టీవీఎస్ జూపిటర్ నుంచి హోండా యాక్టివా వరకు : టాప్-5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు ఇవే
Top 5 best-selling scooters in India : జూలై 2024లో భారతీయ స్కూటర్ మార్కెట్లో హోండా యాక్టివా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. దాని తర్వాత టీవీఎష్ జూపిటర్, సుజూకి యాక్సెస్ 125, హోండా డియో, TVS Ntorq లు అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికలుగా ఉన్నాయి.
టాప్-5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు
Honda Activa భారతీయ స్కూటర్ మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. జూలై 2024లో హోండా 1,95,604 యూనిట్లను విక్రయించింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్‌గా తన స్థానాన్ని నిలుపుకుంది. హోండా యాక్టివా విజయానికి దాని విశ్వసనీయత, బలమైన బ్రాండ్ ఉనికి, ప్రజలను ఆకర్షించే డిజైన్ వంటి కారణాలు ఉన్నాయి.
యువకుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు దేశంలో లక్షలాది మందికి విశ్వసనీయ ఎంపికగా హోండా యాక్టివా మరింది. Honda Activa బేస్ వేరియంట్ ధర ₹76,684 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ 109.51cc ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన, సమర్థవంతమైన రైడ్‌ను అందిస్తుంది.
దాని నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, అధిక రీసేల్ కు ప్రసిద్ధి చెందిన హోండా యాక్టివా దీర్ఘకాలిక మన్నికను కోరుకునే వారికి అద్భుతమైన ద్విచక్ర వాహనంగా మారింది. LED టెయిల్ లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, సెక్యూరిటీ అలారమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
లార్జ్ స్టోరేజ్ స్పేస్ (ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్, హూడర్ ఫుట్‌హోపర్) వెసులుబాటుగా అందుబాటులో ఉన్న రీఅర్డ్రింగ్ హుక్ దీని ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. నేచురల్ బ్యాలెన్స్ ను అందించే హ్యాండిల్ బార్, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కూడా దీని సొంతం. అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా నగరాల్లో అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి.
TVS Jupiter
దేశంలో అమ్ముడవుతున్న స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ రెండో స్థానంలో ఉంది. TVS Jupiter జూలై 2024లో 74,663 యూనిట్లను విక్రయించి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. TVS Jupiter లో లెటెస్ట్ టెక్నాలజీ, సౌకర్యవంతంగా ఉంటే విశాలమైన డిజైన్, ఇంధన-సమర్థవంతమైన పనితీరుతో టాప్ స్కూటర్ల లిస్టులో స్థానం సంపాదించింది. రూ.73,700 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే Jupiter స్కూటర్లు దాని పోటీ దారులకు గట్టి పోటీనిస్తుంది.
టీవీఎస్ జూపిటర్ వివరాలు
ఇంజిన్ అండ్ ట్రాన్స్‌మిషన్: 109.7cc, 4-స్ట్రోక్, AIR-కూల్డ్ ఇంజిన్ తో నడుస్తుంది. దాదాపు 7.88 bhp @ 7,500 RPM పవర్ తో నడుస్తుంది. కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ లో Telescopic ఫోర్క్, వెనుకభాగంలో డ్యూయల్ షాక్ అబ్సార్బర్ ఉంటాయి. వివిధ మోడళ్లను బట్టి డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ ఉన్నాయి.
అలాగే, అత్యాధుని ఫీచర్లు కూడా ఉంటాయి. డిజిటల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ లో స్పీడో మీటర్, ట్రిప్ మోటర్, ఫ్యూయల్ గేజ్ మొదలైనవి ఉన్నాయి. అలాగే, కొన్ని వెర్షన్లలలో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది.
Suzuki Access
జూలై 2024లో 71,247 యూనిట్లను విక్రయించిన Suzuki Access 125 మరొక అత్యధిక విక్రయాలు నమోదుచేసిన స్కూటర్. రూ.79,899 (ఎక్స్-షోరూమ్) నుండి ధర కలిగిన Access 125 భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ 125cc స్కూటర్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దాని సున్నితమైన రైడ్, దృఢమైన బిల్డ్ క్వాలిటీ, ఆకట్టుకునే పనితీరుతో విక్రయాల్లో దూసుకుపోతోంది.
ఈ సెగ్మెంట్‌లోని తన పోటీదారులతో పోలిస్తే మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. 8.7 bhp శక్తిని అందించే 124cc ఇంజిన్‌తో, Suzuki Access 125 అద్భుతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. నగరం ట్రాఫిక్ లో సులభంగా నడపవచ్చు. అధునాతన టెక్నాలజీలో డిజిటల్ మీటర్, ఎకో అసిస్ట్ ఇల్యూమినేషన్, అదనపు సౌకర్యం కోసం పొడవైన సీటు ఉన్నాయి. దూరు ప్రయాణాలు చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.
Honda Dio
Honda Dio జూలై 2024లో 33,447 యూనిట్లను విక్రయించింది. ముఖ్యంగా యంగ్ రైడర్లలో బాగా ప్రజాదరణ పొందింది. యువకులకు ఇది తొలి ఎంపికగా మారుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. Honda Dio స్పోర్టి డిజైన్, ఆకట్టుకునే రంగులు కాలేజీ యువకులను ఆకర్షిస్తున్నాయి.
దీని ధర ₹70,211 (ఎక్స్-షోరూమ్), దాని స్టైలిష్ లుక్స్, ఆకట్టుకునే పనితీరుతో గొప్ప విలువను అందిస్తుంది. Dio 109.51cc ఇంజిన్ కలిగి ఉంటుంది. పూర్తిగా డిజిటల్ మీటర్, బయటకు ఉండే ఇంధన మూత, ఇంటిగ్రేటెడ్ హెడ్‌ల్యాంప్ బీమ్, పాసింగ్ స్విచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దాని కాంపాక్ట్ సైజు పెద్ద స్కూటర్‌కు తగినంత సౌకర్యవంతంగా ఉంటూనే ఇరుకైన నగర వీధుల్లో నావిగేట్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
TVS Ntorq
జూలై 2024లో 26,829 యూనిట్లను విక్రయించిన TVS Ntorq 125, 124.8cc ఇంజిన్ ను కలిగి ఉంటుంది. రూ. 89,641 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో Ntorq దాని పోటీదారుల కంటే కొంచెం ఎక్కువ ధరకు మార్కెట్ లో ఉంది. అయితే ధీని ధరకు తగ్గట్టుగానే అనేక ఫీచర్లు కలిగి ఉంటుంది. దీని 125cc ఇంజిన్ థ్రిల్లింగ్ రైడ్ అనుభవాన్ని అందిస్తుంది.
పనితీరు, అద్భుతమైన డిజైన్ ను కోరుకునే యువ రైడర్లలో మంచి ఎంపికగా మారింది. హైటెక్ ఫీచర్లకు ప్రసిద్ధి చెందిన TVS Ntorq బ్లూటూత్ కనెక్టివిటీ, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్ అసిస్ట్‌ను కలిగి ఉంది.