MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Gold Rate: పసిడి ప్రియులకు పండగే బంగారం తులం ఏకంగా రూ. 55 వేలకు పడిపోయే చాన్స్..కారణాలు ఇవే..

Gold Rate: పసిడి ప్రియులకు పండగే బంగారం తులం ఏకంగా రూ. 55 వేలకు పడిపోయే చాన్స్..కారణాలు ఇవే..

బంగారం కొంటున్నారా అయితే ఇది మీకు నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాలి త్వరలోనే బంగారం ధర భారీగా పతనం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధర ఇప్పటికే గడచిన నెల రోజుల్లో 90 డాలర్లు తగ్గింది. ఈ నేపథ్యంలో దేశీయంగా కూడా బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. అతి త్వరలోనే బంగారం ధర మళ్లీ 55 వేల రూపాయల దిగువకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

2 Min read
Author : Krishna Adhitya
Published : Jun 10 2023, 01:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బంగారం కొంటున్నారా అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే బంగారం ధర భారీగా పతనం అయ్యే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపిస్తోంది.  ప్రస్తుతం బంగారం ధర విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర శుక్రవారం రూ.420 తగ్గి 10 గ్రాములకు రూ.60,380కి చేరుకుంది. గురువారం 10 గ్రాముల పసిడి ధర రూ.60,800 వద్ద ముగిసింది. అయితే, అందుకు విరుద్ధంగా వెండి ధర పెరిగింది. కిలో వెండి ధర రూ.500 పెరిగి రూ.73,300కి చేరుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు (31 గ్రాములు) బంగారం ధర 1,945 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  వెండి ధర 23.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరింత కఠినతరం చేస్తుందన్న అంచనాలతో యుఎస్ బాండ్ రాబడి పెరగుతుందనే వార్తలు బంగారం ధరలపై ఒత్తిడి తెచ్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

36

మే నెలలో బంగారం ధర అంతర్జాతీయంగా గమనించినట్లయితే అత్యధిక స్థాయిలో ఉంది.  మే 10వ తేదీన బంగారం ధర అంతర్జాతీయంగా గరిష్టంగా 2030 డాలర్ల స్థాయిని దాటింది.  అక్కడి నుంచి సరిగ్గా నెల రోజుల తర్వాత మనం గమనించినట్లయితే 90 డాలర్లు తగ్గి ప్రస్తుతం 1940 డాలర్ల వద్ద బంగారం ధర ట్రేడ్ అవుతోంది.  ఈ నేపథ్యంలో మన దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 
 

46

ముఖ్యంగా గమనించినట్లయితే అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడానికి అమెరికాలో తలెత్తినటువంటి రుణ సంక్షోభం పరిష్కారం అవటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.  గత నెల 31వ తేదీన అమెరికాలోని కాంగ్రెస్ సభ బైడెన్ ప్రభుత్వం, రుణ పరిమితిని పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది ఈ నేపథ్యంలో అమెరికన్  ఆర్థిక పరిస్థితి దివాలా తీయకుండా బయటపడింది.  దీంతో అమెరికా జారీ చేసిన బాండ్స్ కు  మళ్లీ డిమాండ్ పెరిగింది అలాగే స్టాక్ మార్కెట్ కూడా పొందుతుంది దీంతో బంగారం పై పెట్టుబడి పెట్టిన వారంతా మళ్లీ యూఎస్ బాండ్స్  లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. 
 

56

అమెరికా ఫెడరల్ రిజర్వ్ సైతం వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో  బంగారంపై పెట్టుబడి పెట్టే వారి ఆసక్తి తగ్గుతోంది.  దీంతో పాటు డాలర్ కూడా పుంజుకుంటుంది ఈ ప్రభావం కూడా బంగారంపై స్పష్టంగా కనిపిస్తోంది.
 

66

 ఈ నేపథ్యంలో దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం  స్పాట్ మార్కెట్లో బంగారం ధర 24 క్యారెట్ల  10 గ్రాముల ధర 60 వేల పైన ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్న దృష్ట్యా త్వరలోనే బంగారం ధర 60 వేల దిగువకు వచ్చే అవకాశం ఉంది.  ట్రెండు ఇలాగే కొనసాగితే బంగారం ధర మళ్ళీ 55 వేల రూపాయలకు దిగివచ్చే అవకాశం కనిపిస్తోంది. 

About the Author

KA
Krishna Adhitya
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పండుగ రోజే బంగారం షాక్.. ఒక్కరోజులో రూ.1,210 పెరుగుదల
Recommended image2
Bank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అక్టోబ‌ర్ 1 నుంచి మ‌నీ విత్‌డ్రాపై ఛార్జీలు
Recommended image3
Gold Price Hike: ట్రంప్ నిర్ణయంతో దూసుకెళ్లిన పసిడి.. ఈ వరలక్ష్మీ వ్రతానికి బంగారం కష్టమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved