌలర్ బ్యాండేజీ పీకేసి, రక్తం కారుతుంటే మీరేం చేస్తారు?... అంపైర్ల రాత పరీక్షల్లో తిక్క ప్రశ్నలు...
బౌలర్ బ్యాండేజీ పీకేసి, రక్తం కారుతుంటే మీరేం చేస్తారు?... అంపైర్ల రాత పరీక్షల్లో తిక్క ప్రశ్నలు...
అంపైర్... క్రికెట్ మ్యాచ్ ఫలితాన్ని డిసైర్ చేసే జడ్జి లాంటివాడు. అంపైర్ ఇచ్చే ఓ నిర్ణయం మ్యాచ్ రిజల్ట్‌నే మార్చేయవచ్చు. డీఆర్‌ఎస్ (డిసెషన్ రివ్యూ సిస్టమ్) వంటి అధునాతన టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చినా చాలా సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్ తీసుకునే నిర్ణయమై ఫైనల్. మరి అంపైర్‌గా ఉద్యోగం సంపాదించాలంటే ఏం చేయాలి...ఐపీఎల్‌తో పాటు బిగ్‌బాష్ లీగ్ సమయంలో అంపైరింగ్ ప్రమాణాలపై తీవ్ర చర్చ జరిగింది. మరి వైడ్ బాల్, నో బాల్ విషయాల్లో కూడా అంపైర్లు కంఫ్యూజ్ అవ్వడం, మరికొందరు ఆన్ ఫీల్డ్ క్రికెటర్లు చేసే పనులకు ప్రభావితమై నిర్ణయాలు మార్చుకోవడం చర్చనీయాంశమయ్యాయి...

ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో కూడా అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర దుమారం రేగుతుండడంతో బీసీసీఐ, అంపైరింగ్ స్థాయిని పెంచేందుకు చర్చలు తీసుకోవడం మొదలెట్టింది. కొత్త అంపైర్లను తీసుకునే నియామక ప్రక్రియలో అత్యంత కఠినమైన పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది...
గ్రూప్ డీ అంపైరింగ్ నియమాకాల కోసం (మహిళలు, జూనియర్ మ్యాచులు) తాజాగా రాత పరీక్ష నిర్వహించింది భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ). ఇందులో 140 మంది పరీక్ష రాస్తే, అందులో నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారు. మిగిలిన వారిని కట్ ఆఫ్ రూపంలో పక్కనబెడతారు...
200 మార్కులకు జరిగిన ఈ పరీక్షలో కట్ ఆఫ్ పోగా క్వాలిఫికేషన్ మార్కులు 90. ఇందులో రాత పరీక్షకు 100 మార్పులు, పర్సనల్ ఇంటర్వ్యూకి 35 మార్కులు, వీడియో ఇంటర్వ్యూకి 35 మార్కులు ఉంటాయి. ఫిజికల్ టెస్టుకి మిగిలిన 30 మార్కులు ఉంటాయి..
అయితే ఈ పరీక్షలో అడిగిన ప్రశ్నలు, చాలా వింతగా ఉండడం చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. పెవిలియన్‌లో ఫ్లడ్ లైట్స్‌తో పాటు స్టేడియం స్టాండ్స్ నీడ పడడం సహజం. అలాగే ఫీల్డర్ నీడ కూడా పిచ్‌పై పడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో బ్యాటర్, అంపైర్‌కి ఫిర్యాదు చేస్తే... ఏం చేస్తారు? అంపైర్ పరీక్షలో ఓ ప్రశ్న ఇది...
అలాగే బౌలర్ గాయపడి చేతికి బ్యాండేజీ కట్టుకున్నాడు. అది నిజమైనది కాదని, మీరు దాన్ని పీకేశారు. అప్పుడు రక్తస్రావం అయ్యింది. మీరేం చేస్తారు? అతనితో బౌలింగ్ చేయనిస్తారా? ... అంపైర్ కావాలనుకుంటే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి తీరాల్సిందే...
షార్ట్ లెగ్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. అలా ఫీల్డర్ హెల్మెట్‌లో బ్యాటర్ కొట్టిన బంతి వెళ్లి ఇరుక్కుని, దాన్ని ఫీల్డర్ క్యాచ్‌గా పట్టుకుంటే అవుట్ ఇస్తారా... వంటి వింత వింత ప్రశ్నలను అభ్యర్థులకు వేసింది బీసీసీఐ...
ఇది కేవలం క్రికెట్ రూల్స్ గురించి మాత్రమే కాకుండా భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ అంపైర్, సమయోచితంగా ఎలా నిర్ణయం తీసుకుంటాడో తెలుసుకునేందుకు ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలియచేశాడు ఓ బీసీసీఐ అధికారి...