వామ్మో.. ఇండియాలో ప్లాస్టిక్ వేస్ట్ అంత భారీగా ఉందా?
ప్లాస్టిక్ వస్తువులను వాడి పాడేస్తున్న మనం.. దాని వల్ల కలిగే నష్టాన్ని ఊహించలేకపోతున్నాం. ఇప్పటికే ప్లాస్టిక్ వేస్ట్ పెద్ద భూతంలా మారిందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ వేస్ట్ ను ప్రొడ్యూస్ చేస్తున్న టాప్ 10 దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య తీవ్రంగా ఉంది. చాలా దేశాలు ఈ వ్యర్థాలను సమర్థవంతంగా రీసైక్లింగ్ చేయలేకపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు నీటినే కాకుండా నేలను, గాలిని కూడా కలుషితం చేస్తూ పర్యావరణానికి తీవ్రమైన సమస్యగా మారాయి. ఇందులో ప్రధానంగా ప్లాస్టిక్ ఉత్పత్తులు ఎక్కువగా వినియోగించే దేశాలు ప్లాస్టిక్ వ్యర్థాలను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి.
ఓ సర్వే ప్రకారం ప్రపంచం మొత్తం మీద ప్లాస్టిక్ వేస్ట్ పెరిగిపోవడానికి కారణం.. మూడింట రెండు వంతుల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించడానికి వీల్లేకుండా ఉన్నాయి. దీని వల్ల ప్లాస్టిక్ పొల్యూషన్ పెరిగిపోతోంది. ఈ లిస్టులో టాప్ లో ఉన్న దేశం ఏంటో తెలుసా? భారత దేశం. నిజమే. మన దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.
9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు... రతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశం మొత్తం మీద 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతున్నాయి. దీనికి పలు ముఖ్య కారణాలు ఉన్నాయి. ప్యాకేజింగ్, బాటిల్స్, ప్లాస్టిక్ బాగ్స్ వంటి ఉత్పత్తులు ఎక్కువగా వాడుతున్నారు. ప్యాకేజింగ్ పరిశ్రమలో ప్లాస్టిక్ అత్యధికంగా ఉపయోగిస్తారు. ఇండియాలో అత్యధిక జనాభా కలిగిన దేశం. అభివఈద్ధి పేరులో ప్రజలు ఎక్కువగా ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా వాడుతున్నారు. దీనికి తోడు రీసైక్లింగ్ సదుపాయాలు సరిగా లేవు. అందువల్ల ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా మట్టి, నీటిలో కలుస్తున్నాయి.
plastic waste
ప్రజలు ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలిగే హానిపై సరైన అవగాహన లేకపోవడం కూడా సమస్య తీవ్రతకు మరో కారణం. ప్రభుత్వాలు కూడా వ్యర్థాల నిర్వహణ సరిగ్గా చేయకపోవడంతో ప్లాస్టిక్ వేస్ట్ పేరుకుపోతోంది.
ఇలా చేస్తే బెటర్...
ప్లాస్టిక్ ను బ్యాన్ చేయాలి. లేదా పరిమితంగా వాడేలా చూడాలి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ బ్యాగ్స్ నిషేధం అమలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నిషేధం కఠినంగా అమలు చేయాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పద్ధతులను మెరుగుపరచాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. రీసైక్లింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి. ప్లాస్టిక్‌కు బదులుగా బయోడిగ్రేడబుల్ లేదా పునర్వినియోగ పదార్థాలను ఉపయోగించడంపై దృష్టి పెట్టాలి. స్కూల్స్, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గించేలా అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు తీసుకురావాలి.
ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉన్న టాప్ టెన్ దేశాలు
ఇండియా
నైజీరియా
ఇండోనేషియా
చైనా
పాకిస్థాన్
బంగ్లాదేశ్
రష్యా
బ్రెజిల్
థాయ్‌లాండ్
కాంగో
ఓ సర్వే ప్రకారం నైజీరియా 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రొడ్యూస్ చేస్తోంది. ఇండోనేషియా నుంచి 3.4 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతున్నాయి. చైనా 2.8 మిలియన్ టన్నులు, పాకిస్థాన్ 2.6 మిలియన్ టన్నులు, బంగ్లాదేశ్ 1.7 మిలియన్ టన్నులు, రష్యా 1.7 మిలియన్ టన్నులు, బ్రెజిల్ 1.4 మిలియన్ టన్నులు, థాయ్ లాండ్ 1 మిలియన్ టన్ను, కాంగో 1 మిలియన్ టన్ను ప్లాస్టిక్ వేస్ట్ ను ఉత్పత్తి చేస్తోంది.