7 సీటర్ కోసం చూస్తున్నారా.. తక్కువ ఖర్చులో బెస్ట్ ఆప్షన్స్
కారు.. అందరికీ అత్యవసరం ఇప్పుడు. నలుగురు ఉన్న కుటుంబంలో కచ్చితంగా కారు ఉంటోంది. మరి ఏడుగురు, ఎనిమిది మంది ఉన్న వారికి చిన్న కార్లు ఎలా సరిపోతాయి. అందుకే ఇండియాలో 7 సీట్ల కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దూర ప్రయాణాలకు వెళ్లడానికి, పెద్ద కుటుంబాలకు 7-సీటర్ కార్లు మొదటి ఎంపిక అవుతుంది. దూర ప్రయాణాలకు ఇవి చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. అలాంటి అయిదు చౌకైన 7-సీటర్ కార్ల వివరాలు ఇవిగో..
మహీంద్రా బొలెరో నియో
మహీంద్రా కంపెనీకి చెందిన బొలెరో నియో 7-సీటర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. బొలెరో నియో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో 100 bhp శక్తిని, 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 17.4 kmpl మైలేజీని ఇస్తుంది. బొలెరో నియో ప్రారంభ ధర రూ. 9,64,000 (ఎక్స్-షోరూమ్).
మారుతీ సుజుకి ఎర్టిగా..
ఈ కారు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 7 సీట్ల కారు. అందుబాటు ధరకు, మంచి మైలేజీకి, సౌకర్యానికి ఈ కారు చాలా ఫేమస్. ఎర్టిగా ధర రూ. 8,64,000 (ఎక్స్-షోరూమ్). ఎర్టిగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 105 bhp శక్తి, 138 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు 24.52 kmpl మైలేజీని ఇస్తుంది.
రెనాల్ట్ ట్రైబర్
రెనాల్ట్ ట్రైబర్ స్టైలిష్ డిజైన్, తాజా ఫీచర్లు, సరసమైన ధర కారణంగా ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కారు 18.1 kmpl మైలేజీని ఇస్తుంది. ట్రైబార్ ప్రారంభ ధర రూ. 6,33,500 (ఎక్స్-షోరూమ్). ట్రైబర్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 72bhp శక్తి, 96Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.
టయోటా రూమియన్
టయోటా రూమియన్ స్టైలిష్ డిజైన్, అద్భుతమైన ఇంటీరియర్ కలిగి ఉంది. తక్కువ ధర, బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ కారుగా గుర్తింపు పొందింది. రోజువారీ వినియోగానికి ఇది మంచి ఎంపిక. ఇది సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని, భద్రతా లక్షణాలను అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.10,29,000 (ఎక్స్-షోరూమ్).
మహీంద్రా స్కార్పియో
మహీంద్రా స్కార్పియో అనేది స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(SUV). దీని ప్రారంభ ధర రూ.13,26,000 (ఎక్స్-షోరూమ్). ఈ కారు 7 సీట్ల వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంది. స్కార్పియో నియో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో 138 bhp శక్తి, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 14.5 kmpl మైలేజీని ఇస్తుంది.