MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. మీ ప్రాణాలను కాపాడేలా AI Doctor

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. మీ ప్రాణాలను కాపాడేలా AI Doctor

మీకు హెల్త్ బాగోలేకపోతే ఏం చేస్తారు. సాధారణంగా అయితే డాక్టర్ దగ్గరకు వెళతారు. అంతేకదా? ఇకపై డాక్టరే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అది కూడా వాట్సాప్ లో. మీరు ఆ డాక్టర్ తో వాట్సాప్ ద్వారా చాట్ చేసి మీ సమస్యను తెలియజేస్తే చాలు. మీరున్న కండీషన్ బట్టి ఏం చేయాలో ఆ డాక్టర్ చెప్పేస్తారు. ఆ డాక్టర్ పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు విన్నది నిజమే. వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్ ఇది. సూపర్ గా వర్క్ అవుతోంది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ స్టోరీ మొత్తం చదవండి.

2 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Sep 27 2024, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) 2024లో భారీ ప్రభావాన్ని చూపుతోంది. ఇది మన జీవితాల్లో గేమ్ ఛేంజర్ గా మారిపోయింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. మనుషుల పనిని తగ్గించేస్తోంది. మెషీన్స్ మనుషుల్లా ఆలోచించడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి AI సహాయపడుతోంది. ఒకప్పుడు మనిషి ఏదైతే అసాధ్యం అనుకున్నాడో, సైన్స్ ఫిక్షన్ గా భావించాడో AI వచ్చి అదంతా నిజం చేసేస్తోంది. మనిషి జీవితంలోని అనేక రంగాల్లో AI వినియోగం లేనంతగా ఇది మారిపోయింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇప్పటికే సాఫ్ట్ వేర్, పరిశ్రమలు, కస్టమర్ సపోర్ట్, ఎడ్యుకేషన్, ఇలా అనేక రంగాల్లో వీలైనంత వరకు AIని ఉపయోగించుకొంటున్నారు. అయితే కొన్ని రంగాలను AI ఎప్పటికీ రీప్లేస్ చేయలేదని నిపుణులు తెలిపారు. వాటిల్లో క్రియేటివ్ ఆర్ట్స్, హ్యుమానిటీ, పరిశోధనా రంగం, లీగల్ సిస్టమ్, మెడికల్ సెక్టార్ మొదలైనవి ఉన్నాయి.  
 

34

అయితే ఇప్పుడు వైద్య రంగాన్ని కూడా ప్రభావితం  చేసేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తయారవుతోంది. డాక్టర్ చేయాల్సిన డయాగ్నోసిస్ పనిని వాట్సాప్ లోనే AI doctor చేసేస్తోంది. ఈ కొత్త ఫీచర్ ను ఇటీవలే వాట్సాప్ యాజమాన్యం వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఫీచర్స్ చాలా అద్భుతంగా, యూజర్ ఫ్రెండ్లీగా  ఉన్నాయి. దీని కోసం మీరేంచేయాలంటే ముందుగా మీరు ‘8738030604’ను సేవ్ చేసుకోండి. 
 

44

మీ వాట్సాప్ లో ‘8738030604’ను సేవ్ చేసుకోండి. 
దీనికి AI Doctor అని పేరు పెట్టండి. 
వాట్సాప్ ఓపెన్ చేసి AI Doctor కాంటాక్ట్ ఓపెన్ చేయండి.
Chat Box లో Hi అని టైప్ చేయండి.
వెంటనే AI Doctor నుంచి రిప్లై వస్తుంది. 
అందులో ఉన్న సలహాలు, కండీషన్స్ పూర్తిగా చదవండి.
మీ హెల్త్ ప్రాబ్లమ్ ను టైప్ చేసి సెండ్ చేయండి.
మీరు వాయిస్ చాట్ ద్వారా కూడా AI Doctorతో మాట్లాడవచ్చు. 
మీ వాయిస్ ను రికార్డ్ చేసి పంపిస్తే AI Doctor రిప్లై ఇస్తారు. 
ఇందులో ఉన్న ఇంకో గొప్ప ఫీచర్ ఏంటంటే మీరు మీ హెల్త్ ప్రాబ్లమ్ లక్షణాలను ఫొటో తీసి కూడా వాట్సాప్ ద్వారా  AI Doctorకి పంపవచ్చు. దాన్ని చూసి మీ ప్రాబ్లమ్ కనిపెడతారు. అంతేకాకుండా తీసుకోవాల్సిన మెడిసన్, ప్రికాషన్స్ వివరిస్తారు. 
అంతేకాకుండా మీ ఆరోగ్య సమస్యకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఈ AI Doctorకి వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. వాటిని  చెక్ చేసి మీ హెల్త్ ప్రాబ్లమ్ తగ్గడానికి ఏంచేయాలో చెప్తారు.

AI Doctor తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఏ భాషలోనైనా రిప్లై ఇస్తారు. మీకు నచ్చిన, వచ్చిన లాగ్వేజ్ లో AI Doctorతో చాట్ చేసి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. 

వాట్సాప్ లో వచ్చిన ఈ అద్భుతమైన ఫీచర్ ను మీరు ఓసారి ప్రయత్నించండి. హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడండి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Prices: పసిడి ప్రియులకు భారీ షాక్..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Recommended image2
Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved