- Home
- Sports
- Cricket
- రోహిత్, కోహ్లీ, పూజారా.. ఎవ్వరైనా సరే రంజీ మ్యాచులు ఆడాల్సిందే... గౌతమ్ గంభీర్ కామెంట్...
రోహిత్, కోహ్లీ, పూజారా.. ఎవ్వరైనా సరే రంజీ మ్యాచులు ఆడాల్సిందే... గౌతమ్ గంభీర్ కామెంట్...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో భారత టాపార్డర్ పెద్దగా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయింది. నాగ్‌పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సెంచరీ మినహా విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు కూడా చేయలేకపోయారు...

Image credit: PTI
ఛతేశ్వర్ పూజారా మూడు టెస్టుల్లో కలిపి ఒకే ఒక్క హాఫ్ సెంచరీ బాదగా శ్రీకర్ భరత్ బ్యాటు నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాలేదు. భారత బ్యాటర్ల ఫెయిల్యూర్‌కి సరైన ప్రాక్టీస్ లేకపోవడమే కారణమంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..
Gambhir
‘100 కాదు, 200 శాతం భారత బ్యాటర్లు తప్పనిసరిగా రంజీ మ్యాచులు ఆడాలి. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ముందు రంజీ ట్రోఫీలో ఆడి ఉంటే ప్రాక్టీస్ దొరికి ఉండేది. క్యాంపులో 20 రోజులు గడిపినా, లేకపోతే నెట్స్‌లో 10 రోజులు ప్రాక్టీస్ చేసినా రంజీ మ్యాచులు ఆడిన దాంతో సమానం కాదు...
Image credit: PTI
తొలి రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఓటమికి ఇదే కారణం. ప్రాక్టీస్ మ్యాచులు ఆడకపోవడం వల్ల ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా మైండ్‌సెట్‌ను మార్చుకోవడానికి సమయం తీసుకున్నారు. ప్రాక్టీస్ లేకుండా టెస్టు మ్యాచ్ ఆడడం నెగిటివ్ మైండ్‌సెట్‌ని క్రియేట్ చేస్తుంది...
Cheteshwar Pujara
భారత బ్యాటర్ల విషయంలోనూ అదే జరుగుతోంది. కేవలం బ్యాటర్ల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఫాస్ట్ బౌలర్లు, రంజీ మ్యాచులు ఆడాల్సిన అవసరం లేదు. వారికి రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం. బ్యాటర్లు రంజీ ట్రోఫీలో ఆడి సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసుకుంటే వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది...
Image credit: PTI
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి టీమిండియాకి చాలా ముఖ్యమైనది. కనీసం ఇలాంటి సిరీస్‌ల ముందు రంజీ ట్రోఫీలు ఆడితే బాగుంటుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా... ఎంత అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్ అయినా రంజీ ఆడితేనే టెస్టుల్లో చోటు ఇవ్వాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...