ఇండియాలో టాప్ బిజినెస్ మెన్ వీళ్లు.. తినే ఫుడ్ మాత్రం వెజ్.. వారెవరో తెలుసా?
నాన్ వెజ్ తింటే చాలా బలం వస్తుందని, తెలివితేటలు పెరుగుతాయని ఎక్కువ మంది అనుకుంటారు. కాని వెజిటేరియన్ ఫుడ్ లోనే నాన్ వెజ్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాన్ వెజ్ కంటే వెజ్ తింటేనే బలం, తెలివి పెరుగుతాయని తమ వ్యాపార విజయాల ద్వారా నిరూపించారు కొందరు టాప్ ఇండియన్ బిజినెస్ మెన్. కేవలం శాఖాహారం తినే ఇండియాలోని టాప్ బిజినెస్ మెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గౌతమ్ అదాని
ప్రపంచంలోనే టాప్ బిలియనీర్ లలో ఒకరైన భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదాని ప్యూర్ వెజిటేరియన్. ఆయనకు గుజరాతి వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఖమన్ ధోఖ్లా వంటి గుజరాతి నార్మల్ స్నాక్స్‌ను ఇష్టపడతారు. అదాని హిందూ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. అందుకే ఎక్కువ శాకాహారం తింటారు. ఆయన తీసుకొనే ఫుడ్ లో అధికంగా ఆవు పాలు, మెత్తటి రోటీలు, కూరగాయల కర్రీలు, పప్పు, రైస్, లైట్ వంటకాలకు సంబంధించిన ఆహార పదార్థాలు ఉంటాయి. తేలికపాటి, పోషకాహారంతో కూడిన డైట్ ఫాలో అవుతూ అదాని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.
సునీల్ మిట్టల్
భారతీ ఎయిర్ టెల్ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ అయిన సునీల్ మిట్టల్.. ఎక్కువగా శాకాహారం తినడానకి ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా వ్యాపార పరమైన కీలక సందర్భాల్లో పూర్తిగా శాకాహారం తీసుకుంటారట. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, అది సక్సెస్ కావడానికి వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ దీక్షగా ఉంటారట. ఆ సమయంలో ఆలోచనలు కూడా పాజిటివ్ గా, ఎంతో ఉపయోగపడే విధంగా వస్తాయని సునీల్ చెబుతున్నారు.
ఆయన ఇష్టమైన వెజిటేరియన్ ఆహారాల్లో పిజ్జా మార్గరీటా, స్పాగెట్టీ మొదలైనవి ఉన్నాయి. వీటిని సాధారణంగా కాఫీ షాప్‌లలో లేదా వ్యాపార చర్చల సందర్భంగా తీసుకోవడం ఆయనకు ఇష్టం.
ఆనంద్ మహీంద్రా
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా లైట్, ట్రెడిషనల్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడతారు. ఆయన ప్రధానంగా వెజిటేరియన్ వంటకాల మీద ఆసక్తి చూపిస్తారు. ప్రత్యేకంగా పంజాబీ ధాబాల వద్ద లభించే ఛోలే భటూరే వంటి వంటకాలనూ ఆస్వాదిస్తూ తింటారట. పంజాబీ వెజిటేరియన్ ఆహారం గురించి ఆయన తరచూ మెచ్చుకుంటారు. ఆయన నార్మల్ డైట్‌లో లైట్ ఫుడ్, రుచికరమైన పదార్థాలు ఉంటాయి. కానీ వ్యాపార ప్రయాణాల్లో వివిధ ప్రాంతీయ వంటకాలు కూడా ఆస్వాదిస్తారు.
కుమార్ మంగళం బిర్లా
కుమార్ మంగళం బిర్లా కూడా ప్యూర్ వెజిటేరియన్. అయితే బిర్లా గ్రూప్ గ్లోబల్‌గా విస్తరించడంతో ఆయన తమ సంస్థలో పనిచేసే ఇతర దేశాల ఉద్యోగుల కోసం నాన్ వెజ్ ని తన కంపెనీ క్యాంటీన్లలో తినడానికి అనుమతించారు. అయితే తాను వ్యక్తిగతంగా మాత్రం వెజిటేరియన్ ఫుడ్ నే ఇష్టపడతారు. తింటారు. కుటుంబ సంప్రదాయాల పట్ల నిబద్ధతగా ఉంటారు. ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారు.
అనిల్ అగర్వాల్
అనిల్ అగర్వాల్.. ఆయన వేదాంత గ్రూప్ చైర్మన్. అనిల్ అగర్వాల్ పక్కా వెజిటేరియన్. ఆయనకు ఎక్కువగా భారతీయ వంటకాలంటేనే ఇష్టం. ప్రధానంగా ఆరోగ్యకరమైన, సాంప్రదాయ భారతీయ వెజిటేరియన్ ఆహారాన్ని ఇష్టపడతారు. ఇందులో రొటీ, సబ్జీలు, పప్పు వంటి వంటకాలు ఉంటాయి. వీటితో పాటు అదనంగా ఆయన హెల్తీ జీవనశైలిని పాటిస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు.