Telangana GST: తెలంగాణ జీఎస్టీ ఆదాయం ఎంత..? దేశంలోని టాప్ 10 జీఎస్టీ ఆదాయం పొందే రాష్ట్రాలు ఇవే..?
కేంద్ర ఆర్థిక శాఖ అందించిన డేటా ప్రకారం, ఆగస్టు 2023లో దేశ జీఎస్టీ ఆదాయం రూ.1.59 లక్షల కోట్లుగా ఉంది. ఆగస్టు 2023 నాటికి దేశంలో గరిష్టంగా GST రాబడి ఉన్న టాప్ 10 రాష్ట్రాల జాబితా గురించి తెలుసుకుందాం.
తెలంగాణ: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలకు నిలయం అయిన హైదరాబాద్ మహానగరం కారణంగా, తెలంగాణకు భారీగా ఆదాయం లభిస్తోంది. అంతేకాదు భవిష్యత్తులో ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా, సాఫ్ట్ వేర్ కంపెనీలకు కూడా తెలంగాణ నిలయం కానుంది. ఆగస్టు 2023లో తెలంగాణ GST ఆదాయం రూ.4303 కోట్లుగా ఉంది.
ఒడిశా: దేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రమైన ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్. సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న ఒడిశా ఆగస్టు నెలలో జిఎస్‌టి ఆదాయంగా రూ.4408 కోట్లు అందించింది.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జీఎస్టీ ఆదాయం రూ.4620 కోట్లుగా ఉంది. జనాభా పరంగా టోక్యో తర్వాత ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా ఢిల్లీ పేరు పొందింది. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కార్పోరేట్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఢిల్లీ కేంద్రంగా ఉన్నాయి. తద్వారా ఢిల్లీకి భారీగా ఆదాయం లభిస్తోంది.
పశ్చిమ బెంగాల్: రాజకీయంగా దేశంలో అత్యంత ముఖ్యమైన రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ దేశంలో 13వ అతిపెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రం నుంచి ఆగస్టులో జీఎస్టీ ఆదాయం రూ.4620 కోట్లుగా ఉంది.
ఉత్తరప్రదేశ్: దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తన జీఎస్టీ ఆదాయాన్ని నెమ్మదిగా పెంచుతోంది. ఆగస్టులో ఉత్తరప్రదేశ్ జీఎస్టీ ఆదాయం రూ.7468 కోట్లుగా ఉంది.
హర్యానా: ఢిల్లీ పొరుగు రాష్ట్రమైన హర్యానాకు చండీగఢ్, ఫరీదాబాద్ ప్రధాన ఆదాయ వనరులు. అలాగే గురుగ్రామ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు స్వర్గధామంగా ఉంది. ఆగస్టులో హర్యానా జీఎస్టీ ఆదాయం రూ.7666 కోట్లుగా ఉంది.
తమిళనాడు: డీఎంకే పాలిత తమిళనాడు కూడా భారీగా జీఎస్టీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. రాజధాని చెన్నై పెద్ద ఎత్తున సహాయం చేస్తోంది. తమిళనాడు ఆగస్టులో జీఎస్టీ ఆదాయానికి రూ.9475 కోట్లు అందించింది.
గుజరాత్: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం. అత్యధిక జీఎస్టీ ఆదాయాన్ని ఆర్జించే రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో ఉన్న గుజరాత్ ఆగస్టులో రూ.9765 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
కర్నాటక: అత్యధిక జీఎస్టీని ఆర్జించే రాష్ట్రాల జాబితాలో కర్ణాటక 2వ స్థానంలో ఉంది. ఐటీ సిటీ బెంగళూరును రాజధానిగా కలిగి ఉన్న కర్ణాటక ఆగస్టులో రూ.11,116 కోట్ల జీఎస్టీ ఆదాయాన్ని ఆర్జించింది.
మహారాష్ట్ర: ఊహించినట్లుగానే, దేశంలోని వాణిజ్య నగరమైన ముంబైకి నిలయమైన మహారాష్ట్ర, దేశ GSTకి పెద్ద మొత్తంలో సహకరించింది. 23,282 కోట్ల రూపాయల జీఎస్టీ ఆదాయం.