అద్భుతమైన ఫీచర్స్‌తో రూ.40 వేల కంటే తక్కువకే లభించే 5 స్మార్ట్ ఫోన్లు ఇవిగో
కాస్త డబ్బులు ఎక్కువైనా పర్లేదు.. బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలని మీరు చూస్తున్నారా? ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లు, పవర్ ఫుల్ కెమెరాలు లాంటి అద్భుతమైన ఫీచర్లతో రూ. 40 వేల లోపు లభించే 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి ఇక్కడ వివరాలు ఉన్నాయి. మీకు నచ్చిన ఫోన్ ను సెలెక్ట్ చేసుకోవడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి.
Vivo V40
ఇండియాలో vivo V40 ప్రారంభ ధర రూ.32,899. ఇది 8 GB RAM / 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది. బేస్ వేరియంట్ అయిన vivo V40 బ్లూ, లోటస్ పర్పుల్, టైటానియం గ్రే కలర్‌లలో లభిస్తుంది. పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ కి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. 4500 నిట్‌ల మాక్సిమం బ్రైట్ నెస్ ఇందులో మీరు సెట్ చేసుకోవచ్చు. 5500mAh బ్యాటరీతో సన్నని డిజైన్ మిమ్మల్ని కచ్చితంగా ఆకర్షిస్తుంది. కెమెరాల కోసం ZEISS బ్రాండింగ్ సిస్టమ్ ని ఉపయోగించారు. AMOLED డిస్‌ప్లే, 5,500mAh బ్యాటరీ, 7.6mm మందం, 190 గ్రాముల బరువు తో చాలా స్లిమ్ గా ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్, 1260×2800 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ తదితర ఫీచర్లు Vivo V40కి మరింత డిమాండ్ పెంచాయి.
Realme 13 Pro+
ప్రపంచంలోనే మొట్టమొదటి 50MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరాను కలిగిన Realme 13 Pro+ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. 6.7 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండటం వల్ల వీడియోలు, సినిమాలు చాలా క్లారిటీగా ప్లే అవుతాయి. 5,200mAh బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ సేపు ఛార్జింగ్ వచ్చేలా చూస్తుంది. దీంతో 80W ఛార్జర్ ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 7-సిరీస్ చిప్‌సెట్, స్టీరియో స్పీకర్లు, అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్, IP65-రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
Oppo Reno 12 Pro
Oppo Reno 12 Pro కూడా 6.7 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. ఇది తేలికగా, కాంపాక్ట్, స్టైలిష్‌గా ఉంటుంది. Reno12 Pro HDR10+ సపోర్ట్ తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది Android 14 ఆధారంగా ColorsOS 14.1తో రన్ అవుతుంది. మీరు 3 సంవత్సరాల మేజర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందవచ్చు. 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయి.
Motorola Edge 50 Pro
మోటోరోలా బ్రాండ్ కి చెందిన సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇది. 6.7 అంగుళాల 1.5K pOLED కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 50W వైర్‌లెస్, 125W వైర్డ్ రాపిడ్ ఛార్జింగ్‌తో వస్తుంది. 4,500 mAh బ్యాటరీని కలిగి ఉంది. IP68 రేటింగ్, 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 3x టెలిఫోటో లెన్స్ వంటి స్మార్ట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.31,999 నుండి ప్రారంభమవుతుంది. ఇది Vivo V30, Redmi Note 13 Pro+లకు పోటీగా మార్కెట్ లోకి వచ్చింది.
OnePlus 12R
OnePlus 12R స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 100W SUPERVOOC ఛార్జర్ తో భారీ 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని ప్రారంభ ధర రూ. 39,999. ఈ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్, 6.78-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో 2780x1264 పిక్సెల్‌ల రిజల్యూషన్ కలిగి ఉంది. ఇది 8GB, 16GB RAMతో వస్తుంది. Android 14 బేస్ చేసుకొని పనిచేస్తుంది. 50 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సెటప్ తో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది.