రోహిత్ కెప్టెన్ కాలేడు, ‘హిట్ మ్యాన్’ కంటే ముందు అతనికి టీమిండియా కెప్టెన్సీ!

First Published 18, Nov 2020, 11:57 AM

ఐపీఎల్ 2020 టైటిల్‌తో రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఓ వైపు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గత 8 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోవడంతో రోహిత్ శర్మకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్ అండ్ కో.

రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ కాలేడని, అతని కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కి భారత జట్టు సారథి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నాడు ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ.

టెస్టుల్లో అద్వితీయ విజయాలు అందించాడు భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ... ధోనీ, గంగూలీ వంటి వాళ్లు కూడా అందుకోలేకపోయిన విజయాలను కోహ్లీ సారథ్యంలో టెస్టుల్లో అందుకుంది టీమిండియా.

ఏడో స్థానంలో ఉన్న భారత జట్టు, విరాట్ కోహ్లీ సారథ్యం టాప్ ప్లేస్‌ను అధిరోహించింది...

అయితే వన్డే, టీ20 ఫార్మాట్‌లో మాత్రం భారత జట్టుకు పెద్దగా కలిసి రాలేదు. కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ మెగా టోర్నీని కూడా సొంతం చేసుకోలేకపోయింది టీమిండియా.

ఎన్నడూలేనట్టుగా ఛాంపియన్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడింది... అప్పటి నుంచే కోహ్లీని పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

వన్డే వరల్డ్‌కప్ 2019లో భారత జట్టు సెమీస్ నుంచే తప్పుకున్న సమయంలోనూ ఇదే వాదన తెరపైకి వచ్చింది. కోహ్లీకి బదులు రోహిత్ శర్మను వన్డే, టీ20లకు కెప్టెన్‌గా చేయాలని డిమాండ్ వినిపించింది.

అయితే రోహిత్ శర్మకు పోటీగా ఇప్పుడు మరో యంగ్ స్టార్ కెప్టెన్సీ రేసులో దూసుకొస్తున్నాడని వ్యాఖ్యానించాడు ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ...

ఐపీఎల్‌లో అత్యంత పేలవమైన రికార్డు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో సంచలన విజయాలు అందుకుంది. గత సీజన్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న ఢిల్లీ, ఈ ఏడాది ఏకంగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది...

కెప్టెన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్ చేర్చడంలో సూపర్ సక్సెస్ అయిన శ్రేయాస్ అయ్యర్, ఫైనల్ ఫైట్‌లో హాఫ్ సెంచరీ చేసి బ్యాట్స్‌మెన్‌గానూ రాణించాడు...

‘శ్రేయాస్ అయ్యర్ ఏదో ఒకరోజు టీమిండియాను నడిపిస్తాడు. ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి డౌట్లు అవసరం లేదు... అతనికి ఆ సామర్థ్యం ఉంది. చిన్నోడే అయినా మంచి లీడర్...  ఆటగాళ్లను ఎలా వాడుకోవాలో పక్కాగా తెలిసిన కెప్టెన్ అయ్యర్’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు అలెక్స్ క్యారీ.

‘రికీ పాంటింగ్‌తో శ్రేయాస్ అయ్యర్ తన ఆలోచనలు పంచుకుంటూ ఉంటాడు. ఇది అయ్యర్‌కి చాలా హెల్ప్ అయ్యింది. అతనికి మంచి భవిష్యత్తు ఉంది... అని చెప్పాడు అలెక్స్ క్యారీ.

12 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడుతున్నా ఫైనల్ చేరని జట్టుగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్... ఈ సీజన్‌లో ఆ లోటు తీర్చుకుంది. అయితే ఫైనల్ ఫైట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్.