ప్రతి ఒక్కరు వెళ్లొచ్చు; ఈ లగ్జరీ హోటల్ రూం రెంట్ జస్ట్ రూ.30.. బార్, డైనింగ్ కూడా..
భారతదేశంలోని లగ్జరీ హోటళ్ల గురించి మాట్లాడేటప్పుడు తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ పేరును అస్సలు మర్చిపోరు. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌ను రతన్ టాటా తాత అండ్ టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు, ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, జంషెడ్‌జీ టాటా నిర్మించారు.
హోటల్ నిర్మాణ ఖర్చు ఎంత?
ప్రస్తుతం మనం చూస్తున్న తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ నిర్మాణం 1898లో ప్రారంభమై 1903లో పూర్తయింది. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో బస చేయడానికి కనీస ఖర్చు రూ. 22000. 120 ఏళ్ల క్రితం ఈ హోటల్‌ను రూ.4,21,00,000తో నిర్మించారు. తాజ్ మహల్ ప్యాలెస్ ముంబైలో ఫుల్ ఎలెక్ట్రిఫైడ్ ఫస్ట్ హోటల్. అందువల్ల టెలిఫోన్, ఎలక్ట్రిక్ లిఫ్ట్ అండ్ రిఫ్రిజిరేటర్ వంటి సౌకర్యాలు ఉన్న మొదటి భవనం కూడా ఇదే. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో ముంబై మొట్టమొదటి లైసెన్స్ బార్, హార్బర్ బార్ అండ్ భారతదేశంలోని మొదటి అల్ డే డైనింగ్ రెస్టారెంట్ ఉంది.
1903లో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌ను మొదటిసారి ప్రారంభించినప్పుడు, రూం రెంట్ కేవలం 30 రూపాయలు. నేడు, ముంబైలోని తాజ్ హోటల్ ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన హోటల్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. అంతేకాదు, టాటా గ్రూప్‌కు చెందిన తాజ్ హోటల్ చైన్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందింది
శ్వేతజాతీయులు లేదా భారతీయులు అనే తేడా లేకుండా అందరికీ ప్రవేశం కల్పించే విలాసవంతమైన హోటల్‌ను ప్రారంభించాలనే జంషెడ్‌జీ టాటా నిర్ణయం ఈ రోజు మనం చూస్తున్న హోటల్ పుట్టుకకు దారితీసింది. ఆ సమయంలో భారతదేశంలో బ్రిటిష్ పాలనలోనే కాకుండా యూరప్‌లోని హోటళ్లలో కూడా భారతీయులు వివక్షను ఎదుర్కొన్నారు. బ్రిటన్‌లోని వాట్సన్ హోటల్ వంటి పెద్ద హోటళ్లలోకి భారతీయులు ప్రవేశించకుండా నిషేధించారు.
ఇలా చేయడం భారతీయులను అవమానించడమేనని భావించిన టాటా.. భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఆంక్షలు లేకుండా ఉండేలా హోటల్ నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పుడు తాజ్ మహల్ ప్యాలెస్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచానికి కూడా కేంద్రంగా ఉంది.
చరిత్రలోకి వెళితే, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 600 పడకల ఆసుపత్రిగా మార్చబడింది. 2008లో కూడా ఈ హోటల్ తీవ్రవాద దాడికి గురైంది.