ఇకపై WhatsApp స్టేటస్ కి కూడా మీరు లైక్ లు కొట్టొచ్చు
Whatsapp మరో అద్భుతమైన ఫీచర్ ను తీసుకొచ్చింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాంలో వచ్చిన కథనాలకు మీరు ఎలాగైతే లైక్ లు కొడతారో ఇప్పుడు Whatsapp స్టేటస్ లో వచ్చిన ఫొటోలు, వీడియోలు, స్టోరీలకు కూడా మీరు లైక్ లు కొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ మంది దగ్గర ఉండేది. మరి ఇప్పుడో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి ఉండడంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్లలో అందరూ ఎక్కువగా ఉపయోగించేవి whatsapp, instagram, facebook, you tube, google. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ తీసుకొచ్చిన స్పీకర్ ఆప్షన్స్ ద్వారా ఇప్పుడు చదువుకోని వారు కూడా సింపుల్ గా whatsapp, instagram, facebook, you tube, google వంటి వాటిని ఉపయోగిస్తున్నారు.
whatsapp ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్. దీని ద్వారా ఫ్రెండ్స్, తెలుసున్న వారు ఇలా అందరూ ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటారు. స్నేహితులతో గంటల తరబడి చాటింగ్ చేసుకోవడం, కాల్స్ ద్వారా మాట్లాడుకోవడం చేస్తుంటారు. ఇలా వాట్సాప్ ప్రజలందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది.
మనకి ప్రతి రోజూ మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, అందరూ వివిధ రకాల మెసేజ్ లు, వీడియోలు, పోస్ట్ చేస్తుంటారు. వాటిని వాట్సాప్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ ల్లో పోస్ట్ చేస్తుంటారు. గుడ్ మార్నింగ్ లు, కొటేషన్స్, వార్తలు, ఇలా అనేక రకాల విషయాలను మనతో పంచుకోవాలని పోస్టులు పెడుతుంటారు. మనకు పర్సనల్ గా పోస్టులు పెడితే మనం చూసి రిప్లై ఇవ్వడమే, లైక్ చేయడమే చేయొచ్చు.
కొందరు స్టేటస్ లలో ఫొటోలు, వీడియోలు, కొటేషన్స్, వార్తలు పోస్ట్ చేస్తుంటారు. అలాంటి వాటిలో బాగున్న వాటిని చూసి మనం కూడా కొటేషన్ బాగుందని, వీడియో నచ్చిందని అనుకుంటాం. ఇదే పోస్టులు instagram, facebookలలో స్టేటస్ ఆప్షన్ లో పెడితే సింపుల్ గా లైక్ కూడా చేయొచ్చు. మరి whatsapp స్టేటస్ లో వచ్చిన పొటోలకు, వీడియోలకు, కొటేషన్స్ కి లైక్ లు కొట్టలేం కదా... ఇదే ఫీచర్ ని వాట్సాప్ తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఇకపై మీరందరూ మీకు నచ్చిన వాట్సాప్ స్టేటస్ కు లైక్స్ కొట్టేయొచ్చు.
మీరు మీ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
అప్ డేట్స్ ఓపెన్ చేయండి.
మీరు ఎవరి స్టేటస్ చూడాలనుకుంటున్నారో అది తెరవండి.
వాళ్లు పెట్టిన స్టోరీ, ఫొటో, వీడియో, కొటేషన్ నచ్చితే కింద రిప్లై ఆప్షన్ కనిపిస్తుంది.
వెంటనే వారికి మీరు రిప్లై కూడా ఇవ్వొచ్చు.
లేదంటే పక్కనే హార్ట్ సింబల్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసి వారికి లైక్ కొట్టొచ్చు.
WhatsAppలో Meta AI చాట్‌బాట్‌కు సంబంధించి కొత్త వాయిస్ మోడ్ ఫీచర్ తీసుకొచ్చేందుకు ఆ సంస్థ పని చేస్తోంది. త్వరలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వినియోగదారులు తమ వాయిస్‌ని ఉపయోగించి AI చాట్‌బాట్‌తో మాట్లాడి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది.