మొబైల్‌ని ఎన్ని రోజులకు ఒకసారి రీస్టార్ట్ చేయాలో తెలుసా?
మీకు తెలుసా? మొబైల్ ని రెగ్యులర్ గా రీస్టార్ట్ చేయాలి. లేకపోతే మీ ఫోన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మొబైల్ ని ఎన్నిరోజులకు ఒకసారి రీస్టార్ట్ చేయాలి? ఇలా చేయడం వల్ల కలిగే ఉపయోగాలు తదితర విషయాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి.
సాధారణంగా కంప్యూటర్, ల్యాప్ టాప్ రీస్టార్ట్ చేస్తుంటాం. ఏదైనా టెక్నికల్ ఎర్రర్, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇలా చేస్తాం. అదేవిధంగా ఏదైనా సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేసినా, అప్ డేట్ చేసినా రీస్టార్ట్ చేస్తుంటాం. కంప్యూటర్, లాప్ టాప్ రీస్టార్ట్ చేసినట్టుగానే మొబైల్ ను కూడా చేయాలి. అయితే ఈ విషయం గురించి చాలా మంది పెద్దగా ఆలోచించరు. కంటిన్యూగా మొబైల్ ఉపయోగిస్తుంటారు. అయితే ఎప్పుడైనా హ్యాంగ్ అయినా, స్టక్ అయినా అప్పుడు మాత్రమే రీస్టార్ట్ చేస్తుంటారు.
రీస్టార్ట్ చేయకపోతే నష్టాలు..
మొబైల్‌ని రెగ్యులర్‌గా రీస్టార్ట్ చేయకపోతే వచ్చే ఫోన్ పనితీరు స్లో అయిపోతుంది. RAM మెమరీ ఎక్కువగా నిండిపోయి మొబైల్ స్లోగా మారుతుంది. ఎక్కువ అప్లికేషన్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. ఇవి డివైస్ పనితీరును ప్రభావితం చేస్తాయి.
బ్యాటరీ త్వరగా అయిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్ లో రన్ అవుతున్న అప్లికేషన్ల వల్ల బ్యాటరీని త్వరగా డిశ్చార్జ్ అయిపోతుంది.
ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. రెగ్యులర్‌గా రీస్టార్ట్ చేయకపోతే మొబైల్ ఫ్రీజ్ అవ్వడం లాంటి సమస్యలు వస్తాయి.
రెగ్యులర్ గా రీస్టార్ట్ చేయకపోవడం వల్ల అప్డేట్స్ ఆగిపోతాయి. సాఫ్ట్‌వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లు సరిగ్గా అమలు కావు. అవసరమైన సెట్టింగులు లేదా డేటా అప్డేట్ అవడం ఆగిపోతుంది.
కాల్స్ డ్రాప్ అవ్వడం, నెట్‌వర్క్ కనెక్టివిటీ తగ్గడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
రీస్టార్ట్ చేయడం వల్ల ఉపయోగాలు
మొబైల్‌ని రెగ్యులర్‌గా రీస్టార్ట్ చేయడం వల్ల మెమొరీ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది. మొబైల్ వేగంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. బ్యాటరీ పనితీరు మెరుగుపడుతుంది. సిస్టమ్ స్టెబిలిటీ పెరుగుతుంది. డివైస్ ల్యాగ్ లేకుండా సాఫీగా పనిచేస్తుంది. చిన్నపాటి సాఫ్ట్‌వేర్ బగ్స్, ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్‌గా రీసెట్ అవుతాయి. నెట్‌వర్క్, Wi-Fi కనెక్టివిటీ బాగా పనిచేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్ల అప్డేట్లు సరిగ్గా జరిగి మొబైల్ బాగా పనిచేస్తుంది.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఫోన్ హీట్ అవడం తగ్గుతుంది.
ఎప్పుడు రీస్టార్ట్ చేయాలి?
ప్రతి మొబైల్ ని వారానికి ఒకసారి అయినా రీస్టార్ట్ చేయాలి. ఏదేైనా సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయిన తర్వాత వెంటనే రీస్టార్ట్ చేయడం మంచిది. మొబైల్ స్లోగా లేదా హీట్ అవుతున్నప్పుడు రీస్టార్ట్ చేయడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది.