షోల్డర్ సర్ఫింగ్ స్కామ్ అంటే ఏంటి..? ఈ విషయం తెలియకపోతే మీ అకౌంట్లో డబ్బులు క్షణాల్లో మాయం..
మీ పక్కనే ఉంటారు. మీకు తెలియకుండా మీ అకౌంటును సున్నా చేసేస్తారు. దీన్నే షోల్డర్ సర్ఫింగ్ స్కామ్ అంటారు. కొత్తగా పేరు వినిపిస్తున్న ఈ స్కాంలో పక్కనే ఉంటూ స్కామర్‌లు మీ చుట్టూ నిలబడి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, మిమ్మల్ని పేదవారిగా మార్చేస్తారు.
మీరు ఇంతకు ముందెప్పుడు షోల్డర్ సర్ఫింగ్ స్కామ్ గురించి వినకపోతే, ఇప్పుడు మీరు ఈ విషయం గురించి జాగ్రత్తగా తెలుసుకోండి. ఈ స్కాంలో స్కామర్‌లు మీతో భుజం భుజం కలుపుతూనే మిమ్మల్ని మోసం చేస్తారు. ఇది ఎలా జరుగుతుందో అర్థం చేసుకుందాం.. ఈ మోసాలు ప్రధానంగా ATM క్యాబిన్లు, కాఫీ షాపులు, రెస్టారెంట్లు, తక్కువ రద్దీ ప్రదేశాలలో జరుగుతాయి.
షోల్డర్ సర్ఫింగ్ స్కామ్ అంటే ఏమిటి
ఈ స్కామ్‌లో స్కామర్‌లు మీ చుట్టూ ఉంటారు. మీ వ్యక్తిగత సమాచారాన్ని మొబైల్ టాబ్లెట్ లేదా ఏదైనా ఇతర గాడ్జెట్‌లలో వాడుతున్నప్పుడు, మీ కదలికలను రహస్యంగా రికార్డు చేస్తారు. ఉదాహరణకు మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తున్నప్పుడు. రహస్యంగా మిమ్మల్ని రికార్డు చేస్తారు. మీ వేలి కదలికలను బట్టి మీ యూజర్ నేమ్ పాస్ వర్డ్ తెలుసుకుంటారు. వీలైతే మిమ్మల్ని వీడియో రికార్డు చేస్తారు. ఆతర్వాత స్కామర్లు ఆ సమాచారంతో మిమ్మల్ని మోసం చేస్తారు.
ఈ స్కామ్ ATMలలో ఎక్కువగా ఉపయోగిస్తారు..
షోల్డర్ సర్ఫింగ్ స్కామ్ ఎక్కువగా ATMలలో జరుగుతుంది, స్కామర్‌లు మీ వెనుక నిలబడి . మీరు ATM నుండి డబ్బు విత్‌డ్రా చేస్తున్నప్పుడు. కాబట్టి వారు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. చాలా సార్లు మీకు సహాయం చేస్తామనే సాకుతో మీ ATM కార్డు నుంచి డబ్బును దొంగతనం చేస్తారు.
షోల్డర్ సర్ఫింగ్ స్కామ్‌ను ఎలా నివారించాలి
ఈ స్కామ్‌ను నివారించే మార్గం చాలా సులభం. మీరు ATM లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ని ఉపయోగించినప్పుడు, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు చూడకుండా టైప్ చేయండి. మీరు పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే సమయంలో మిమ్మల్ని ఎవరైనా రికార్డ్ చేస్తున్నారా లేదా అనేది గుర్తుంచుకోండి.