ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే టాప్ 10 వ్యాపారాలు.. ఏడాది పొడవునా లాభాలే!
ఏ వ్యాపారమైనా సరే.. ఒక్కసారి క్లిక్ అయితే వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి ఉండదు. కొన్ని వ్యాపారాలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఏడాది పొడవునా డబ్బులు కురిపిస్తాయి. వాటికి ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు. ఆ వ్యాపారాలేంటో చూద్దామా…

ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే వ్యాపారాలు
మన దేశంలో చిన్న వ్యాపారాలకు మంచి భవిష్యత్ ఉంటుంది. తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే వ్యాపారాలు ఎన్నో ఉన్నప్పటికీ.. కొన్ని వ్యాపారాలు మాత్రం కాలం మారినా నిలకడగా ఆదాయాన్ని ఇస్తుంటాయి. సరైన వ్యాపార ఆలోచన, కష్టపడి పనిచేసే తత్వం, కస్టమర్లతో బంధాన్ని కొనసాగించగలిగితే ఏ వ్యాపారంలోనైనా పెద్ద విజయం సాధించవచ్చు. ఎప్పటికీ ట్రెండ్‌లో ఉండే టాప్ 10 చిన్న వ్యాపారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఫుడ్ బిజినెస్
మనం ఉన్నన్ని రోజులు ఫుడ్ తినాల్సిందే. ఫుడ్ కి ఎప్పుడూ ప్రాధాన్యం తగ్గదు. కాబట్టి ఆఫీసులు, హాస్టల్స్ ఉన్న ప్రాంతాల్లో టిఫిన్ సర్వీసులు, చిన్న రెస్టారెంట్‌లు, టీ, కాఫీ స్టాల్స్ పెట్టుకోవచ్చు. ఇవి చాలా ఆదాయాన్ని తెచ్చిపెడతాయి.
బ్యూటీ పార్లర్ / మెన్స్ సెలూన్
అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం చాలామంది బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. కాబట్టి బ్యూటీ పార్లర్, మెన్స్ సెలూన్ లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సరైన ప్లేస్ లో పెడితే పొరపాటున కూడా ఆదాయం తగ్గదు.
టైలరింగ్
టైలరింగ్ చేసే వారికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మనం ఈ పని ఇంటి దగ్గర చేయచ్చు. ఆన్ లైన్ ద్వారా కూడా ఆర్డర్ లు తీసుకోవచ్చు. లేదా ఏదైనా మంచి సెంటర్ లో షాప్ పెట్టుకోవచ్చు. నిత్యం గిరాకీ ఉండే వ్యాపారాల్లో టైలరింగ్ ముందు వరుసలో ఉంటుంది.
ట్యూషన్ సెంటర్ / కోచింగ్ క్లాసెస్
చదువుకు ఎప్పటికీ అంతం లేదు. మనం నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి స్కూల్ విద్యార్థులకు ట్యూషన్‌లు, పోటీ పరీక్షల కోసం కోచింగ్ క్లాసులు చెప్పవచ్చు. ఇవి కూడా మంచి ఆదాయాన్ని ఇస్తాయి.
కిరాణా షాప్
రోజువారీ అవసరాలు తీర్చే కిరాణా దుకాణాలు ఎప్పుడూ డిమాండ్‌లోనే ఉంటాయి. మనం ఉన్న ప్లేస్ లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వస్తువులను విక్రయిస్తూ.. మంచిగా సంపాదించవచ్చు.
హోం బేకింగ్
హోమ్ మేడ్ కేకులు, పేస్ట్రీలు, బిస్కెట్ల వంటి బేకరీ ప్రొడక్ట్స్ లకు పుట్టిన రోజులు, వేడుకల సమయంలో మంచి డిమాండ్ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా మార్కెటింగ్ చేస్తే.. ఈ వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుంది.
మొబైల్ ఫోన్ సర్వీసింగ్
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటోంది. ఈ కాలంలో ఫోన్ రిపేర్, కవర్లు, టెంపర్డ్ గ్లాస్, ఛార్జర్లు వంటి యాక్సెసరీల అమ్మకానికి కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి అనువైన స్థలం చూసి ఫోన్ సర్వీసింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు.
ఫ్లోవర్ డెకరేషన్ & ఈవెంట్ ప్లానింగ్
ఎంగేజ్మెంట్, పెళ్లిళ్లు, పుట్టినరోజులు లాంటి వేడుకలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. చిన్న స్థాయిలో డెకరేషన్ సేవలతో ప్రారంభించి, అంచెలంచెలుగా ఈవెంట్ ప్లానింగ్‌లోకి వెళ్లవచ్చు. వీటి ద్వారా మంచి ఆదాయం ఉంటుంది.
పేపర్ ప్లేట్స్ / కప్పుల తయారీ
పేపర్ ప్లేట్స్, కప్పుల వినియోగం బాగా పెరిగిపోయింది. ఇవి ఎకో-ఫ్రెండ్లీగా ఉండటం వల్ల ఫంక్షన్లలో, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. చిన్న యంత్రంతో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు.
ఆన్‌లైన్ మార్కెటింగ్ / ఫ్రీలాన్సింగ్ సేవలు
సోషల్ మీడియా హ్యాండ్లింగ్, కంటెంట్ రైటింగ్, వెబ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ వంటి సేవలకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. ఇంటి నుంచి ఈ పనులు చేసుకోవచ్చు. మంచి ఆదాయం ఉంటుంది.