- Home
- Business
- Rupee Vs dollar:డాలర్‌తో రూపాయి మరోసారి భారీ పతనం, మొదటిసారిగా 28 పైసలు పడిపోయి కనిష్ట స్థాయికి..
Rupee Vs dollar:డాలర్‌తో రూపాయి మరోసారి భారీ పతనం, మొదటిసారిగా 28 పైసలు పడిపోయి కనిష్ట స్థాయికి..
ఈ వారం మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం భారత కరెన్సీ రూపాయి మరోసారి భారీ పతనాన్ని నమోదు చేసింది. స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే డాలర్‌తో పోలిస్తే 28 పైసలు కోల్పోయి తొలిసారిగా 78 స్థాయి దిగువకు పడిపోయింది.

దీంతో రూపాయి సోమవారం ప్రారంభంలో కొత్త రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. US ద్రవ్యోల్బణం నాలుగు-దశాబ్దాల గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత ఫెడరల్ రిజర్వ్ అంచనాలను కఠినతరం చేయడం రూపాయిపై ఒత్తిడి తెచ్చింది, మొదటిసారిగా డాలర్‌కు రూపాయి 77స్థాయికి తాకినప్పుడు మార్చి నుండి కొత్త కనిష్టాలను తాకింది
ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 78.20 వద్ద ప్రారంభమైంది, ఆపై రికార్డు కనిష్ట స్థాయి 78.29 వద్దకు పడిపోయింది. గత చివరి ముగింపు నుండి 36 పైసల పతనం నమోదు చేసింది.
బలహీనమైన ఆసియా కరెన్సీలు, దేశీయ ఈక్విటీలలో పేలవమైన ధోరణి, నిరంతర విదేశీ మూలధన ప్రవాహాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లను ప్రభావితం చేశాయని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు.
గత సెషన్‌లో, US ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠ స్థాయికి ఎగబాకడంతో ఫెడ్ అంచనాలతో డాలర్‌తో రూపాయి దాని గత ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 77.93కి పడిపోయింది.
గత వారం చివరి ట్రేడింగ్ సెషన్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 77.83 వద్ద ముగిసింది. అంతర్జాతీయ స్థాయిలో నానాటికీ పెరుగుతున్న ముడి చమురు ధరల ప్రభావం రూపాయిపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రూపాయి బలహీనత దేశ ఆర్థిక వ్యవస్థపైనా, సామాన్యులపైనా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
రాబోయే రోజుల్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 81కి చేరుకోవచ్చని నిపుణులను ఉటంకిస్తూ ఒక నివేదిక పేర్కొంది. అంటే, దానిలో మరింత క్షీణత నమోదు చేయవచ్చు. అయితే ఈ స్థాయిని బ్రేక్ చేసిన తర్వాత మళ్లీ రూపాయి విలువ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రూపాయి పతనం కారణంగా పలు రంగాలపై పెను ప్రభావం కనిపించడం గమనార్హం. దీంతో చమురు ధరల నుంచి నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయి.