MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రోజూ రూ.100 పొదుపు చేస్తే రూ.కోట్లు ఎలా అవుతాయో తెలుసా?

రోజూ రూ.100 పొదుపు చేస్తే రూ.కోట్లు ఎలా అవుతాయో తెలుసా?

సంపాదించిన దాంట్లో కనీసం 20 శాతం పొదుపు చేస్తే ఫ్యూచర్ లో ఎన్నో అవసరాలు తీరుతాయని ఆర్థిక శాస్త్ర నిపుణుడు చాణిక్యుడు చెబుతారు. కాని ఈ రోజుల్లో అంత సేవ్ చేయడం కూడా కష్టమే కదా.. అయితే మీరు రోజు రూ. 100 పొదుపు చేసి మ్యూచువల్ ఫండ్స్ SIPలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందవచ్చు. కొన్నేళ్లకి అవి రూ.కోట్లుగా మారతాయి. అదెలాగో ఇక్కడ చూద్దాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Dec 01 2024, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డబ్బులు దాచుకోవడానికి అనేక మార్గాలుంటాయి. అయితే సేవింగ్స్ లోనూ వడ్డీ పొందాలంటే కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిలో సరైన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ప్రతి నెల కొంత అమౌంట్ దాచుకోవాలంటే SIP (Systematic Investment Plan) ఒక మంచి మార్గం.

SIP అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెల పెట్టుబడి పెట్టే విధానం. ఇది ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులను క్రమపద్ధతిలో సమీకరించడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని వడ్డీ రూపంలో పొందే అవకాశం ఇస్తుంది. SIPలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మార్కెట్ హెచ్చుతగ్గులపై ప్రభావం లేకుండా స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. లాంగ్ టర్మ్ లో SIP నుంచి ఎక్కువ రాబడి వస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మీ పెట్టుబడిని దీర్ఘకాలంలో పెంచుకోవాలనుకుంటున్నారా? SIP అనే క్రమ పెట్టుబడి పథకంలో రోజు రూ.100 కంటే తక్కువ పొదుపు చేసి కోట్లు సంపాదించొచ్చు. ఉద్యోగి అయినా, వ్యాపారస్తుడైనా SIP పెట్టుబడి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాదినిస్తుంది. ఇప్పుడు రోజూ రూ.100 చొప్పున సేవ్ చేస్తే ఎన్ని సంవత్సరాల్లో ఎంత డబ్బు వస్తుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

35

రోజు రూ. 100: ఈ కాలంలో SIP చక్కని పెట్టుబడి మార్గం. రోజు రూ. 100 పొదుపు చేసి మ్యూచువల్ ఫండ్స్ SIPలో పెడితే 10, 20, 30, 40 ఏళ్లలో ఎంత రాబడి వస్తుందో SIP కాలిక్యులేటర్ తో లెక్కించవచ్చు.

10 ఏళ్ల SIP: రోజు రూ. 100 పొదుపు చేస్తే నెలకు రూ. 3000 SIP అవుతుంది. సంవత్సరానికి పెట్టుబడి రూ. 3,60,000 అవుతుంది. ఇది 12 % రాబడి వస్తే 10 ఏళ్లలో రూ. 6,97,017 అవుతుంది. అంటే లాభం రూ. 3,37,017 అన్న మాట. 

45

20 ఏళ్ల SIP: రోజు రూ. 100 పొదుపు చేసి 20 ఏళ్ల పాటు SIP లో పెట్టుబడి పెడితే 20 ఏళ్లకి మొత్తం పెట్టుబడి రూ. 7,20,000 అవుతుంది. 12 % రాబడితో మీరు మొత్తం రూ. 29,97,444 నిధిని సమకూర్చుకోవచ్చు. అంటే లాభం రూ. 22,77,444.

30 ఏళ్ల SIP: 30 ఏళ్లు రోజు రూ. 100 పొదుపుతో SIP చేస్తే మొత్తం పెట్టుబడి రూ. 10,80,000 అవుతుంది. 30 ఏళ్ల తర్వాత రూ.1,05,89,741 నిధిని సమకూర్చుకోవచ్చు. అంటే లాభం రూ. 95,09,741 అన్నమాట. అంటే 30 ఏళ్లకి మీరు కోటీశ్వరుడు అయిపోతారు. 

55

40 ఏళ్ల SIP: 40 ఏళ్లు రోజు రూ.100 పొదుపుతో SIP చేస్తే రూ.14,40,000 పెట్టుబడి అవుతుంది. దీనికి మీరు రూ. 3,56,47,261 రిటర్న్స్ పొందుతారు. లాభం రూ. 2,12,47,261.

మీరు గాని 20 ఏళ్ల వయసులో రూ. 3000 నెలవారీ SIP మొదలుపెడితే 60 ఏళ్లకు రూ. 3.5 కోట్లు మీ సొంతం. SIP దీర్ఘకాలంలో మంచి రాబడి ఇస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్ కి లోబడి ఉంటాయి. కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image3
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved