మీ బ్యాంకు అకౌంట్ నుండి డబ్బులు కట్ అయ్యాయా: అయితే కారణం ఏంటో తెలుసుకోండి ?
మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. చాలామందికి బ్యాంకుల్లో సేవింగ్స్ చేసే అలవాటు ఉంటుంది. ఇలా సేవింగ్స్ చేసిన వారి నుంచి రకరకాల చార్జెస్ వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు నిరంతరం వస్తున్నాయి.
మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఎప్పటికప్పుడు రూ.295 ఛార్జ్ చేస్తున్నారా.. . ఈ మొత్తం దేనికి ఛార్జ్ చేస్తారో చాలామందికి తెలియకపోవచ్చు. ఈ డబ్బు దేనికి వసూలు చేయబడిందనే దానిపై సమాధానం మీకోసం...
NACH (నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్) నిబంధనల ప్రకారం, గడువు తేదీలోపు లోన్ EMI చెల్లించని వారి నుండి రూ. 295 వసూలు చేయబడుతుంది. మీరు బ్యాంకు నుండి హోమ్ లోన్ లేదా మరేదైనా లోన్ తీసుకున్నారని అనుకుందాం. అదేవిధంగా ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్ ఫండ్‌ల లాగానే ప్రతినెలా పేమెంట్ ఉన్నప్పటికీ, గడువు తేదీలోపు చెల్లించాలి.
కానీ గడువు తేదీలో మీ బ్యాంకు అకౌంట్ లో డబ్బు లేకపోతే రూ.295 ఛార్జ్ వసూలు చేయబడుతుంది. బ్యాంకు అకౌంట్లో డబ్బు పడిన తర్వాత రూ.295 ఛార్జ్ కట్ చేస్తారు. గడువు తేదీలోగా బ్యాంకు అకౌంట్ నుండి చెల్లించనందుకు 250 రూపాయల జరిమానా అని. 18% GST 45 రూపాయలు. బ్యాంకు అకౌంట్ నుండి మొత్తం రూ.295 జరిమానా విధించబడుతుంది. కొన్ని బ్యాంకులు ఈ పెనాల్టీని ప్రతినెలా వసూలు చేస్తాయి. అయితే, కొన్ని బ్యాంకులు పెనాల్టీతో పాటు కొన్ని నెలల పాటు ఒకేసారి మొత్తంగా వసూలు చేస్తాయి.