- Home
- Business
- మహిళలకు గుడ్ న్యూస్, డోనాల్డ్ ట్రంప్ వల్ల మన దేశంలో బంగారం ధర తగ్గబోతోంది.. ఎంతో తెలుసా?
మహిళలకు గుడ్ న్యూస్, డోనాల్డ్ ట్రంప్ వల్ల మన దేశంలో బంగారం ధర తగ్గబోతోంది.. ఎంతో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వల్ల మనదేశంలో బంగారు ధరలు తగ్గబోతున్నాయి. ట్రంప్ సుంకాలు పెంచుతానని చెప్పగానే బంగారం ధర పెరగడం మొదలైంది. కానీ ఇప్పుడు అదే ట్రంప్ వల్ల బంగారం ధర తగ్గుతోంది.

డోనాల్డ్ ట్రంప్ వల్ల తక్కువ ధరకే బంగారం
మన దేశంలో బంగారానికి ఎంతో విలువ ఉంది. మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో.. ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశ పై 50 శాతం సుంకాలు వేస్తామని చెప్పగానే బంగారు ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి. దీంతో భవిష్యత్తులో బంగారాన్ని కొనడం కష్టమేనని భావించారు ఎంతోమంది. కానీ ఇప్పుడు అదే ట్రంప్ వల్ల బంగారం ధరలు తగ్గడం ప్రారంభమయ్యాయి.
సుంకాల ఎఫెక్ట్
సుంకాలతో ఇతర దేశాలను భయపెట్టాలని డోనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే రష్యా భారత్ ల మధ్య స్నేహాన్ని చిదిమెందుకు భారత్ పై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు చెప్పాడు. దీనివల్ల బంగారంపై ధరలు పెరిగిపోవడం మొదలయ్యాయి. ఇప్పుడు అదే ట్రంప్ ఈ సుంకాలు బంగారంపై ఉండవని ప్రకటించాడు. ఆదివారం ఆయన ఈ ప్రకటన చేసిన తర్వాత బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. బంగారం పై సుంకం ఉండదని డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. దీంతో భారత దేశంలో బంగారం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది.
బంగారం ధరల్లో తగ్గుదల
ట్రంప్ బంగారంపై సుంకం ప్రభావం ఉండదని చెప్పడంతో ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రెండు రోజుల్లోనే 1900 రూపాయల కంటే ఎక్కువ తగ్గింది. ఇక వెండి ధర రూ.3,000 కంటే ఎక్కువ తగ్గింది. భారతదేశం, అమెరికా మధ్య రాజకీయ ఉద్రిక్తత వల్ల సుంకాల చర్చల వల్ల బంగారం పెరుగుతుందని అనుకున్నారు. అయితే ట్రంప్ బంగారాన్ని సుంకాల నుంచి మినహాయించడంతో తిరిగి దాని ధర తగ్గడం మొదలైంది. అదే సమయంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును కూడా తగ్గిస్తుందని దీనివల్ల మరింతగా బంగారం ధర తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
ధర ఎంత వరకు తగ్గాయి?
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ప్రకారం బంగారం,వెండి ధరలను ఒకసారి పరిశీలిద్దాం.ఆగస్టు 8న24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,01,400గా ఉంది. అది ఆగస్టు 11న 10 గ్రాముల ద్వారా రూ.1,00,201 కు పడిపోయింది. ఇక ఆగస్టు 12న 10 గ్రాముల ధర రూ.99,549కి వచ్చింది. ఇక వెండి ధర కూడా లక్ష 15వేల నుంచి లక్షా పదమూడు వేల రూపాయలకు పడిపోయింది.
బంగారం ధర ఇక పెరగవా?
మార్కెట్ నిపుణులు చెబుతున్న ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశాలు లేవు. బంగారం దిగుమతి పై కూడా సుంకాలు ఉండవని డోనాల్డ్ ట్రంప్ స్పష్టంగా చెప్పారు. కాబట్టి బంగారం ధర తగ్గడమే గాని ఈ మధ్యలో పెరిగే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి బంగారంపై ఎలాంటి ప్రభావము పడదు. కాబట్టి మీ పెట్టుబడులు బంగారంపై పెట్టుకోవడం ఉత్తమం అని మార్కెట్ నిపుణులు వివరిస్తున్నారు. భవిష్యత్తులో బంగారు కోసం డిమాండ్ పెరిగే అవకాశాలు అధికంగానే ఉన్నాయి.