బెయిర్ స్టో టాయిలెట్‌లో ఉన్నాడా? సన్‌రైజర్స్‌కు వీరేంద్ర సెహ్వాగ్ సూటి ప్రశ్న...
ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్, సీజన్‌లో మొట్టమొదటి సూపర్ ఓవర్ మ్యాచ్‌గా నమోదైంది. అయితే సూపర్ ఓవర్‌లో భారీ హిట్టింగ్ చేసే బెయిర్ స్టో బ్యాటింగ్‌కి రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

సూపర్ ఓవర్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్ కలిసి బ్యాటింగ్‌కి వచ్చారు. అప్పటికే దాదాపు 15 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కేన్ విలియంసన్ బాగా అలిసిపోయి కనిపించాడు... డేవిడ్ వార్నర్ పెద్దగా ఫామ్‌లో కూడా లేడు.

స్పిన్ బౌలింగ్‌కి బాగా ఇబ్బంది పడే డేవిడ్ వార్నర్‌కి బదులుగా ఇన్నింగ్స్‌లో 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 38 పరుగులు చేసిన బెయిర్ స్టో వచ్చి ఉంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు క్రికెట్ విశ్లేషకులు...

‘సూపర్ ఓవర్ బ్యాటింగ్‌కి దిగే సమయంలో బెయిర్ స్టో టాయిలెట్‌లో ఉన్నాడా? అతన్ని ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు. కానీ విజయం అందుకోవాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.

వాస్తవానికి కేన్ విలియంసన్‌తో సూపర్ ఓవర్ ఆడేందుకు వచ్చిన డేవిడ్ వార్నర్, సూపర్ ఓవర్‌లో పడితే బెయిర్ స్టోని ఆడించాలని భావించాడు. వికెట్ పడితే క్రీజులోకి వచ్చేందుకు బెయిర్ స్టో సిద్ధంగా రెఢీ అయ్యి కూర్చోవడం కనిపించింది.

అయితే డేవిడ్ వార్నర్ సూపర్ ఓవర్‌లో బౌండరీ బాదలేకపోయాడు. అదీకాకుండా ఆఖరి బంతికి రెండు పరుగులు తీసినా డేవిడ్ వార్నర్ షార్ట్ రన్ తీయడంతో ఓ పరుగు తగ్గించాల్సి వచ్చింది. ఇది సన్‌రైజర్స్ విజయంపై ప్రభావం చూపించింది.

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ కూడా ‘వార్నర్ భాయ్... నువ్వెందుకు వచ్చావు? బెయిర్ స్టో లేదా సుచిత్‌ను పంపించాల్సింది’ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కావాలంటే డ్రీమ్11లో జట్టును నిర్మించుకోవాలని సెటైర్ వేసింది ఈషా...