రియల్‌మీ 14x, పోకో M7 Pro ధర ఇంత తక్కువా? ఏది బెస్ట్ ఫోనో తెలుసా?
రియల్‌మీ, పోకో కంపెనీలు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవలే ఇండియాలో లాంచ్ చేశాయి. రియల్‌మీ 14x 5G, పోకో M7 Pro 5G ఫోన్లు రెండూ ఒకదాన్నిమించి ఒకటి బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. వాటి డిస్‌ప్లే, పనితీరు, బ్యాటరీ, కెమెరా, ధరల వివరాలు తెలుసుకొని ఏది బెస్ట్ ఫోనో పరిశీలిద్దాం రండి.
రియల్‌మీ 14x vs పోకో M7 Pro
మీరు తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఇటీవలే మార్కెట్లోకి రియల్‌మీ, పోకో కంపెనీలు కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేశాయి. రియల్‌మీ 14x, పోకో M7 Pro రెండూ కూడా కేవలం రూ.15,000 ధరలో లభిస్తాయి. మంచి ఫీచర్లు, పనితీరు, డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు ఫోన్లలో ఏది కొనాలో తెలుసుకోవడం కష్టమే. అయితే రెండింటిలో ఉన్న ఫీచర్స్ ను ఓసారి పరిశీలించి చూద్దాం.
డిజైన్, డిస్‌ప్లే
IP69 రేటింగ్, మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌తో పాటు స్టైలిష్, స్ట్రాంగ్ డిజైన్‌తో రియల్‌మీ 14x లాంచ్ అయ్యింది. పోకో M7 Pro డ్యూయల్ టోన్ డిస్‌ప్లేతో ప్రీమియం లుక్‌తో ఉంది. రెండు ఫోన్లు ఫ్లాట్ స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి.
రియల్‌మీ 14x 5Gలో 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. పోకో M7 Pro 5Gలో అయితే 6.67 అంగుళాల FHD AMOLED డిస్‌ప్లే 2100 నిట్స్ బ్రైట్‌నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్ కూడా ఉంది.
కెమెరా ఎలా ఉందంటే..
రియల్‌మీ 14x 5G డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్ కలిగి ఉంది. అదే పోకో M7 Proలో అయితే 2MP డెప్త్ సెన్సార్, 50 MP వైడ్-యాంగిల్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం రియల్‌మీలో 8 MP సెన్సార్ ఉండగా, పోకోలో 20 MP సెన్సార్ ఉంది.
బ్యాటరీ, ప్రాసెసర్
రియల్‌మీ 14x 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 CPU, 8GB RAM, 128 GB స్టోరేజ్‌కెపాసిటీ ఉంది. పోకో M7 Pro 5Gలో అయితే 256 GB స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. అంతేకాకుండా 8 GB RAM, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ఉన్నాయి. పోకో M7 Pro 5Gలో 5110mAh బ్యాటరీ ఉండగా, రియల్‌మీ 14xలో 6000mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
ధర ఎంతో తెలుసా?
రియల్‌మీ 14x 5G, పోకో M7 Pro 5G రెండు ఫోన్లు బేస్ వేరియంట్ ధర రూ.14,999 నుంచి మొదలవుతున్నాయి. రెండు ఫోన్లు ఒకే ధరలో ఉన్నా, ఫీచర్లలో కాస్త తేడా ఉంది. ఒకదాంట్లో కెమెరా ఫీచర్లు బాగుంటే, మరో దాంట్లో స్టోరేజ్ కెపాసిటీ, ప్రాసెసర్ లాంటి ఫీచర్లు బాగున్నాయి. అందువల్ల మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీకు నచ్చిన ఫోన్ తీసుకోవచ్చు.