ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ షర్ట్,.. ఉతకడం ఈజీ, కానీ దీని ధర ఎంతో తెలుసా..?
సాధారణంగా ఒక చొక్కా ధర రూ.100 నుండి మొదలుకొని రూ. 500 వరకు ఉంటుంది. బ్రాడెండ్ క్లాత్ షర్ట్ అయితే ఐదు-పది వేల వరకు ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చొక్కా. బంగారంతో చేసిన ఈ షర్ట్ ధర ఎంతో తెలుసా?
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అండ్ రాజకీయ నాయకుడు పంకజ్ పరాఖ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చొక్కా కలిగి ఉన్నాడు. పంకజ్ 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడంతో వార్తల్లో నిలిచాడు.
రూ.98,35,099 ధరతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు చొక్కా సొంతం చేసుకోవడం ద్వారా అతను ఈ ఘనత సాధించాడు. అతని స్నేహితులు అతనిని ఆప్యాయంగా 'ది మ్యాన్ విత్ ది గోల్డెన్ షర్ట్' అని పిలుస్తారు.
పరాఖ్ దగ్గర చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. అందులో ఈ బంగారు చొక్కా కూడా ఒకటి. 4.10 కేజీల బంగారు చొక్కా ధర ఇప్పుడు రూ.1.30 కోట్లు.
పరాఖ్ దగ్గ్గర ఇంకా బంగారు గడియారం, అనేక బంగారు గొలుసులు, పెద్ద బంగారు ఉంగరాలు, బంగారు మొబైల్ కవర్ అండ్ బంగారు ఫ్రేమ్డ్ గ్లాసెస్ ఉన్నాయి. 10 కిలోల బంగారు దుస్తులు, లైసెన్స్ రివాల్వర్‌తో అతని నడక అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఖరీదైన వస్తువులన్నింటినీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు సురక్షితంగా చూసుకుంటారు.
ఈ ఖరీదైన షర్ట్‌ను నాసిక్‌లోని బఫ్నా జ్యువెలర్స్ డిజిఎం చేసింది. ముంబైలోని శాంతి జ్యువెలర్స్ తయారు చేసింది. ఎంపిక చేసుకున్న 20 మంది కళాకారుల బృందం ఈ ఖరీదైన చొక్కాను రూపొందించడానికి రెండు నెలల పాటు 3,200 గంటలు వెచ్చించింది. ఈ చొక్కా కొనుగోలుకు ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి పూర్తిగా బిల్లు చేయబడుతుంది.
47 ఏళ్ల పరాఖ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చొక్కా సొంతం చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేసారు. 'నాది మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం. నేను సాధించిన ఈ విజయం నా పేరును ప్రపంచానికి తెచ్చింది. ఇది నాకు చాలా సంతోషాన్నిచ్చింది.' అని అన్నారు.
యోలా(Yeola)లో కుటుంబ వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించేందుకు పరాఖ్ 8వ తరగతి తర్వాత పాఠశాలను విడిచిపెట్టాడు. కొన్నేళ్లుగా, అతను స్వతంత్రంగా వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారంలో విజయం ఆయనను రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. తరువాత సంవత్సరాలలో అతను ముంబైకి 260 కి.మీ దూరంలో ఉన్న యోలా పట్టణంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ అయ్యాడు.
గోల్డెన్ ఎక్స్టీరియర్ ఉన్నప్పటికీ చొక్కా కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ షార్ట్ ని కూడా కడగవచ్చు. అతనికి గొప్ప లైఫ్ స్టయిల్ ఉన్నప్పటికీ కూడా ఉదార మనస్సు కలిగి ఉంటాడు. అనేక దాతృత్వ కార్యక్రమాలలో పాలుపంచుకుంటాడు.