ట్రావెల్ ఏజెంట్ నుంచి ఎయిర్ లైన్స్ యజమాని వరకూ సాగిన జెట్ ఎయిర్ వేస్ అధినేత నరేష్ గోయల్ కథ తెలుసుకోండి..?
దేశంలోనే విమానయాన రంగంలో ఒక సంచలనంగా నిలిచిన నరేష్ గోయల్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఒకప్పుడు 100 విమానాలతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థగా ఉన్న జెట్ ఎయిర్ వైస్ ప్రస్తుతం దివాలా తీసి అటకెక్కింది. దేశంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా ప్రయాణం ప్రారంభించిన నరేష్ గోయల్ ప్రస్తుతం పాతాళానికి పడిపోయారు. ఆయన జీవితంలోని వ్యాపారంలోని ఉత్థాన పతనాలను తెలుసుకుందాం.
Naresh Goyal
90వ దశకం ప్రారంభంలో ఎయిర్ టికెటింగ్ ఏజెంట్‌గా పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత ఒక ఎయిర్ లైన్స్ యజమానిగా మారిన సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన మరెవరో కాదు జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్. భారతదేశంలో ఒకప్పుడు కేవలం ప్రభుత్వ విమానయాన సర్వీసు ఇండియన్ ఎయిర్లైన్స్ మాత్రమే ఉన్న రోజులవి. ఆ సమయంలోనే విమానయాన రంగంలోకి ప్రవేశించి 'ది జాయ్ ఆఫ్ ఫ్లయింగ్' అనే ట్యాగ్ లైన్‌తో నరేష్ గోయల్ జెట్ ఎయిర్‌వేస్‌ను ప్రారంభించగా, జెట్ ఎయిర్‌వేస్‌లో ఒకప్పుడు 100 కంటే ఎక్కువ విమానాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం కంపెనీ మూసివేసే సమయానికి కేవలం 16 విమానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కంపెనీ నష్టం రూ.5535.75 కోట్లకు చేరుకుంది.
తాజాగా మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంకులో రూ.538 కోట్ల మోసానికి సంబంధించిన కేసు. నరేష్ గోయల్‌ను ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈరోజు హాజరుపరచవచ్చు. జూలై 19న కూడా గోయల్ నివాసంపై ఈడీ దాడులు చేసింది.
సరిగ్గా 30 ఏళ్ల క్రితం అంటే 1993లో నరేష్ గోయల్ ట్రావెల్ ఏజెన్సీని నడిపేవారు. అతను విమానయాన పరిశ్రమలోకి ప్రవేశించిన సమయంలో, అతను కేవలం రెండు బోయింగ్ 737 విమానాలను మాత్రమే కలిగి ఉన్నాడు. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌ను నరేష్ గోయల్ ప్రారంభించారు. జెట్ ఎయిర్‌వేస్ త్వరలో తనదైన ముద్ర వేసింది.
జెట్ ఎయిర్‌వేస్ సంస్థ 13 సంవత్సరాల మైలురాయి చేరుకున్నప్పుడు. 2006లో నరేష్ జెట్ ఎయిర్‌వేస్ సహారా ఎయిర్‌లైన్స్‌ను సుమారు రూ. 2,250 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో ఇదే అతిపెద్ద విమానయాన ఒప్పందం. ఈ భారీ డీల్ తర్వాత జెట్ ఎయిర్‌వేస్ పతనం మొదలైంది. కంపెనీ బ్యాంకు నుంచి భారీ రుణం తీసుకుంది.
కాగా కంపెనీ అప్పులు నష్టాల నుండి బయటపడేందుకు జెట్ ఎయిర్‌వేస్ ఒక ఆపన్న హస్తం కోసం వెతికింది. ఇంతలో, విమానయాన సంస్థ ఎతిహాద్ జెట్ ఎయిర్‌వేస్‌లో 24 శాతం వాటాలను కొనుగోలు చేసింది, అయితే ఒప్పందం కూడా పనిచేయలేదు. రుణ భారం. నష్టాల పరిధి ఎంతగా పెరిగిందంటే ఎయిర్‌లైన్స్ కంపెనీ తన విమానాలను 17 ఏప్రిల్ 2019న గ్రౌండింగ్ చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం, జలాన్-కల్రాక్ కన్సార్టియం గ్రూప్ (JKC) దివాలా ప్రక్రియ కింద జెట్ ఎయిర్‌లైన్‌పై యాజమాన్య హక్కులను పొందింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) దివాలా పరిష్కార ప్రక్రియ కింద బిడ్డింగ్ ద్వారా JKC జూన్ 2021లో యాజమాన్యాన్ని పొందింది. కానీ కొన్ని కారణంగా విమానయాన సంస్థ ఇంకా తన కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ప్రారంభించలేకపోతోంది.