MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • ఆధార్ కార్డుతోనూ ATMలో డబ్బులు డ్రా చేయొచ్చు. ఎలాగో తెలుసా?

ఆధార్ కార్డుతోనూ ATMలో డబ్బులు డ్రా చేయొచ్చు. ఎలాగో తెలుసా?

బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బులు డ్రా చేయాలంటే మనం ఏటీఎం కి వెళతాం. డెబిట్ కార్డు పెట్టి అవసరమైన అమౌంట్ విత్ డ్రా చేసుకుంటాం. అయితే మీ దగ్గర డెబిట్ కార్డు లేకపెయినా ఆధార్ కార్డు ఉపయోగించి ఏటీఎం  నుంచి డబ్బులు డ్రా చేయొచ్చని మీకు తెలుసా? ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Oct 16 2024, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజుల్లో ప్రజలంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్  చేయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే డబ్బులు జేబులో పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఉండదు. కొన్న వస్తువులకు చిల్లర ఇవ్వాల్సిన సమస్య రాదు. చిరిగిన నోట్లు ఉన్నాయని వ్యాపారులు రిజక్ట్ చేయడం లాంటి ఇబ్బందులు ఉండవు. మన దేశంలో ఆన్ లైన్ లావాదేవీలు ఎంత ఎక్కువ జరుగుతున్నాయంటే ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే దేశాల్లో ఇండియా టాప్ 10లో ఉంది. అంతలా ప్రజలు డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. ఇవి ఒకరకంగా చాలా మంచి విషయం. పారదర్శకంగా టాక్స్ పేమెంట్ జరుగుతుంది. ఇది దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే మనకు డబ్బు నేరుగా ఇవ్వాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. దానధర్మాలు చేయడానికి, పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడానికి, బస్సులు, రైళ్లలో ప్రయాణం చేయడానికి ఇలా చాలా సందర్భాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్  చేయడానికి అవకాశం ఉండదు. ఇలాంటి సమయంలో డబ్బులు డ్రా చేయడానికి ATMల దగ్గరకు వెళ్లాలి. డెబిట్ కార్డు పెట్టి అవసరమైన డబ్బు విత్ డ్రా చేసుకోవాలి.  

అయితే డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లినప్పుడు మీ డెబిట్ కార్డు మర్చిపోయినా ఏం పర్వాలేదు. మీ ఆధార్ కార్డు ద్వారా డబ్బు డ్రా చేసుకోవచ్చు. వినియోగదారుల సౌకర్యం కోసం NPCI(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) AEPS(ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్) సదుపాయాన్ని అందిస్తోంది. దీని ద్వారా మీరు మీ ఆధార్ కార్డుని ఉపయోగించి డబ్బులు డ్రా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి. 
 

35

మైక్రో ATMల ద్వారా బయోమెట్రిక్ ప్రమాణీకరణతో సులభంగా, సౌకర్యవంతంగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నంబర్, బయోమెట్రిక్ లింక్  అయి ఉంటే బ్యాంక్ సంబంధిత పనులను మీరు సులభంగా చేసుకోవచ్చు. మైక్రో ATMలో మీ బ్యాంక్ అకౌంట్ లలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. డబ్బులు కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉపయోగించి డబ్బు డ్రా చేసుకోవడానికి మీ ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయి ఉండటం చాలా ముఖ్యం. మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా లింక్ చేయబడి ఉంటే ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు సులభంగా డబ్బు డ్రా చేసుకోవచ్చు.
 

45

ముందుగా మీరు AEPSని సపోర్ట్ చేసే బ్యాంక్ ఏజెంట్ లేదా మైక్రో ATM దగ్గరకు వెళ్లండి. 
ఇవి సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో, బ్యాంక్ అవుట్‌లెట్‌లలో లేదా మొబైల్ బ్యాంకింగ్ సేవలలో కనిపిస్తాయి. 
మైక్రో ATMలో మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. 
ఫింగర్‌ప్రింట్ స్కానర్ సహాయంతో బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. 
మీ డేటా ఆధార్ కార్డుతో సరిపోతే కంప్యూటర్ మీకు అనేక ఆప్షన్స్ చూపుతుంది. 
వీటిలో ‘Money With Draw’ ఆప్షన్ ఎంచుకోండి. మీరు డ్రా చేసుకోవాలనుకుంటున్న డబ్బు మొత్తాన్ని నమోదు చేయండి. 
ఇలా చేసిన తర్వాత మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు డెబిట్ చేయబడుతుంది. మీరు నమోదు చేసే     అమౌంట్ విత్ డ్రాయల్ రూల్స్ కు అనుగుణంగా ఉండాలని గుర్తుంచుకోండి. 
లావాదేవీ పూర్తయిన తర్వాత బ్యాంక్ ఏజెంట్ మీకు డబ్బు ఇస్తాడు. అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ట్రాన్సాక్షన్ జరిగిన మెసేజ్ కూడా వస్తుంది.
 

55

అనుమతి ఉన్న బ్యాంక్ సేవలకు మాత్రమే మీ ఆధార్ నంబర్‌ను ఉపయోగించండి. యాప్‌లో ఉపయోగించే ఫింగర్‌ప్రింట్ స్కానర్ సురక్షితమేనా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి. దాదాపు అన్ని ప్రధాన జాతీయ, ప్రాంతీయ బ్యాంకులు AEPS సేవను అందిస్తున్నాయి. అయితే దాని లభ్యత బ్యాంక్ బ్రాంచ్ మరియు ఆ ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. ఇక మీరు ఎలాంటి అనుమానాలు లేకుండా డబ్బు డ్రా చేసుకోవచ్చు.
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Recommended image2
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image3
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved