MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Richest person: ఎలన్ మస్క్ కిరీటం కింద పడిపోయింది, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?

Richest person: ఎలన్ మస్క్ కిరీటం కింద పడిపోయింది, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?

మొన్నటి వరకు ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుపొందాడు. ఇప్పుడు ఆ కిరీటాన్ని అతను కోల్పోయాడు. ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడైన లారీ ఎల్లిసన్ తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. 

1 Min read
Author : Haritha Chappa
| Updated : Sep 11 2025, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు
Image Credit : X

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు

టెస్లా యజమాని అయిన మస్క్ కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలుస్తూ వచ్చాడు. ఇప్పుడు అతడి పాలన ముగిసినట్టు కనిపిస్తోంది. తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఒరాకిల్ సహవ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ నిలిచాడు. త్రైమాసిక ఫలితాల ద్వారా లారీ ఎల్లిసన్ సంపద 101 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు తెలిసింది. దీంతో ఆయనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎలన్ మస్క్ ఆస్తి ఎంత?
Image Credit : Pixabay

ఎలన్ మస్క్ ఆస్తి ఎంత?

బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ చెబుతున్న ప్రకారం ప్రస్తుతం లారీ ఎలిసన్ సంపద 393 బిలియన్ డాలర్లుగా తేలింది. ఇది మస్క్ సంపద కంటే ఎక్కువ. ప్రస్తుతం ఎలన్ మస్క్ సంపద 385 బిలియన్ డాలర్లుగా ఉంది.

35
లారీ ఎలిసన్ ఎవరు?
Image Credit : Bloomberg

లారీ ఎలిసన్ ఎవరు?

లారీ ఎల్లిసన్ వయసు ఇప్పుడు 81 ఏళ్లు. అతను ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు. ఆ కంపెనీ చైర్మన్ గా కూడా ఉన్నాడు. అతని సంపదలో ఎక్కువ భాగం సాఫ్ట్ వేర్ కంపెనీలో పెట్టుబడుల రూపంలోనే ఉన్నాయి.

45
టెస్టా షేర్లు పడిపోవడంతో
Image Credit : Tesla

టెస్టా షేర్లు పడిపోవడంతో

ఈ ఏడాది ఒరాకిల్ షేర్లు 45 శాతం పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. దీంతో లారీ ఎలిసిన్ ఆస్తులు కూడా పెరిగాయి. అయితే దీనికి విరుద్ధంగా ఈ ఏడాది టెస్లా షేర్లు 13 శాతం వరకు పడిపోయాయి. దీంతో ఎలాంటి జాబితాలో రెండో స్థానానికి చేరిపోయాడు.

55
మస్క్ మళ్లీ వచ్చేనా?
Image Credit : X

మస్క్ మళ్లీ వచ్చేనా?

2021లో మొదటిసారిగా మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. ఆ తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వంటి వారు కూడా మొదటి స్థానంలోకి వచ్చారు. కానీ గత ఏడాది మస్క్ తిరిగి అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానంలోకి వచ్చాడు. కానీ ఎక్కువ కాలం నిలవలేకపోయాడు. లారీ ఎలిసన్ చేతిలో ఓడిపోయాడు. భవిష్యత్తులో అతను తిరిగి ధనవంతుడిగా మొదటి స్థానంలో నిలిచే అవకాశాలు ఇంకా ఉన్నాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Fall: నవరాత్రి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. దిగొచ్చిన బంగారం
Recommended image2
Amazon: ఆఫర్స్ ఉన్నా లేకున్నా అమెజాన్‌లో చీప్‌గా దొరికే 5 వస్తువులు ఇవే!
Recommended image3
Dhruv Rathee’s Cars: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ రాయల్ లైఫ్‌స్టైల్.. గ్యారేజ్‌లో ఉన్న టాప్ లగ్జరీ కార్లు ఇవే
Related Stories
Recommended image1
ఎలన్ మస్క్ సూపర్ ఆఫర్.. రోజుకి 7 గంటలు నడవడమే ఉద్యోగం, వేలల్లో జీతం
Recommended image2
ఎలన్ మస్క్‌ది ఎంత పెద్ద మనసు, గ్రోక్ ఇమాజిన్ ఫ్రీగా వాడుకోవచ్చట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved