MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • ఈ ఒక్క పండు ధర 24 లక్షలు : ప్రపంచంలో ఖరీదైన 10 పండ్లు ఇవే

ఈ ఒక్క పండు ధర 24 లక్షలు : ప్రపంచంలో ఖరీదైన 10 పండ్లు ఇవే

Top 10 Most Expensive Fruits: లగ్జరీ ఫుడ్ అనగానే మనకు ట‌క్కున గుర్తుకువ‌చ్చేవి హై ఎండ్ రెస్టారెంట్లు అందించే రుచికరమైన వంటకాలు. కానీ, వాటితోనే కాదు బంగారం, వెండితో పోటీ ప‌డుతూ అధిక ధ‌ర‌ను ప‌లికే పండ్లు చాలానే ఉన్నాయి. అలాంటి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్-10 పండ్ల గురించిన వివ‌రాలు మీకోసం.   

3 Min read
Mahesh Rajamoni
Published : Sep 18 2024, 01:15 AM IST | Updated : Sep 18 2024, 07:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Fruits

Fruits

Most Expensive Fruits In The World : ప్ర‌పంచంలోని అత్యంత ఖ‌రీదైన పండ్ల‌లో యుబారి కింగ్ మెలోన్ టాప్ లో ఉంది. 

1. యుబారి కింగ్ మెలోన్

జపాన్ లో ల‌భించే అద్భుత‌మైన పండ్ల‌లో యుబారి కింగ్ మెలోన్ ఒక‌టి. పుచ్చ‌కాయ‌ల క‌నిపించే ఈ పండ్లు ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన‌వి. జపాన్‌లోని హక్కైడో ద్వీపంలో ల‌భించే ఈ పండ్లు ధ‌న‌వంతులు వారి రిచ్ నెస్ ను చూపించ‌డానికి కూడా ఉప‌యోగిస్తారు. 2008లో ఒక జత యుబారి కింగ్ మెలన్స్  ఏకంగా $30,000 (రూ. 24 లక్షలకు పైగా) ధ‌ర ప‌లికింది.

27
Asianet Image

2. రూబీ రోమన్ గ్రేప్స్

ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన పండుగా రూబీ రోమన్ ద్రాక్ష గుర్తింపు పొందింది. యుబారి కింగ్ మెలోన్ లాగా, ఈ అసాధారణమైన ద్రాక్ష కూడా జపాన్ లో ల‌భిస్తుంది. ఈ పండ్ల బరువు, చక్కెర కంటెంట్‌తో సహా కఠినమైన ప్రమాణాల ఆధారంగా వాటిని జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. 2015లో, ఈ ద్రాక్ష గుత్తి $8,400 (రూ. 6 లక్షలకు పైగా) ధర పలికింది.

3. డెన్సుకే పుచ్చకాయ

మూడవ అత్యంత ఖరీదైన పండు కూడా ద్వీప దేశం జపాన్ కు చెందినదే కావడం విశేషం. హక్కైడో ద్వీపంలో కనిపించే డెన్సుకే పుచ్చకాయ టాప్10 ఖరీదైన పండ్లలలో మూడో స్థానంలో ఉంది. ఈ భారీ పుచ్చకాయల బరువు 11 కిలోల వరకు ఉంటుంది. 2008లో ఈ రకం పుచ్చకాయ ఏకంగా  $6,100 (రూ. 5 లక్షలకు పైగా) కు విక్రయించారు.

37
Japanese Miyazaki mango

Japanese Miyazaki mango

4. Taiyo no Tamago Mangoes

Taiyo no Tamago Mangoes ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లలో నాల్గో స్థానంలో ఉన్నాయి. తైయో నో టమాగో, లేదా "ఎగ్ ఆఫ్ ది సన్" మామిడి పండ్లు ఒక ప్రత్యేక రకమైన మామిడి జాతి పండ్లు. వాటి శక్తివంతమైన ఎరుపు రంగు, అధిక చక్కెర కంటెంట్, పెద్దవిగా ఉండటం వాటి ప్రత్యేకత. ప్రత్యేకమైన సాగు పద్ధతులు, కఠినమైన నాణ్యతా నియంత్రణల కారణంగా వీటి ధరలు అధికంగా ఉంటాయి. $3,744 కు ఒకటిగా (రూ.3 లక్షలకు పైగా) విక్రయించారు.

5. హెలిగాన్ పైనాపిల్

ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన పైనాపిల్ గా, ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పండ్లలో ఐదో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ లో లభించే ఈ రకం పైనాపిల్ ఒక్కదాని ధర లక్ష రూపాయలకు పైగా ఉంటుంది. అక్కడ వీటి సాగు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 

47
Asianet Image

6. స్క్వేర్ పుచ్చకాయలు

స్క్వేర్ పుచ్చకాయలు క్యూబ్ ఆకారంలో పెరిగిన పుచ్చకాయలు. సాధారణంగా జపాన్ లో అలంకరణ బహుమతులుగా వీటిని అమ్ముతారు. అవి పూర్తిగా పండకముందే వీటిని కోస్తారు. వీటి ధర 60 వేల రూపాయల వరకు పలకడం విశేషం.

7. సెంబికియా క్వీన్ స్ట్రాబెర్రీస్

సెంబికియా క్వీన్ స్ట్రాబెర్రీస్ కూడా జపాన్ లో లభిస్తాయి. టాప్-10 ఖ‌రీదైన పండ్ల‌లో ఇవి ఏడో స్థానంలో ఉన్నాయి. సెంబికియా క్వీన్ స్ట్రాబెర్రీలను ఉత్పత్తి చేయడానికి శ్రమతో కూడిన సాగు పద్ధతుల కారణంగా ఎక్కువ ధర ఉంటుంది. వీటిలో ఖచ్చితమైన కత్తిరింపు, చేతితో పరాగసంపర్కం, పండ్ల నాణ్యతను పెంచడానికి ఖచ్చితమైన పోషక నిర్వహణ ఉన్నాయి. వీటి ల‌భ్య‌త కూడా ప‌రిమితంగా ఉండ‌టం భారీ డిమాండ్ ను తెచ్చిపెట్టాయి. ఒక్కోటి 7 వేలకు పైగా ధర పలుకుతుంటాయి. 

57
Asianet Image

8. డెకోపాన్ సిట్రస్

జపాన్ లో లభించే అరుదైన సిట్రస్ జాతి పండ్లు. డెకోపాన్ సిట్రస్ దాని అసాధారణమైన తీపి, రసం, విత్తనాలు లేని కారణంగా మార్కెట్లో ప్రీమియం ధరలను పలుకుతాయి. వీటి పరిమిత సాగు విస్తీర్ణం, కాలానుగుణ లభ్యత కారణంగా ఇతర సిట్రస్ రకాలతో పోలిస్తే చాలా అరుదైనది. ఇది సాధారణంగా సంవత్సరంలో ఒక నిర్దిష్ట సమయంలో తక్కువ పరిమాణంలో పండుతాయి. వీటి ధర 6 వేలకు పైగా ఉంటుంది. 

67
Asianet Image

9. సెకై ఇచి ఆపిల్

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లలలో జపాన్ ఆపిల్ / సెకై ఇచి ఆపిల్ టాప్-9 లో ఉన్నాయి. వాటి పెద్ద పరిమాణం తో ప్రతి చెట్టుపై పరిమితంగానే కాస్తాయి. దీంతో దుకాణాల్లో వీటి లభ్యతను పరిమితం చేస్తుంది. ఎరుపు రంగులో ఉంటే ఆపిల్ సాధారణంగా తేలికపాటి-తీపి రుచిని కలిగి ఉంటుంది. ఒక్కోటి రెండు వేల రూపాయల ధరలు పలికిన సందర్భాలు ఉన్నాయి. 

77
Asianet Image

10. Buddha Shaped Pears (బుద్ధ ఆకారపు బేరి)

చైనాలో లభించే బుద్ధ ఆకారపు బేరి పండ్లు కూడా ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటిగా ఉన్నాయి. బుద్ధ ఆకారపు పియర్స్ బుద్ధుని సిల్హౌట్‌ను పోలి ఉండే వాటి ప్రత్యేకమైన ఆకారం కారణంగా ఈ పేరుతో పిలుస్తారు. పండ్లు ఈ రకం ఆకారం వచ్చేలా అచ్చులను ఉపయోగిస్తారు. ప్రత్యేక రుచిని కలిగి ఉంటే వీటి ధరలు కూడా అధికంగా ఉంటాయి. ఒక్కోటి ఏడు వందల రూపాయలకు పైగా పలికిన సందర్భాలు ఉన్నాయి. వీటి లభ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved