Business Ideas: ఈజీ బిజినెస్..మహిళలు రూ. 50 వేల పెట్టుబడితో, ప్రతి నెల రూ. 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు
మహిళలు చాలా తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా అయితే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకండి ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల కనీసం ఒక లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది అలాంటి ఓ చక్కటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో తక్కువ ధరకు లభించే ప్లాస్టిక్ వస్తువులు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రియూజ్డ్ ప్లాస్టిక్ తో చేసినటువంటి, చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులను జనం కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణ స్టీల్ సామాన్లతో పోల్చినట్లయితే వీటి ధర తక్కువగానే ఉంటుంది. అందుకే జనం ప్లాస్టిక్ సామాన్లు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ వ్యాపార ఐడియా ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్లాస్టిక్ సామాన్ల బజారు నిత్యం డిమాండ్ ఉంటుంది. చాలా తక్కువ పెట్టుబడి తోనే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది.
సుమారు 50 వేల రూపాయల పెట్టుబడితో మీరు దాదాపు రెండింతల ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ సామాన్లపై సుమారు ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఐదు రూపాయల వస్తువును పది రూపాయలకు విక్రయించవచ్చు తద్వారా మీరు రెండింతలు లాభం పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్లాస్టిక్ సామాన్లపై లాభం మార్జిన్ ఎక్కువగా లభిస్తుంది. . మీరు వీటిని హోల్ సేల్ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు.
మీరు నిత్యం ఇంట్లో వాడేటువంటి ప్లాస్టిక్ ముగ్గులు, జగ్గులు, వంట గదిలో ఉప్పు కారం దాచుకునే డబ్బాలు మొదలు అనేక నిత్యం వాడేటువంటి సామాన్లు ప్లాస్టిక్ రూపంలో లభిస్తున్నాయి. వీటి ధర హోల్సేల్ గా కొనుగోలు చేసినట్లయితే చాలా తక్కువగా ఉంటుంది విడిగా అమ్మినప్పుడు సుమారు 50% మార్జిన్ తో విక్రయించవచ్చు.
మీరు పెట్టుబడి కోసం కనీసం పదివేల రూపాయల నుంచి 50 వేల రూపాయలు పెడితే సరిపోతుంది. ఈ సామానులను మీరు హోల్సేల్ రేట్లకు హైదరాబాదులోని బేగంబజార్ లో కొనుగోలు చేయవచ్చు. అనంతరం మీరు మీ గ్రామంలో చిన్న దుకాణం ఏర్పాటు చేసుకొని సరుకు విక్రయించుకోవచ్చు. తద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మహిళలు తమ ఖాళీ సమయంలో ఈ వ్యాపారం చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలుంది. అంతేకాదు ఈ వ్యాపారంలో మీ పెట్టుబడి పై దాదాపు రెండింతలు ఆదాయం వచ్చే అవకాశం లభిస్తుంది.
ఇక మీరు పెట్టుబడి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ముద్ర రుణం ద్వారా మూలధనం పొందవచ్చు ముద్ర రుణాల ద్వారా 50 వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు ఒకవేళ మీరు వీధి వ్యాపారుల తరహాలో వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే పీఎం స్వనిధి స్కీం కింద పదివేల రూపాయలు రుణం పొందే అవకాశం ఉంది.