బంపర్ ఆఫర్: TVS iQube స్కూటర్ కొంటే 100% క్యాష్ బ్యాక్!
టీవీఎస్ కంపెనీ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఆ కంపెనీ 4.5 లక్షల స్కూటర్ అమ్మకాలు చేసి కొత్త మైలురాయిని చేరుకుంది. దీన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు కస్టమర్లకు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఇది పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి.
ఇండియన్ మార్కెట్లో అత్యంత విజయవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో TVS iQube స్కూటర్ ఒకటి. ఇది ఫెస్టివల్ సీజన్లలో బాగా అమ్ముడైన వెహికల్స్ లో ఒకటిగా నిలిచింది. భారతదేశం అంతటా భారీగా ఈ స్కూటర్లు అమ్ముడయ్యాయి.
మీరు TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే మీకు TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు టీవీఎస్ ఈ స్కూటర్‌ని 4.5 లక్షల యూనిట్లు అమ్మకాలు చేసింది. ఈ విషయాన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు కంపెనీ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. మీ లక్ ని పరీక్షించుకోవాలంటే ఇప్పడే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుగోలు చేయండి.
TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ పై దసరా సమయంలోనూ మంచి ఆఫర్స్ ఇచ్చారు. దసరా పండగ సందర్భంగా రూ.27 వేలకు పైగా తగ్గింపుతో ఈ స్కూటర్లు అమ్మారు.
మీరు ఐక్యూబ్ స్కూటర్ కొనుక్కోవాలనుకుంటే ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఈ ఆఫర్ డిసెంబర్ 12 నుండి 22 వరకు, అంటే 10 రోజులకు మాత్రమే ఉంటుంది. ఈ లోపు స్కూటర్ కొన్నవారికి మాత్రమే 100% క్యాష్ బ్యాక్ గెలిచే అవకాశం ఉంటుంది.
TVS iQube లో మూడు బ్యాటరీ వేరియంట్స్ ఉన్నాయి. అవి 2.2 kWh, 3.4 kWh, 5.1 kWh బ్యాటరీలతో లభిస్తున్నాయి. వీటి ధర రూ.1.29 లక్షల నుండి రూ.1.85 లక్షల వరకు ఉంటుంది. ఫుల్ ఛార్జ్‌లో ఉన్నప్పుడు ఈ స్కూటర్ పై 75 నుండి 150 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.
అత్యధికంగా ఐక్యూబ్ స్కూటర్ల విక్రయాలు చేసినందుకు గాను మిడ్‌నైట్ కార్నివల్ ఆఫర్ పేరుతో టీవీఎస్ కంపెనీ ప్రతిరోజూ ఒక లక్కీ కస్టమర్‌కి ఎంపిక చేయనుంది. ఆ వ్యక్తికి 100% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే టీవీఎస్ డీలర్‌షిప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఈ అవకాశం ఉంటుంది. ఆఫర్ ఉన్న రోజుల్లోనే స్కూటర్ కొనుగోలు చేయాలి.
సాధారణంగా TVS iQube కొనుగోలుదారులకు రూ.30,000 వరకు గ్యారెంటీ బెనిఫిట్స్ ఉంటాయి. 3.4 kWh వేరియంట్‌కి 5 సంవత్సరాలు లేదా 70,000 కి.మీ. వారంటీ ఉచితం. 2.2 kWh వేరియంట్‌కి 5 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ. వారంటీ ఉచితం. మీరు మీ సమీపంలోని డీలర్‌ని సంప్రదించండి లేదా TVS iQube వెబ్‌సైట్ ను ఓపెన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.