Samsungకి పోటీగా వచ్చిన టాప్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవిగో
ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేడెక్కుతోంది. Google, Vivo, Xiaomi వంటి కంపెనీలు కూడా Galaxy S24 Ultraకి పోటీగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు అందిస్తున్నాయి. ఈ ఏడాది టాప్ లో నిలిచిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే మీకు నచ్చిన మోడల్ ఎంపిక చేసుకోవడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి.
ప్రీమియం మార్కెట్లో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీ తీవ్రమవుతోంది. సాధారణంగా Apple, Samsungలలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే ఇటీవల Google, Vivo, Xiaomi వంటి కంపెనీలు హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేశాయి. అవి Samsungతో పోటీపడుతున్నాయి. ముఖ్యంగా కెమెరా పనితీరు విషయంలో ఒకదానికి మించి మరొకటి ఎక్కువ క్లారిటీ, ఫీచర్లు అందిస్తున్నాయి. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీకు బెటర్ ఆప్షన్ గా అనిపించిన ఫోన్ సెలక్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
1. Google Pixel 9 Pro, Google Pixel 9 Pro XL
మీరు మంచి కెమెరా ఫోన్, అత్యాధునిక AI ఫంక్షన్‌లతో నడిచే సింపుల్ గాడ్జెట్ కోసం చూస్తున్నట్లయితే Pixel 9 Pro, Pixel 9, Pro XL మీకు సరైన సెలక్షన్స్ అవుతాయి. ఈ ఫోన్‌లు వాడుతున్నప్పుడు మీరు హై-ఎండ్ ఫీచర్స్ ఎంజాయ్ చేస్తారు. వీటి ద్వారా ఒక సంవత్సరం Google Gemini సభ్యత్వం లభిస్తుంది. ఏడు సంవత్సరాల పాటు Android అప్‌గ్రేడ్‌లు మీ ఫోన్ ను ఎప్పటికప్పుడు కొత్త దానిలా మారుస్తుంది. ఈ సంవత్సరం రిలీస్ అయిన Pixel సిరీస్ మంచి బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంది.
2. iPhone 16 Pro
iPhone 16 Pro ఇప్పుడు iOS 18.1 వెర్షన్ ను కలిగి ఉంది. ఇందులో ఉండే ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మీకు చాలా బాగా నచ్చుతాయి. దాని టైటానియం నిర్మాణం హై-ఎండ్ క్వాలిటీని అందిస్తుంది. iPhone 16 Pro 6.3 అంగుళాల డిస్ ప్లే, S24 Ultra కంటే మరింత కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను కలిగి ఉంది.
అలాగే మీరు చిన్న ఫోన్‌లను ఇష్టపడితే iPhone 16 Pro Max మీకు మంచి ఎంపిక. దీని కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. దాని 6.9 అంగుళాల డిస్ ప్లే మిమ్మల్ని బాగా ఆకర్షిస్తుంది. iPhone 16 Pro Max పెద్ద గాడ్జెట్‌లను కోరుకునే వ్యక్తులకు బాగా నచ్చుతుంది.
3. Xiaomi 14 Ultra
ఫోటోగ్రఫీని ఇష్టపడేవారికి Xiaomi 14 Ultra బాగా నచ్చుతుంది. లైకా ట్యూన్డ్ ఆప్టిక్స్‌తో ఇది వైబ్రెంట్, బ్లాక్ & వైట్, స్టాండర్డ్ వంటి ప్రత్యేకమైన లైకా లుక్‌లను అందిస్తుంది.
ఈ ఫోన్ లో Snapdragon 8 Gen 3 CPU ఉంది. కెమెరా కాన్ఫిగరేషన్‌లోని ప్రైమరీ 50MP సెన్సార్ లాగ్ ఫార్మాట్‌లో షూట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. Xiaomi సాఫ్ట్‌వేర్ ను ఇప్పుడు HyperOS అని పిలుస్తారు. ఇది కొంత బ్లోట్‌వేర్‌ను కలిగి ఉంది.
4. Vivo X100 Pro
అద్భుతమైన కెమెరా క్వాలిటీలను ఇచ్చే స్మార్ట్ ఫోన్లను Vivo ఇప్పటికీ తయారు చేస్తోంది. X100 Pro దీనికి సరైన ఉదాహరణ. ఇందులో ట్రిపుల్ 50MP కెమెరా కాన్ఫిగరేషన్, Zeiss ట్యూన్డ్ ఆప్టిక్స్ ఉన్నాయి. అందువల్ల ఈ ఫోన్ లో తీసే చిత్రాలు చాలా లైవ్ లీగా ఉంటాయి. MediaTek Dimensity 9300 CPU, 16GB RAM, 512GB వరకు స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంది. ఇది 5,400mAh బ్యాటరీ, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్ HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది.