MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Best Mileage Bikes: రూ.65 వేల లోపు ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 3 బైక్స్ ఇవిగో

Best Mileage Bikes: రూ.65 వేల లోపు ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 3 బైక్స్ ఇవిగో

Best Mileage Bikes: రోజు వారీ అవసరాలకు తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని చూస్తున్నారా? మీ అవసరాలకు సరిపోయే 3 కంపెనీల బైక్ ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి పరిశీలించండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Feb 19 2025, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఇండియాలో ఆటో మొబైల్ రంగం ఎంత దూసుకుపోతున్నా ఫ్యామిలీ మెన్ అవసరాలు తీర్చేవి మాత్రం బైకులే. అందుకే మధ్య తరగతి వారు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ సమాచారం. రూ.55 వేల నుంచి రూ.65 వేల మధ్యలో ధరలు ఉన్న బెస్ట్ మైలేజ్ బైకుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

 

24

TVS స్పోర్ట్

రోజూ ఆఫీస్ కి వెళ్లొచ్చే వారికి, మార్కెటింగ్ జాబ్స్ చేసేవారికి TVS స్పోర్ట్ అనువైన బైక్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.59,881 నుండి ప్రారంభమవుతుంది. 110cc ఇంజిన్ ఉన్న ఈ బైక్ 4 స్పీడ్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంది. ఇందులో ఉన్న ET-Fi టెక్నాలజీ ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది.

ఇందులో 10 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది. ఈ బైక్ లీటరుకు 70-80 కి.మీ మైలేజ్ ఇస్తుంది. తేలికైన బాడీ కావడంతో రైడ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. 

34

హోండా షైన్ 100

రోజువారీ అవసరాల కోసం హోండా షైన్ 100 కూడా బాగుంటుంది. ఇంజిన్ గురించి చెప్పాలంటే షైన్ 100 98.98 cc 4 స్ట్రోక్ SI ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో కూడా 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఇంజిన్ చాలా స్మూత్ గా ఉంటుంది. మైలేజ్‌ విషయానికొస్తే లీటరుకు 65 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

హోండా షైన్ 100 ధర మార్కెట్ లో రూ.64 వేల నుండి ప్రారంభమవుతుంది. సిటీల్లో ఉండే వారికి ఈ బైక్  చాలా బాగా ఉపయోగపడుతుంది. 

44

హీరో HF డీలక్స్

హీరో మోటోకార్ప్(Hero MotoCorp) HF డీలక్స్ ధర మిగిలిన వాటితో పోలిస్తే తక్కువ. ఆఫీస్‌కి రోజూ వెళ్లి రావడానికి ఇది అనువైన బైక్.  హీరో మోటోకార్ప్ ఇంజిన్ కెపాసిటీ 97.2cc. ఈ ఇంజిన్ 8.36 bhp శక్తిని, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ నగరం నివసించే వారికే కాకుండా లాంగ్ డ్రైవ్ వెళ్లడానికి కూడా బాగుంటుంది.

హీరో HF డీలక్స్ ధర రూ.57 వేల నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్ రోజువారీ ఉపయోగం కోసం చాలా బాగుంటుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Budget Smartphone : కేవలం ఏడు వేలకే.. 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 128GB స్టోరేజీ స్మార్ట్ ఫోన్ మీ సొంతం..!
Recommended image2
Today Gold Rate: బంగారం ధరలకు రెక్కలు..ఇప్పుడు కొనడం మంచిదేనా?
Recommended image3
Business Idea: తక్కువ ఖర్చు.. అదిరిపోయే లాభం.! ఈ తిరుగులేని వ్యాపారంతో నెలకు లక్షల్లో సంపాదన..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved