Best SUV cars: ఈ SUV కార్ ఎంతోమందికి హాట్ ఫేవరేట్.. అందుకే తెగ కొనేశారు
సెప్టెంబర్లోనే కార్ల ధరలు తగ్గాయి. అవి ఎస్‌యూవీ కార్లపై కూడా ప్రభావాన్ని చూపాయి. అందుకే ఎంతోమంది సెప్టెంబర్లో అధికంగా కార్లను (Best SUV cars) కొనుగోలు చేశారు. అయితే ఎస్ యువి మార్కెట్లో చూస్తే టాటా నెక్సన్ కారు అధికంగా అమ్ముడుపోయింది.

బెస్ట్ ఎస్‌యూవీ కార్లు
జీఎస్టీ ప్రభావం వల్ల కార్ల ధరలన్నీ లక్ష రూపాయలు వరకు తగ్గాయి. సాధారణ కార్లతో పాటు ఎస్‌యూవీ మార్కెట్ పై కూడా ఇది మంచి ప్రభావాన్ని చూపించింది. సెప్టెంబర్ నెలలో ఎస్‌యూవీలను కొన్న వారి సంఖ్య అధికంగా ఉంది. అయితే మన దేశంలోనే ఎస్‌యూవీలలో అత్యధికంగా సెప్టెంబర్లో అమ్ముడుపోయిన కారు టాటా నెక్సన్. ఈ కారును ఎక్కువమంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. అందుకే టాటా నెక్సన్ కారు విపరీతంగా అమ్ముడుపోయింది. దీని ఫీచర్లు, లుక్ కూడా చాలా రాయల్ గా ఉంటుంది. అందుకే ఇది ఎంతో మంది హాట్ ఫేవరెట్ గా మారిపోయింది.
టాటా నెక్సన్
టాటా నెక్సన్ తర్వాత హ్యుండై క్రెటా ఎక్కువగా అమ్ముడైన ఎస్‌యూవీ మోడల్ మీకు తర్వాత స్థానాల్లో మహీంద్ర స్కార్పియో, టాటా పంచ్, హ్యుండయ్ వెన్యూ వంటి ఎస్‌యూవీ ఉన్నాయి. టాటా నెక్సన్ సెప్టెంబర్లో ఏకంగా 22,573 యూనిట్లు అమ్ముడుపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ అమ్మకాలు 97 శాతం పెరిగినట్టు అంచనా వేస్తున్నారు.
హ్యుండయ్ క్రెటా
ఇక హ్యుండయ్ క్రెటా విషయానికి వస్తే సెప్టెంబర్ లో 18,861 కార్లు అమ్ముడుపోయాయి. ఇక గత సంవత్సరంతో పోలిస్తే క్రెటా అమ్మకాలు 19 శాతం వృద్ధిని సూచించాయి.
మహీంద్ర స్కార్పియో
మహీంద్ర స్కార్పియో సిరీస్ కు మంచి ప్రజాదరణ దొరుకుతూనే ఉంది. సెప్టెంబర్ లో 18,371 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 27 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
టాటా పంచ్
ఇక మైక్రో ఎస్‌యువీగా పేరు తెచ్చుకున్న టాటా పంచ్ కు కూడా డిమాండ్ పెరిగింది. సెప్టెంబర్లో 16 శాతం అధికంగా కార్లు అమ్ముడయ్యాయి. ఆ ఒక్క నెలలోనే 15,891 యూనిట్లు అమ్ముడుపోయాయి.