ఆర్బిఐ నూతన గవర్నర్ గా ఐఐటీ ఐఏఎస్ ... ఎవరీ సంజయ్ మల్హోత్రా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్ గా ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఆయన గురించి ఆసక్తికర విషయాలు...
Sanjay Malhotra
RBI Governor : భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన రిజర్వ్ బ్యాంక్ కు నూతన గవర్నర్ నియమించారు. ప్రస్తుత ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలం రేపటితో అంటే డిసెంబర్ 10, 2024 తో ముగుస్తుంది. దీంతో ప్రస్తుతం ఆర్థిక శాఖలో రెవెన్యూ సెక్రటరీగా కొనసాగుతున్న సంజయ్ మల్హోత్రాకి ఆర్బిఐ గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. డిసెంబర్ 11 నుండి ఆయన ఆర్బిఐ గవర్నర్ గా కొనసాగుతారు... మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నాయి.
sanjay malhotra
ఎవరీ సంజయ్ మల్హోత్రా :
ఆర్బిఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్న సంజయ్ మల్హోత్రా 1990 బ్యాక్ ఐఏఎస్ అధికారి. రాజస్థాన్ బ్యాచ్ కు చెందిన ఈయన విద్యుత్, ఆర్థిక, ఐటీ, మైన్స్ మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తారు. ప్రస్తుతం డిప్యుటేషన్ పై కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేస్తున్నారు. ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం కార్యదర్శిగా వున్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఆర్థిక శాఖలో పనిచేసిన సంజయ్ మల్హోత్రాకు మంచి అనుభవం వుంది. ఆర్థిక, పన్నుల విషయంలోనూ ఆయనకు మంచి పట్టు వుంది. ప్రత్యక్ష, పరోక్ష పన్ను విధానాల రూపకల్పనలో మల్హోత్రాది కీలక పాత్ర. ఇలా చాలాకాలంగా ఆర్థిక వ్యవహాలను చూస్తున్న అనుభవమున్న ఆయనకు ఆర్భిఐను నడిపించే బాధ్యతలు అప్పగించారు.
sanjay malhotra
ఐఐటి నుండి ఆర్బిఐ గవర్నర్ వరకు సంజయ్ మల్హోత్రా ప్రయాణం :
సంజయ్ మల్హోత్రా ఐఐటి కాన్పూర్ లో కంప్యూటర్ సైన్స్ చదివారు. గ్రాడ్యూయేషన్ పూర్తయ్యాక ఉన్నతచదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేసారు. ఇలా దేశ విదేశాల్లో ఉన్నత విద్యాబ్యాసం చేసిన ఆయనకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. వాటన్నింటికి కాదని ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్ వైపు వచ్చారు.
అమెరికానుండి స్వదేశానికి వచ్చిన సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యాడు. ఇలా 1990 లో సివిల్స్ క్లియర్ చేసి రాజస్థాన్ లో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి ఆయన వెనుదిరిగి చూడలేదు... అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకుంటూ ప్రస్తుతం దేశంలోనే అత్యున్నత ఆర్థిక సంస్థ రిజర్వ్ బ్యాంక్ కు చీఫ్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ఆర్‌బిఐ గవర్నర్‌గా ప్రకటన రాకముందు సంజయ్ మల్హోత్రా రెవెన్యూ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన ఆర్‌ఈసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఇటీవల ఆయన అధిక పన్ను వసూళ్లలో కీలక పాత్ర పోషించారు.