WhatsAppలో సూపర్ ఫీచర్: మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇక సేఫ్
వాట్సాప్ యూజర్ల కోసం ఓ అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చింది. దీని వల్ల మీరు ఫోటోలు తీసి పెట్టుకున్న డాక్యుమెంట్స్ అని ఇక భద్రంగా ఉంటాయి. అందరికీ ఎంతో ఉపయోగపడే ఈ కొత్త ఫీచర్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
WhatsApp iOS యూజర్ల కోసం కొత్త ఇన్ యాప్ డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని వల్ల థర్డ్ పార్టీ స్కానింగ్ యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ యూజర్లు WhatsAppలోనే నేరుగా డాక్యుమెంట్‌లను స్కాన్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, సెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
WhatsApp యాప్‌లోనే డాక్యుమెంట్‌లను స్కాన్ చేసే కొత్త ఫీచర్‌తో డాక్యుమెంట్ షేరింగ్ చాలా సింపుల్ గా చేయవచ్చు. అయితే WhatsApp for iOS (24.25.80) తాజా వెర్షన్ ఉన్న కొంతమంది యూజర్లు మాత్రమే ఈ కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.
ఈ అప్‌డేట్‌తో WhatsApp యూజర్లు తమ ఫోన్ కెమెరాతోనే డాక్యుమెంట్ చిత్రాన్ని త్వరగా తీయొచ్చు. ఇక థర్డ్ పార్టీ స్కానింగ్ సాఫ్ట్‌వేర్ ఇతర టూల్స్ అవసరం లేదు.
WhatsApp ఈ పురోగతితో గణనీయంగా ముందుకు సాగింది. ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నప్పుడు డాక్యుమెంట్‌లను వేగంగా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది స్కాన్ చేసిన డాక్యుమెంట్‌లను తీసుకోవడం, ఎడిట్ చేయడం, సెండ్ చేయడం లాంటివి కేవలం సింపుల్, వన్ స్టాప్ సొల్యూషన్ విధానంలో చేయొచ్చు.
మీరు స్కాన్ చేసే డాక్యుమెంట్ టెక్స్ట్ స్పష్టంగా, కచ్చితంగా కనిపిస్తోందో లేదో ముంద సరి చూసుకోండి. ఈ యాప్ సూచించిన మార్జిన్‌లను మాన్యువల్‌గా కూడా సెట్ చేయొచ్చు. స్కాన్ చేసి ఎడిట్ చేసిన తర్వాత డాక్యుమెంట్‌ను మీరు పంపాలనుకున్న గ్రూప్ లేదా వ్యక్తికి జస్ట్ ఒక క్లిక్ తో సెండ్ చేయొచ్చు.
WhatsApp తన యూజర్లకు డాక్యుమెంట్‌లను స్కాన్ చేసి సెండ్ చేసే వీలు కల్పిస్తుంది కాబట్టి యూజర్లు ఇకపై స్కానింగ్ అప్లికేషన్‌లు లేదా ప్రింటర్‌ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్లు మిస్ యూజ్ అవుతాయన్న భయం ఉండదు.