- Home
- Business
- స్విగ్గీ- జొమాటో ఫుడ్ డెలివరీలపై షాకింగ్ న్యూస్.. కస్టమర్‌లపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే.. ?
స్విగ్గీ- జొమాటో ఫుడ్ డెలివరీలపై షాకింగ్ న్యూస్.. కస్టమర్‌లపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే.. ?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 17 సెప్టెంబర్ 2021న జరిగిన 45వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కీలకమైన నిర్ణయాలను వెల్లడించారు. ఈ నిర్ణయాలలో ఒకటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌కి సంబంధించింది.

జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లు కస్టమర్ల నుండి ఆర్డర్లు తీసుకునే రెస్టారెంట్లకు బదులుగా ఐదు శాతం జిఎస్‌టి లేదా వస్తువులు, సేవల పన్నును వసూలు చేస్తాయని నిర్మలా సీతారామన్ శుక్రవారం సాయంత్రం లక్నోలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం తర్వాత వెల్లడించారు.
ఇప్పుడు మీరు జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల నుండి తినదగినవి ఆర్డర్ చేయడం మరింత ఖరీదైనదిగా మారనున్నాయి.
ఏ తేదీ నుండి ఎంత పన్ను వసూలు చేయబడుతుంది?
జిఎస్‌టి సమావేశంలో జొమాటో, స్విగ్గీ ఇతర ఫుడ్ డెలివరీ యాప్‌ల సేవలపై 1 జనవరి 2022 నుండి 5% జిఎస్‌టి వసూలు చేయాలని నిర్ణయించారు. వస్తువులు, సేవల పన్ను కౌన్సిల్ సమావేశం తరువాత ఆర్థిక మంత్రి నిర్మల మాట్లాడుతూ, 'కస్టమర్ల నుండి ఆర్డర్లు తీసుకొనే రెస్టారెంట్లు వాటిని డెలివరీ చేసే స్విగ్గీ, జోమాటో వంటి ఫుడ్ డెలివరీ ఆపరేటర్లు ఇప్పుడు ఫుడ్ డెలివరీ పొందే వారి నుండి పన్ను వసూలు చేస్తారు.' అని తెలిపారు.
కస్టమర్ల పై ఎలాంటి ప్రభావం ?
జీఎస్టీ సమావేశం తర్వాత విలేకరులతో రెవెన్యూ కార్యదర్శి సచిన్ తరుణ్ బజాజ్ మాట్లాడుతూ ఈ నిర్ణయం కస్టమర్లను ప్రభావితం చేయదని, ఎందుకంటే వారి నుండి అదనపు పన్ను వసూలు చేయదు అలాగే కొత్త పన్ను కూడా ప్రకటించలేదు. ఇంతకు ముందు రెస్టారెంట్ ద్వారా పన్ను చెల్లించేవారు, ఇప్పుడు రెస్టారెంట్‌కు బదులుగా ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ద్వారా పన్ను చెల్లించబడుతుంది. అంటే జిఎస్‌టి కలెక్షన్ పాయింట్ కేవలం బదిలీ చేయబడుతోందని స్పష్టం చేశారు.
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో, స్విగ్గీ వంటి మొదలైన వాటిపై అదనపు పన్ను విధించే ప్రశ్నే లేదని ఆర్థిక మంత్రి చెప్పారు. రెస్టారెంట్ వ్యాపారంపై విధించే పన్నును ఈ యాప్‌లు వసూలు చేస్తాయి. ఈ సర్వీస్ నుండి పొందిన పన్నులను ప్రభుత్వం సరిగ్గా స్వీకరించేలా నిబంధనలు రూపొందించినట్లు ఆయన చెప్పారు.
"ఉదాహరణకు మీరు ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేశారని అనుకుందాం ... ఇప్పుడు రెస్టారెంట్లు వాటికి పన్నులు చెల్లిస్తోంది. కానీ కొన్ని రెస్టారెంట్లు చెల్లించట్లేదని మేము కనుగొన్నాము. ఇప్పుడు రెస్టారెంట్లు చేసేదానికి బదులుగా మీరు ఫూడ్ ఆర్డర్ చేస్తే ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో లేదా స్విగ్గీ కన్జ్యూమర్ నుండి సేకరించి అధికారులకు చెల్లిస్తారు " అని అన్నారు.
జిఎస్‌టి ప్యానెల్ ఏం సూచించింది ?
2019-20 నుండి 2020-21లో రూ.2వేల కోట్ల జిఎస్‌టి లోటును అంచనా వేసిన ఫిట్‌మెంట్ ప్యానెల్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్స్ ని ఈ-కామర్స్ ఆపరేటర్లుగా వర్గీకరించాలని, సంబంధిత రెస్టారెంట్ల తరపున జిఎస్‌టి చెల్లించాలని సిఫార్సు చేసింది. చాలా రెస్టారెంట్లు జీఎస్‌టీని చెల్లించడం లేదు, కొన్ని రిజిస్టర్ చేయలేదు. ఈ మార్పు 1 జనవరి 2022 నుండి అమలులోకి వస్తుందని రేటు ఫిట్‌మెంట్ ప్యానెల్ సూచించింది.
జిఎస్‌టి కౌన్సిల్ శుక్రవారం ప్రకటించిన ఇతర ముఖ్యమైన నిర్ణయాలలో పెట్రోల్, డీజిల్‌ను జిఎస్‌టి పాలనలోకి తీసుకురావడం లేదని తెలిపింది.
ఇటీవల కేరళ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిఎస్‌టి కౌన్సిల్ దీనిపై చర్చించిందని, "పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడానికి ఇది సరైన సమయం కాదని" సీతారామన్ అన్నారు.
జిఎస్‌టి కౌన్సిల్ కూడా కోవిడ్ -19 చికిత్సలో ఉపయోగించే ఔషధాలపై రాయితీ జిఎస్‌టి రేట్లను డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కండరాల క్షీణత చికిత్సలో ఉపయోగించే మందులతో సహా కొన్ని ఇతర ఔషధాలను కూడా మినహాయించింది. క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే ఔషధాలపై కూడా జిఎస్‌టి తగ్గించింది.