ప్రపంచంలో 2వ ట్రిలియనీర్‌గా భారతీయుడు.. ఆయన ఎవరో గెస్ చేశారా?
మరో నాలుగేళ్లలో భారతదేశానికి చెందిన బడా వ్యాపార వేత్త ట్రిలియనీర్‌గా మారనున్నారు. ఆయనకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలున్నాయి. ఇండియాలో అత్యంత ధనవంతుల్లో ఒకరుగా పేరుపొందారు. 2028 నాటికి ఆయన ప్రపంపంలోనే ట్రిలియనీర్ల జాబితాలో 2వ స్థానం కైవసం చేసుకోనున్నారు. ఆయన ఎవరో, ఆయన ఆదాయ వ్యయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంప అత్యంత ధనవంతుల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న ఎలాన్ మస్క్ త్వరలో ప్రపంచ మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించనున్నారు. ఆయన తర్వాత స్థానాన్ని ఓ భారతీయుడు కైవసం చేసుకోనున్నారు. బ్లూమ్‌బర్గ్ వెల్లడించిన నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ ఆస్తి 251 బిలియన్ డాలర్లు. ఎలాన్ మస్క్ ప్రస్తుతం అనేక రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రధానంగా స్పేస్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలికమ్యూనికేషన్స్ ఉన్నాయి. మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ Tesla ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కార్ల కంపెనీ ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ, ఇతర దేశాల్లో కార్ల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. అదేవిధంగా స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌కు సంబంధించిన కంపెనీ SpaceX అమెరికా కేంద్రంగా అంతరిక్ష ప్రయోగాలు, సాటిలైట్స్, భవిష్యత్తులో మానవులను ఇతర గ్రహాలకు పంపేందుకు సర్వీసులు అందిస్తోంది. ఇలాంటి అనేక సంస్థలను మస్క్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ లాభాల్లో నడుస్తుండటంతో బిలియనీర్‌గా ఉన్న ఆయన త్వరలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ గా ఎదగనున్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో ట్రిలియనీర్లు లేరు. అయితే ఎలాన్ మస్క్(Tesla, SpaceX) వంటి బిలియనీర్లు, గౌతం అదానీ(Adani Group), బర్నార్డ్ ఆర్నాల్ట్(LVMH) వంటి పలువురు వ్యక్తులు ట్రిలియనీర్ స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. అందరూ వచ్చే నాలుగైదేళ్లలో ఈ మైలురాయిని చేరవచ్చని బ్లూమ్‌బర్గ్ వెల్లడించిన నివేదిక ప్రకారం తెలుస్తోంది. ఎలాన్ మస్క్ 2027 నాటికి తొలి ట్రిలియనీర్ కావచ్చని మీడియా వర్గాలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న అత్యంత సంపన్న వ్యక్తులు, ఈ స్థాయికి చేరే అవకాశమున్నవారు ఎక్కువగా టెక్నాలజీ, ఎనర్జీ రంగాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
ప్రపంచంలోనే రెండవ ట్రిలియనీర్ గా అదానీ..
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదించిన ప్రకారం 251 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. కనెక్ట్ అకాడమీ నివేదిక ప్రకారం మస్క్ 2027 నాటికి ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ గా మస్క్ అవతరించనున్నారు. ప్రస్తుతం అతని సంపద సగటు వార్షిక రేటు 110% వద్ద పెరుగుతూనే ఉంది. అదే నివేదిక ప్రకారం అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు భారతదేశానికి చెందిన గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండవ ట్రిలియనీర్ కానున్నారు. అదానీ సంపద ప్రస్తుతం 123% వార్షికంగా వృద్ధి చెందుతూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఆయన 2028 నాటికి ట్రిలియనీర్‌గా మారవచ్చు.
అదానీ ఆస్తి రూ.7,04,196 కోట్లు
గౌతమ్ అదానీ ప్రస్తుత ఆస్తి నికర విలువ రూ.7,04,196 కోట్లు. ఆయన ప్రస్తుతం భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. అదానీ గ్రూప్‌లో అదానీ పోర్ట్స్ కీలకమైన సంస్థ. మింట్ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం అదానీ నాయకత్వంలోని అదానీ గ్రూప్, దాని పోర్ట్ కార్యకలాపాలను పెంచడానికి రూ.24,973 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేస్తోంది. ఈ కంపెనీ యూరప్, భారతదేశం మధ్య వాణిజ్య మార్గాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అదానీ జీతం తన ఉద్యోగులకంటే తక్కువే..
ఫోర్బ్స్ ప్రకారం గౌతమ్ అదానీ గ్రూప్స్ ప్రపంచవ్యాప్తంగా రూ 3.64 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్నాయి. వివిధ కొత్త ప్రాజెక్ట్‌ల ద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అదానీ జీతం చాలా మంది పరిశ్రమ సహచరులు, అతని సొంత ఉన్నత అధికారుల కంటే తక్కువగా ఉంది. 2024 మార్చి 31నాటికి అదానీ వార్షిక వేతనం కింద రూ.9.26 కోట్లు మాత్రమే తీసుకున్నారు. పోర్ట్స్ నుంచి ఎనర్జీ సమ్మేళనంలోని పది కంపెనీలలో అదానీ కేవలం రెండింటి నుండి మాత్రమే జీతం తీసుకున్నారు.
బిలియనీర్ల వేతనాలు ఎంతో తెలుసా..
భారతదేశంలో ఇతర బిలియనీర్లతో పోలిస్తే అదానీ సంపాదన స్వల్పంగా ఉంది. ఇండియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ రూ.15 కోట్లు వేతనంగా తీసుకునే వారు. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి తన జీతం మొత్తాన్ని తీసుకోవడం మానేశారు. టెలికాం వ్యాపారవేత్త సునీల్ భారతి మిట్టల్ 2022-23లో రూ.16.7 కోట్లు, రాజీవ్ బజాజ్ రూ.53.7 కోట్లు, పవన్ ముంజాల్ రూ.80 కోట్లు వేతనంగా తీసుకున్నారు. వీళ్లందరి కంటే అదానీ జీతం కేవలం రూ.9.26 కోట్లు ఉండటం గమనార్హం. అయినప్పటికీ ఆయన 2028 నాటికి ప్రపంచ ట్రిలినియర్ల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోనున్నారు.