డిసెంబర్‌లో ఆఫర్లు చూసి కారు, బైకు కొంటే చాలా నష్టపోతారు. ఎందుకో తెలుసా?
ఇయర్ ఎండింగ్ అని.. చాలా ఆటో మొబైల్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. కొన్ని కంపెనీలు వెహికల్స్ ధర తగ్గించకుండా యాక్సిసరీస్ పై ఆఫర్లు ఇస్తుంటాయి. వాటికి మీరు ఎట్రాక్ట్ అయి డిసెంబర్ నెలలో కారో, బైకో కొంటే భవిష్యత్తులో ఎంతో నష్టపోతారు. ఏం నష్టపోతారు. ఎలా నష్టం వస్తుంది. ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతి ఆటోమొబైల్ కంపెనీ కొత్త సంవత్సరంలో తమ కంపెనీ వెహికల్స్ కి సంబంధించిన కొత్త మోడల్స్ ని జనవరిలో లాంచ్ చేస్తాయి. అందువల్ల అప్పటికి తమ కంపెనీ వద్ద పాత మోడల్ కార్లు, బైకులు, స్కూటర్లు ఉంటే వాటిని ఎవరూ కొనరు. కొత్త వాటిని కొనేందుకే ఆసక్తి చూపుతారు. అందువల్ల ఆటోమొబైల్ కంపెనీలు పాత మోడల్స్ ని అమ్ముకోవడానికి డిసెంబర్ నెలలో భారీ డిస్కౌంట్స్ ప్రకటించి పాత మోడల్ వెహికల్స్ ని అమ్మడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి.
ఇలాంటి వెహికల్స్ కొనడం వల్ల మీరు ఒక సంవత్సరం వెహికల్ వయసును కోల్పోతారు. ఉదాహరణకు మీరు 2024 డిసెంబర్ లో వెహికల్ కొన్నా, 2024 జనవరిలో వెహికల్ కొన్నా.. దాన్ని ఆ సంవత్సరం 2024 మోడల్ గానే చూస్తారు. అందువల్ల డిసెంబర్ లో కొంటే మీ వెహికల్ వయసు 1 ఇయర్ కోల్పోయినట్లు అవుతుంది.
కారు అయినా, బైక్ అయినా సాధారణంగా 15 ఏళ్లు వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం రోడ్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ వద్దకు తీసుకెళ్లి చెక్ చేయించాలి. వారి పరిశీలించి ఇంకా ఎన్నాళ్లు ఉపయోగించవచ్చో సర్టిఫికేట్ ఇస్తారు. అందువల్ల డిసెంబర్ లో వెహికల్ కొంటే మీరు వెహికల్ వయసు 11 నెలలు కోల్పోతారు. ఇలాంటి వెహికల్స్ కి రీసేల్ వాల్యూ పడిపోతుంది. దీని వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పాత మోడల్ కార్లలో అప్ డేటెడ్ టెక్నాలజీ ఉండదు. ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకూ అప్ డేట్ అయిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాత మోడల్ కార్లు, బైకులు కొనడం వల్ల టెక్నాలజీలో మీ వెహికల్స్ వెనకడుగులో ఉంటాయి. కొన్ని కార్లు, బైకుల్లో డిజిటల్ టెక్నాలజీ ఫీచర్లను అప్ డేట్ చేయడానికి వీలు కూడా ఉండదు.
పాత మోడల్ కార్లు కొనడం వల్ల రిపేర్ అయినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా మార్కెట్ లో వాటి స్పేర్ పార్ట్స్ లభించవు. వీటి కోసం మీరు డిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో ఫ్యాక్టరీల నుంచి తెప్పించాల్సి ఉంటుంది. దీని కోసం సర్వీస్ సెంటర్లు ఎక్కువ ఛార్జ్ కూడా చేస్తాయి. ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు పడక తప్పదు.
డిసెంబర్ లో కారు, బైకు కొంటే వచ్చే నష్టాల్లో మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే.. లోన్ దొరకడం లేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి బ్యాంకులు వడ్డీరేట్లు పెంచే పనుల్లో బిజీగా ఉంటాయి. అందువల్ల మీరు డిసెంబర్ లో కారు కొనేందుకు బుక్ చేసినా మీకు తరువాత సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలోనే మీకు అందుతుంది. రిజస్ట్రేషన్ కూడా ఆలస్య జరగడానికి ఎక్కువ ఛాన్స్ లు ఉంటాయి. అయితే డీలర్లు కంగారు పెట్టారని, ధర తక్కువ వస్తోందని తొందరపడి వెహికల్ కొనేయొద్దు. కంపెనీలు తమ వెహికల్స్ అమ్ముకోవాలన్న లక్ష్యంతో మీకు నచ్చని కలర్ వెహికల్ ని కూడా మీతో బలవంతంగా కొనిపిస్తారు. జాగ్రత్తలు పాటించి, తెలివితేటలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.